ఉబ్బసంతో బాధపడే వాళ్ళు శ్వాస తీసుకోవడానికి చాలా కష్టపడతారు. ఇక అటువంటి వాళ్ళు వ్యాయామాలు చెయ్యడమంటే తమ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టినట్టే. ఎందుకంటే కఠినమైన వ్యాయామాలు చెయ్యడం వల్ల కొద్దిగా రొప్పు, అలసట శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే అస్తమాతో బాధపడే వాళ్ళు వ్యాయామానికి దూరంగా ఉంటారు. కానీ శరీరానికి సరిగా వ్యాయామం లేకపోతే బరువు పెరిగే అవకాశం ఉంది. అందుకే అస్తమాతో బాధపడే వాళ్ళు కఠినమైన వాటిని కాకుండా సింపుల్‌గా స్విమ్మింగ్ చేయవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఆస్తమా లక్షణాలు కూడా తగ్గుతాయి. స్విమ్మింగ్ ఆస్తమా బాధితులకు ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం.
❄ ఈత కొట్టడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుపడుతుంది. స్విమ్మింగ్ చేసేటప్పుడు ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి. ఆ సమయంలో శ్వాస పీల్చుకునేటప్పుడు ఊపిరితిత్తుల మీద ఎటువంటి ఒత్తిడి పడకుండా ఉంటుంది.
❄ క్రమం తప్పకుండా ఈత కొట్టడం వల్ల శ్వాసనాళాలలో ఏదైనా ఇబ్బంది ఉండి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటే ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఇది దోహదపడుతుంది. అప్పుడు మీరు శ్వాస తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తదు. ఊపిరితిత్తులపై ఉండే ఒత్తిడిని ఇది తగ్గిస్తుంది.
❄ స్విమ్మింగ్ చెయ్యడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. అప్పుడు రోజువారీ పనులు ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా చేసుకోవచ్చు.
❄ స్విమ్మింగ్ ఓర్పుని పెంచుతుంది. ఎక్కువసేపు ఈత కొట్టేటప్పుడు ఓర్పుగా ఉండేలాగా ఊపిరితిత్తులు అలవాటు పడతాయి. దీనివల్ల రోజంతా శ్వాస సమస్యలు రాకుండా పనులు చేసుకోవచ్చు.
❄ స్విమ్మింగ్ చెయ్యడం వల్ల శరీరం మొత్తం వ్యాయామం చేసినట్లవుతుంది. బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. గంట పాటు స్విమ్మింగ్ చెయ్యడం వల్ల ఖర్చయ్యే కేలరీలు సైక్లింగ్ లేదా రన్నింగ్ చెయ్యడం వల్ల ఖర్చయ్యే కేలారీల కంటే ఎక్కువగా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి చాలా మంది ఇచ్చే సలహా స్విమ్మింగ్ చేయమనే.
❄ ఒత్తిడి తగ్గి బాగా నిద్ర పడుతుంది. శరీరం మొత్తం వ్యాయామం చెయ్యడం వల్ల అలసటగా అనిపించి హాయిగా నిద్రపడుతుంది. కండరాలను శాంతపరిచి మెదడు చురుగ్గా ఉండేలాగా చేస్తుంది. ఫలితంగా చురుగ్గా ఆలోచించగలరు. ఉబ్బసం బాధితులు స్విమ్మింగ్ చేయడానికి ప్లాన్ చేసే ముందు మీరు తప్పకుండా డాక్టర్ సలహా తీసుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: తెల్ల జుట్టు భయపెడుతోందా? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే నల్లని జుట్టు మీ సొంతం
Also read: మధుమేహం రాకుండా ఉండాలన్నా, వచ్చాక అదుపులో ఉండాలన్నా దివ్యౌషధం ఇదే