ఎండ వేడి విపరీతంగా ఉంటోంది. ఈ వేడి వాతావరణం చెమటతో మహా చికాకుగా ఉంటోంది. అంతేకాదు కొన్ని రకాల దుస్తులు ధరించడం కష్టం కూడా. కాస్త బిగుతైన దుస్తులు ధరిస్తే అసౌకర్యం మాత్రమే కాదు చెమట పట్టిన చోట వేసుకున్న దుస్తులు రంగు మారి చూసేందుకు ఎబ్బెట్టుగా ఉంటాయి కూడా. ఇక ఈ వాతావరణంలో అలాంటి డ్రెస్ లు వేసుకోవడం కుదరదు.


చికాకు కలిగించే ఈ చెమట నుంచి విముక్తి కావాలా? కానీ చెమట కూడా శరీరానికి అవసరమే. వేడి వాతావరణంలో శరీరం చల్లబడాలంటే చెమట రావల్సిందే. హీట్ స్ట్రోక్ వల్ల ప్రాణాపాయం కలగకుండా కాపాడేది చెమటే అనే విషయం మరచి పోవద్దు. శరీరం లోపలి ఉష్ణోగ్రతలు పెరగడం మొదలుకాగానే మెదడులోని చిన్న భాగమైన హైపోథాలమస్ చెమట ద్వారా శరీరాన్ని చల్ల బరచాలనే సంకేతాన్ని స్వేదగ్రంథులకు సూచనలు ఇస్తుంది.


ఎక్కువ చెమట ఎందుకు?


స్వేద గ్రంథులు అందరిలో ఒకేవిధంగా ఉంటాయి. కానీ కొన్ని కారణాలతో కొందరిలో ఎక్కువ చురుకుగా ఉంటాయి.




  • శరీర బరువు – పరిమాణం




బరువు ఎక్కువగా ఉండి పెద్దగా ఉండే వ్యక్తుల శరీరం నుంచి ఎక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది. కనుక వీరి శరీర ఉష్ణోగ్రత నియంత్రించేందుకు తప్పనిసరిగా ఎక్కువ చెమట ఉత్పత్తి కావల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల వారిలో చెమట ఎక్కువగా ఉంటుంది.




  • హార్మోన్లు




కొంత మందిలో హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కూడా శరీరంలో స్వేద గ్రంథులు ఎక్కువ పనిచెయ్యాల్సి వస్తుంది. ఎందుకంటే పెరిమెనోపాజ్ లో ఉన్న మహిళల్లో హాట్ ఫ్లషెస్ వస్తుంటాయి. అందువల్ల శరీరంలో అంతర్గత ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. అటువంటి సమయంలో తప్పనిసరిగా ఎక్కువ చెమట ఉత్పత్తి అవుతుంది. కొంత మందిలో గర్భధారణ సమయంలో కూడా హార్మోన్లు మార్పులు, చర్మానికి రక్త ప్రసరణలో మార్పుల వల్ల కూడా స్వేద గ్రంథులు యాక్టివ్ గా మారుతాయి.




  • ఫిట్ నెస్ సరిగ్గా లేకపోవడం




ఈస్ట్రోజన్ స్థాయిలు పడిపోవడం వల్ల ఇత హార్మోన్ల స్థాయి ఎక్కువగా ఉండడం వల్ల బ్రెయిన్ లోని థర్మోస్టార్ట్ ప్రభావితమై శరీర ఉష్ణోగ్రత పెరిగిపోవడం వల్ల స్వేద గ్రంథులు ఎక్కువ ప్రబావితం అవుతాయి. అందువల్ల




  • అనారోగ్యం




ఆరోగ్యం సరిగ్గా లేనపుడు శరీరంలోని నిరోధక వ్యవస్థ ఇన్ ఫెక్షన్ తో పోరాడుతూ ఉంటుంది. కాబట్టి అనారోగ్యంగా ఉన్నపుడు చెమట ఎక్కువ పట్టవచ్చు. 


ప్రైమరీ హైపర్ హైడ్రోసిస్ సమస్య ఉన్న వారిలో ఎక్కువ చెమట అనేది సర్వ సాదారణం. వీరిలో చెమట సహజంగా నే ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. సెకండరీ హైపోహైడ్రోసిస్ కు ఎలాంటి కారణం తెలియదు. హార్మోన్ రుగ్మతలు, కొన్ని రకాల మందుల వాడకం వల్ల ఇది జరగవచ్చు.


వేసవిలో వేడి వాతావరణంలో చెమట అనేది సర్వసాధారణం. కానీ వాతావరణంతో సంబంధం లేకుండా ఎక్కువ చెమట పడుతుంటే ఆరు నెలలకు మించి ఈ సమస్య కొనసాగితే తప్పకుండా డాక్టర్ ను సంప్రదించాలి. చికిత్సగా మాత్రలు సూచిస్తారు. లేదా పరిస్థితి మరీ ఎక్కువ ఇబ్బందికరంగా ఉంటే స్వేధ గ్రంథలు తొలగించడానికి సర్జరీ కూడా అవసరం పడవచ్చు.


వేసవిలో ఎక్కువ చెమట రాకుండా కొన్ని టిప్స్



  • ఎక్కువ ఫ్లూయిడ్స్ వాడడం వల్ల శరీరం చల్లగా ఉండి ఎక్కువ చెమట ఉత్పత్తి కాదు. కనుక తరచుగా ఏదో ఒకటి తాగుతూ ఉండాలి.

  • శరీరంలో కొవ్వు నిల్వలు ఎక్కువగా ఉంటే శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అందువల్ల చెమట ఎక్కువ వస్తుంది. కనుక కొవ్వు పేరుకోకుండా చూసుకోవాలి.

  • మసాలలతో కారంగా ఉండే ఆహారం తగ్గించుకోవాలి. బదులుగా శరీరాన్ని కూల్ గా ఉంచే యోగర్ట్స్, నీళ్లు ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు ఎక్కువ తీసుకోవాలి.

  • రాత్రి నిద్రకు ముందు డియోవాడడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.

  • నిద్ర తగినంత లేకపోయిన శరీరంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. కనుక నిద్ర సరిపడినంత ఉండేలా జాగ్రత్త పడాలి.

  • స్ట్రెస్ లేకుండా చూసుకోవడం, వదులైన కాటన్ దుస్తులు ధరించడం, కాటన్ బాల్ ను ఆపిల్ సైడర్ వెనిగర్ లో ముంచి చెమట ఎక్కువగా పట్టే బాహుమూలల వంటి భాగాల్లో అమర్చుకోవడం వంటి చిన్న చిట్కాలు కూడా బాగా పనిచేస్తాయి.


Also read: ఈ వేసవి డయాబెటిస్ బాధితులకు డేంజరే - ఈ సూచనలు పాటిస్తే సేఫ్!


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.