Tasty Mango Milk Shake Recipe : వేసవిలో మామిడి పండ్లతో పాటు.. వాటితో తయారు చేసే ఎన్నో రెసిపీలకు మంచి పేరు ఉంది. వాటిలో మిల్క్ షేక్ ఒకటి. వేడి వేడి ఎండల్లో చల్లటి మ్యాంగో మిల్క్​షేక్​ తాగితే ప్రాణం లేచి వస్తుంది. మరి ఈ టేస్టీ, కమ్మని, చల్లని మిల్క్​షేక్ (Mango Milk Shake)​ కోసం బయటకు వెళ్లాల్సివస్తుందా? అయితే దీనిని మీరు ఇంట్లోనే చేసుకోగలిగే సింపుల్ రెసిపీ ఇక్కడ ఉంది. ఈ టేస్టీ రెసిపీని ఏవిధంగా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు 


మామిడి పండ్లు - 2 


పాలు - 350 మి.లీ


పెరుగు - అర లీటర్


పంచదార - ముప్పావు కప్పు


మ్యాంగో ఎసెన్స్ - పావు టీస్పూన్


జీడిపప్పు - 3 టేబుల్ స్పూన్లు


ఐస్ క్యూబ్స్ - 20 


తయారీ విధానం


ముందుగా మామిడిపండ్లను పైన తొక్క తీసి.. గుజ్జును ముక్కలుగా కోసి ఓ బౌల్​లోకి తీసుకోవాలి. వాటిని ఫ్రిడ్జ్​లో ఓ గంట ఉంచాలి. అప్పుడే మిల్క్ షేక్​ సమ్మర్​లో మీరు చిల్ అయ్యేలా చేస్తుంది. కూల్​గా ఉండడం వల్ల మ్యాంగో మిల్క్ షేక్ తాగుతున్నప్పుడు మీకు హాయిగా ఉంటుంది. ఇప్పుడు పాలను కాచుకుని.. అవి వేడి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్​లో పెట్టుకోవాలి. అవి కూడా పూర్తిగా చల్లగా ఉండాలి. ఇప్పుడు జీడిపప్పును ఓ అరగంట నానబెట్టుకోవాలి. జీడిపప్పు కేవలం ఆప్షనే. కానీ రుచి కావాలనుకున్నప్పుడు దీనిని స్కిప్ చేయకపోవడమే మంచిది. ఈలోపు చక్కెరను మిక్సీ జార్​లోకి తీసుకోవాలి. అది మెత్తగా పొడి అయ్యేవరకు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. 


ఇప్పుడు మామిడి పండ్ల ముక్కలను ఫ్రిడ్జ్​లో నుంచి తీసి.. వాటిని బ్లెండర్​లో వేసుకోవాలి. దానిలో చల్లని పాలు, పంచదార, మ్యాంగో ఎసెన్స్, ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ చేసుకోవాలి. మ్యాంగో ఎసెన్స్ వల్ల మిల్క్ షేక్ మరింత రుచిగా మారుతుంది. మంచి ఫ్లేవర్​ని ఇస్తుంది. వద్దు అనుకునేవారు దీనిని పూర్తిగా స్కిప్ చేసేయవచ్చు. కాస్త తాగినప్పుడు మంచి ఫ్లేవర్ కావాలనుకుంటే మాత్రం కచ్చితంగా దీనిని వేసుకోండి. ఇప్పుడు హై స్పీడ్​లో మిల్క్​షేక్​ను బ్లెండ్ చేయాలి. అనంతరం దానిలో పెరుగు వేసి.. మరోసారి హై స్పీడ్​లో బ్లెండ్ చేయాలి.


మామిడి ముక్కలు పూర్తిగా బ్లెండ్ అయి.. పాలు, పెరుగులో పూర్తిగా కలిసిపోయేలా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్లాస్​లలో మ్యాంగో మిల్క్ షేక్​ని వేసుకుని సర్వ చేసుకోవాలి. నానబెట్టిన జీడిప్పపు, మామిడి ముక్కలతో దీనిని సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. దీనిని మీరు రెగ్యూలర్​గా చేసుకోవచ్చు. చేసుకున్న వెంటనే తాగవచ్చు. లేదంటే ఫ్రిడ్జ్​లో ఉంచి.. మరింత చల్లగా అయిన తర్వాత అయినా సేవించవచ్చు. పిల్లలు కూడా దీనిని చాలా ఇష్టంగా తీసుకుంటారు. కాబట్టి మీరు కూడా ఈ రెసిపీని తప్పక ట్రై చేసి.. పిల్లలకు, పెద్దలకు అందించేయండి. 


Also Read : టేస్టీ, ఇన్​స్టాంట్ ఉతప్పం రెసిపీ.. చాలా ఈజీగా దీనిని రెడీ చేసుకోవచ్చు