కొంతమంది అర్థరాత్రి నిద్రలోనే మాట్లాడుతుంటారు (Talking in sleep). నవ్వుకుంటారు, చప్పట్లు కొడతారు. కళ్లు తెరవకుండానే గలగల మాట్లాడేస్తుంటారు.కొంతమంది మాత్రం అస్పష్టంగా గొణుగుతుంటారు, పెద్దగా అరుస్తుంటారు. ఇలా 30 సెకన్ల పాటూ చేస్తారు. ఒక్కరాత్రిలి ఇలాంటి 30 సెకన్ల ఎపిసోడ్లు ఎన్నయినా ఉండొచ్చు.పక్కనున్న వారు ఇదంతా చూసి నవ్వుకుంటారు. నిజానికి అలా నిద్రలో మాట్లాడడం కూడా ఒక రుగ్మతే. దీన్ని వైద్య భాషలో ‘సామ్నిలోఖి’ అంటారు. ఇది స్వీప్ వాకింగ్ లాంటి ఒక వ్యాధే. ఇది అధికంగా టీనేజీ పిల్లల్లో కనిపిస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ దానికదే తగ్గిపోతుంది. అందుకే దీనికి చికిత్స, మందులతో అవసరం లేదు. నిద్రలో మాట్లాడిన విషయాలు మెలకువ వచ్చాక అడిగితే వారికేమీ గుర్తుండవు. 


ఇదొక పారసోమ్నియా
స్లీప్ టాకింగ్ లేదా సోమ్నిలోఖి... ఇదొక పారాసోమ్నియా. అంటే నిద్రలో జరిగే ఒక అసాధారణ ప్రవర్తన. ఇది సాధారణ సమస్యగా మాత్రం భావించద్దు. ఒక్కోసారి వారు మాట్లాడే మాటలు చాలా భయంకరంగా, అసభ్యంగా, అభ్యంతరకరంగా ఉంటాయి. వారి వ్యక్తిత్వానికి వారు నిద్రలో మాట్లాడే మాటలకు సంబంధం కనిపించకపోవచ్చు.


పిల్లల్లోనూ..
మూడేళ్ల నుంచి 10 ఏళ్లలోపు పిల్లల్లో సగం మంది నిద్రలో మాట్లాడుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. అదే పెద్దవారిలో దాదాపు 5 శాతం మంది నిద్రలో చిట్ చాట్ మొదలుపెడతారు. 


కారణాలేంటి?
నిద్ర పోయిన వెంటనే ఇలా మాట్లాడడం మొదలుపెట్టారు. కలలు కనే సమయంలోనే నిద్రలో మాట్లాడడం జరుగుతుంది. కొందరికి ఇది వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. అలాగే కొన్ని రకాల మందులు వాడడం వల్ల, తీవ్ర ఒత్తిడి, మానసిక సమస్యలు, తీవ్ర జ్వరం, నిరంతరం హింసకు గురికావడం వీటి వల్ల కూడా సామ్నిలోఖి రావచ్చు. మరీ రాత్రంగా అధికంగా మాట్లాడుతున్నట్టయితే వైద్యుడిని సంప్రదించాల్సి రావచ్చు. వారు స్లీప్ స్టడీ, స్లీప్ రికార్డింగ్ వంటి టెస్టులు చేసి తీవ్రతను నిర్ణయిస్తారు. చాలా అరుదైన సందర్భాల్లోనే స్లీప్ టాకింగ్ విషయంలో మందులు సూచిస్తారు. 


ఈ సమస్య బారి నుంచి బయటపడాలంటే రోజుకి కనీసం గంటసేపైనా వ్యాయామం చేయాలి. జీవితంలో ఒత్తిళ్లను తగ్గించుకోవాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. పిల్లల్లో ఈ సమస్య రాకుండా ఉండాలంటే వారిని కొట్టడం, తిట్టడం, వారి ముందే  భార్యాభర్తలు గొడవపడడం వంటివి తగ్గించుకోవాలి.


Also read: గర్భస్రావం అయితే ఆ లోపం భార్యదే కాదు భర్తది కూడా కావచ్చు


Also read: వేసవిలో పెట్టే ఆవకాయలు, ఊరగాయలతో ఆరోగ్యానికి ఎంతో మేలు