టెక్నాలజీ.. కళ్లు మూసి తెరిచే లోపే కొత్త ఆవిష్కరణలతో కళ్ల ముందు ఉంటోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటలెజెన్స్ వంటివి మానవ మనుగడలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. భవిష్యత్తులో ఇవి మనల్ని డామినేట్ చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అయితే, ఈ ఏఐ టెక్నాలజీతో శరీరంలోని అనారోగ్యాన్ని ముందుగానే గుర్తించే రోజులు వస్తున్నాయట. ముఖ్యంగా గుండె సమస్యలను ముందుగా తెలుసుకొనేందుకు ఇది చక్కగా ఉపయోగపడుతుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.
ఆర్టిఫిషియల్ ఇంటలెజెన్స్ టూల్స్ ఉపయోగించి నాలుగు రకాల హార్ట్ ఫెయిల్యూర్ లను ముందుగానే తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని కొత్త అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఈ అధ్యయనానికి భారతీయ సంతతికి చెందిన శాస్త్రవేత్త నేతృత్వం వహించడం గమనార్హం.
లాన్సెట్ డిజిటల్ హెల్త్‌లో తాజాగా ఈ అధ్యయనం గురించి వివరించారు. యూనివర్సిటి కాలేజ్ లండన్ కి చెందిన పరిశోధకులు 20 సంవత్సరాల్లో దాదాపు 3,00,000 మంది 30 సంవత్సరాల పైబడిన వయస్కులు హార్ట్ ఫెయిల్యూర్‌తో బాధ పడుతున్నట్లు తెలుసుకున్నారు.
రకరకాల మెషిన్ లెర్నింగ్స్ ద్వారా ఐదు రకాల హార్ట్ ఫెయిల్యూర్ సబ్ టైప్స్ ను కనుగొన్నారు. ఎర్లీ ఆన్ సెట్, లేట్ ఆన్ సెట్, ఎట్రియల్ ఫైబ్రిలేషన్ కు సంబంధించినవి ఈ సమస్యలో గుండె లయ తప్పుతుంటుంది. మెటబోలిక్ అంటే కార్డియో వాస్క్యూలార్ డిసీజ్ తో కూడిన స్థూలకాయం. కార్డియో మెటబోలిక్ అని ఐదు రకాలుగా హార్ట్ ఫెయిల్యూర్ సమస్యలను గుర్తించారు. ఈ డేటా ద్వారా హార్ట్ ఫెయిల్యూర్ సమస్య డయాగ్నస్ అయిన తర్వాత ఎన్ని సంవత్సరాల్లో వారు మరణిస్తున్నారనే విషయంలో తేడాలను గుర్తించారు.
ఎర్లీ ఆన్ సెట్‌లో మరణ ప్రమాదం 20 శాతం, లేట్ ఆన్ సెట్ 46 శాతం, ఏట్రియల్ ఫిబ్రిలేషన్లో 61 శాతం, మెటబాలిక్ 11 శాతం, కార్డియోమెటబాలిక్ 37 శాతం వరకు ఉంటుంది. ఈ పరిశోధకుల బృందం ఒక ఆప్ కూడా రూపొందించింది. దీన్ని క్లీనిషిన్స్ వాడుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. దీని ద్వారా ఏ సబ్ టైప్ కిందకు పేషెంట్లు వస్తారో తెలుసుకోవడం సులభం అవుతుంది. అంతేకాదు ఎవరికి భవిష్యత్తులో ఈ సమస్య వచ్చే ప్రమాదం ఉందో కూడా తెలుసుకుని వారికి జాగ్రత్తలు, సూచనలు చేసేందుకు ఈ ఆప్ ఉపయోగపడుతుంది.
హార్ట్ ఫెయిల్యూర్ సమస్యను తీవ్రతను బట్టి విభజించి చికిత్సను మరింత మెరుగు పరచాలనేదే తమ ఆలోచన అని, పేషెంట్లకు సరైన రీతిలో వివరంగా చెప్పి ఎలాంటి జాగ్రత్తలు అవసరమవుతాయో, చికిత్సా పద్ధతులను గురించి చెబుతూ, హార్ట్ ఫేయిల్యూర్ సమస్య ప్రతి వ్యక్తికి ఎలాంటి తేడాలను చూపుతుందనే అవగాహనను కలిగించాలనేదే తమ ఆలోచన అని ఈ పరిశోధకులు చెబుతున్నారు. కొంత మంది పేషెంట్లు సమస్య నిర్ధారించిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాల పాటు స్థిరంగా ఉంటారు. మరి కొంతమందిలో చాలా త్వరగా పరిస్థితులు చేయి దాటి పోతాయని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన అమిత్వ బెనర్జీ వివరించారు.
హార్ట్ ఫెయిల్యూర్స్ లో రకాల గురించి అవగాహన కలిగి ఉండడం వల్ల టార్గెటెడ్ ట్రీట్మెంట్ కి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాదు చికిత్సల్లో ఎలాంటి తేడాలను చూపించాలనే విషయం అర్థం చేసుకోవడానికి పేషెంట్లకు అర్థం చేయించడం కూడా సులభం అవుతుంది. ఈ ఆప్ వినియోగం ద్వారా క్లినిషియన్స్ పేషెంట్లకు అవగాహన కల్పించడం సులభం అవుతుంది. అంతేకాదు చికిత్స విధానంలో కూడా మార్పులు వస్తాయి. ఇది ఎంత వరకు అందరికి అందుబాటులోకి తేవచ్చనే దాని గురించి ఇంకా ఒక నిర్ధారణ కు రాలేదు. ఈ ఆప్ డిసైన్ ఇంకా క్లినికల్ ట్రయల్స్ కోసం మరింత పరిశోధన సాగాల్సి ఉంటుంది. కానీ ఇది పూర్తి స్థాయిలో రూపొందితే కచ్చితంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.