Refined Sugar vs Natural Honey : ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటూ.. ఫ్యాట్ బర్నర్ డ్రింక్ అంటూ చాలామంది తాగుతూ ఉంటారు. మరికొందరు పంచదారకు బదులుగా షుగర్ తీసుకుంటారు. డయాబెటిస్ ఉన్నవారు కూడా పంచదారను వదిలేసి తేనెతో తమ ఫుడ్ క్రేవింగ్స్ తీర్చుకుంటారు. మరి ఈ తేనె నిజంగానే ఫ్యాట్ బర్నరా? షుగర్​ కంటే మంచిదేనా? బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుందా? నిపుణులు ఇచ్చే సలహాలు ఏంటి?

తేనె, పంచదారకు ఉన్న తేడాలివే.. 

పంచదారను పాయిజన్​గా, తేనెను హెల్తీ ఫ్యాట్ బర్నర్​గా అనుకునేవారు అసలు వాటిలో ఉన్న కేలరీలు, పోషకాలు ఏంటో తెలుసుకోవాలి. అప్పుడే వాటిని డైట్​లో ఉంచుకోవచ్చో లేదో తెలుస్తుంది. కాబట్టి ముందుగా వాటిలోని తేడాలు ఏంటో చూసేద్దాం. 

తేనె, పంచదారలోని కేలరీలు

100 గ్రాముల పంచదారలో 390 కేలరీలు ఉంటాయి. అలాగే 100 గ్రాముల తేనెలు 310 కేలరీలు ఉంటాయి. అయితే తేనె కంటే షుగర్ డెన్సర్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఓ స్పూన్ పంచదార 10 గ్రాములు ఉంటే.. తేనె 20 గ్రాములు ఉంటుంది. కాబట్టి తేనెలో కాస్త తక్కువ కేలరీలు ఉన్నా.. తెలియకుండా ఎక్కువగా తీసుకుంటాము కాబట్టి కేలరీలు ఎక్కువయ్యే అవకాశముంది. 

తేనె, పంచదారలోని పోషకాలు.. 

కేలరీల సమానంగా ఉన్నా.. తేనెలో పోషకాలు ఉంటాయి. అవి ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయనుకునేవారు.. రెండిటిలోని న్యూట్రిషన్స్ గురించి తెలుసుకోవాలి. పంచదారలో కార్బ్స్ 100 శాతం ఉంటాయి. అయితే ఇతర పోషకాలు మాత్రం 0. తేనెలో 87 శాతం కార్బ్స్ ఉంటాయి. ప్రోటీన్, ఫైబర్ అతి తక్కువ మోతాదులో ఉంటాయి. ప్యూర్ తేనెలో పలు విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అయితే అవి శరీరానికి అందాలంటే తేనెను మోతాదుకు మించి ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల కేలరీలు పెరుగుతాయి. షుగర్ కంటే ఎక్కువ కార్బ్స్, కేలరీలు శరీరానికి అందించినట్లు అవుతుంది. 

డయాబెటిస్ పేషెంట్లు తేనెని తీసుకోవచ్చా?

పంచదార కంటే తేనెలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. అది ఎక్కువ డిఫరెన్స్ చూపించకపోయినా.. రక్తంలోని షుగర్​ని కాస్త నెమ్మదిగా స్పైక్ చేస్తుంది. అందుకని ఇది డయాబెటిస్ ఫ్రెండ్లీ అని చెప్పలేము. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు తేనెను కూడా మోతాదుకు మించి తీసుకోకపోవడమే మంచిది. ముఖ్యంగా వైద్యుల సూచనలు ఫాలో అవ్వాలి. 

ఫ్యాటీ లివర్.. 

తేనె, పంచదార రెండింటిలోనూ ఫ్రక్టోజ్ ఉంటుంది. ఇది కాలేయం ద్వారా ప్రాసెస్ అవుతుంది. వీటిని అధిక మోతాదులో తీసుకుంటే ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఎక్కువ. తేనె లేదా పంచదార ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు ఫ్రక్టోజ్ లివర్ ద్వారా ప్రాసెస్ అయి ఫ్యాటీ లివర్, ఇన్సులిన్ నిరోధకత, ట్రైగ్లిజరైడ్​లను పెంచుతుంది. కాబట్టి రెండూ అంత మంచివేమి కాదు. 

తేనె మంచిదా? పంచదార బెటరా?

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పంచదార కంటే తేనె కాస్త బెటరే. అలా అని పూర్తిగా మంచిదని చెప్పలేమని అంటున్నారు. మోడరేషన్​లో తీసుకున్నప్పుడు తేనెకి, షుగర్​కి పెద్ద తేడా ఉండదని చెప్తున్నారు. తేనెతో ప్రయోజనాలు పొందాలంటే సహజమైనదే ఎంచుకోవాలి. లేదంటే రెండిటీకి పెద్ద డిఫరెన్స్ ఉండదని అంటున్నారు. అలాగే తేనే ఫ్యాట్ బర్నర్​ కాదని.. పంచదార పాయిజన్ కాదని.. ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఏదైనా చెడు ఫలితాలే ఇస్తుందని చెప్తున్నారు. ఏది తీసుకున్నా దానిని తక్కువ మోతాదులోనే తీసుకోవాలని సూచిస్తున్నారు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.