Energy Drinks: ఎనర్జీడ్రింక్స్ పేరుతో రకరకాల పానీయాలు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ డ్రింక్స్ తాగితే విద్యార్థుల ఫెర్ఫార్మెన్స్ పెరుగుతుందని యాడ్స్ ఊదరగొడుతున్నాయి. ఈక్రమంలో శక్తి వస్తుందని.. వారి ఎదుగుదలకు ఉపయోగపడుతుందని వీటిని విద్యార్థులు తెగ తాగేస్తున్నారు. అయితే ఈ ఎనర్జీ డ్రింక్స్ తాగే విద్యార్థులకు శక్తి కాదు.. అనారోగ్యం బారినపడే అవకాశం ఉందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 


ఈరోజుల్లో విద్యార్థులు లైఫ్ చాలా జోష్ ఫుల్ గా ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో చదవునేది పెద్ద ఛాలెంజ్ తో కూడుకున్నది. అర్థరాత్రి దాటేవరకు చదువులు, వీకెండ్ పార్టీలు.. ఏడాదికాలంలో పగలే కాదు రాత్రిళ్లు కూడా బిజీగా గడుపుతున్నారు. సరైన ఆహారం కూడా తీసుకోవడం లేదు. దాహానికైనా, ఆకలికైనా.. ఎనర్జీ డ్రింక్స్ తాగేస్తున్నారు. వీటి వల్ల భవిష్యత్తులో చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎనర్జీ డ్రింక్స్ వల్ల రాత్రిళ్లు నరకం చూస్తారట. నిద్ర పట్టక విలవిల్లాడతారట. దానికి అనుబంధం కొత్త కొత్త రోగాలతో బాధపడతారట. భవిష్యత్తులో రోగాలతో సావాసం చేస్తారట.


పరిశోధనల్లో షాకింగ్ విషయాలు వెల్లడి:


ఎనర్జీ డ్రింక్స్ అనారోగ్య సమస్యలకు కారణమవుతాయని, నిద్రలేమికి దారితీస్తాయనే విషయం చాలా మందికి తెలియదని తాజాగా పరిశోదనలో బయటపడింది. ఓపెన్ యాక్సెస్ జర్నల్ బీఎంజే ఓపెన్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ఎనర్జీ డ్రింక్ తాగడం వల్ల ఆరోగ్యకరమైన నిద్ర దూరం అవుతుంది. ఎనర్జీ డ్రింక్‌కు బానిసలైన చాలా మంది విద్యార్థులు నిద్రలేమితో బాధపడుతున్నారు. 


షాకిస్తున్న పరిశోధన ఫలితాలు:


ఈ పరిశోధన కోసం దాదాపు 18 నుంచి 35 ఏళ్ల వయస్సున్న 53,266 మంది విద్యార్థులకు సంబంధించిన డైలీ డేటాను సేకరించారు. అందులో వారు తీసుకునే ఎనర్జీ డ్రింక్స్ క్వాంటిటీని, వారు నిద్రిస్తున్న సమయాన్ని, ఆరోగ్యకరమైన నిద్ర మధ్య ఉన్న సంబంధాన్ని ట్రాక్ చేస్తూ అధ్యయనం చేశారు. పరిశోధన ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఎనర్జీ డ్రింక్స్ క్రమం తప్పకుండా తీసుకునే స్టూడెంట్స్ చాలా తక్కువ నిద్రించడం, నిద్రకు ఇబ్బంది కలిగించే ఇతర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని పరిశోధకులు గుర్తించారు. ఎనర్జీ డ్రింక్స్ ఎంత ఎక్కువగా తీసుకుంటే నిద్ర సమస్యలు అంత తీవ్రంగా ఉంటాయని తెలుసుకున్నారు. 


పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఎనర్జీ డ్రింక్స్ లో చక్కెర, విటమిన్లు, మినరల్స్, అమైనో ఆమ్లాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అదనంగా లీటరకు 150 మిల్లీగ్రాముల కెఫిన్ కూడా ఉంటుంది. ఇవి శారీరకంగా, మానసికంగా యాక్టివ్ గా ఉంచుతాయని యువత, ప్రత్యేకంగా కాలేజీ స్టుడెంట్స్ వీటిని బాగా ఇష్టపడుతారు. ఈ పదార్థాలు మెదడులోని అడెనోసిస్ అనే నిద్రను ప్రేరేపించే రసాయనం నిరోధించాయని పరిశోధకులు భావిస్తున్నారు. దీని ఫలితంగా ఎనర్జీ డ్రింక్స్ తీసుకునే వ్యక్తులు నిద్రపోవడం కష్టంగా మారుతుంది నిద్రలేమి తీవ్రమైన రుగ్మత. దానివల్ల శ్రద్ధ, జ్ఞాపకశక్తి, మానసిక స్థితి.. మొత్తం అనారోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఆ అధ్యయనం ఫలితం కళాశాల విద్యార్థులకు ఒక హెచ్చరికగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఎనర్జీ డ్రింక్స్ తాత్కాలిక శక్తిని మాత్రమే ఇస్తాయి. కానీ అవి దీర్ఘకాలంలో మీ ఆరోగ్యానికి తీవ్ర ఇబ్బందులను కలిగిస్తాయి. 


Also Read : ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే మీ గుండె పదిలంగా ఉంటుంది






















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.