Stock Ideas: నిఫ్టీ PSU ఇండెక్స్ గత 15 సంవత్సరాలుగా కన్సాలిడేషన్‌లో ఉంది. ఈ ఇండెక్స్, ఇప్పుడు, మంత్లీ చార్ట్‌లో మల్టీ-ఇయర్‌ కన్సాలిడేషన్‌ గోడను బద్ధలు కొట్టింది. RSI 70 స్థాయి దాటిన తర్వాత PSU ఇండెక్స్‌ పరుగులు పెడుతుందని అంచనా. ADX 24 స్థాయి కంటే పైన ట్రేడవుతోంది, బలమైన అప్‌ట్రెండ్‌ను ఇది సూచిస్తోంది. 


వచ్చే 3-5 ఏళ్లలో నిఫ్టీ PSU ఇండెక్స్ 13,500 స్థాయి వైపు కదులుతుందని ఇన్‌క్రెడ్ ఈక్విటీస్ (InCred Equities) అంచనా వేసింది.


నిఫ్టీ PSE ఇండెక్స్‌ను టెక్నికల్‌గా విశ్లేషించిన ఇన్‌క్రెడ్ ఈక్విటీస్, తన అనాలసిస్‌ ఆధారంగా 4 ప్రభుత్వ రంగ కంపెనీల స్టాక్స్‌ను షార్ట్‌ లిస్ట్‌ చేసింది. వచ్చే 2-3 సంవత్సరాల కాల వ్యవధిలో, ఆ 4 స్టాక్స్‌ 206% వరకు ర్యాలీ చేయగలవని రీసెర్చ్‌ హౌస్‌ చెబుతోంది. ఈ స్టాక్స్‌ పవర్‌ గ్రిడ్‌, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, భెల్‌, ఐఆర్‌సీటీసీ. 


206% వరకు ర్యాలీ చేసే అవకాశం ఉన్న స్టాక్స్‌: 


స్టాక్‌ పేరు: పవర్‌ గ్రిడ్‌ (Power Grid)         
రేటింగ్‌: "బయ్‌"    | ఏ ధర దగ్గర కొనవచ్చు?: రూ. 235-240
టార్గెట్‌ ప్రైస్‌: రూ. 500 | స్టాప్‌ లాస్‌: రూ. 195  | స్టాక్‌ ధర ఇంకా ఎంత పెరగొచ్చు?: 113%  | కాల వ్యవధి: 2-3 సంవత్సరాలు


స్టాక్‌ పేరు: పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్ (Power Finance Corporation)        
రేటింగ్‌: "బయ్‌"    | ఏ ధర దగ్గర కొనవచ్చు?: రూ. 165-175
టార్గెట్‌ ప్రైస్‌: రూ. 400 | స్టాప్‌ లాస్‌: రూ. 135   | స్టాక్‌ ధర ఇంకా ఎంత పెరగొచ్చు?: 142%  | కాల వ్యవధి: 2-3 సంవత్సరాలు


స్టాక్‌ పేరు: భెల్‌ (BHEL )         
రేటింగ్‌: "బయ్‌"    | ఏ ధర దగ్గర కొనవచ్చు?: రూ. 75-80
టార్గెట్‌ ప్రైస్‌: రూ. 230  | స్టాప్‌ లాస్‌: రూ. 60   | స్టాక్‌ ధర ఇంకా ఎంత పెరగొచ్చు?: 206%  | కాల వ్యవధి: 2-3 సంవత్సరాలు


స్టాక్‌ పేరు: ఐఆర్‌సీటీసీ (IRCTC)   
రేటింగ్‌: "బయ్‌"    | ఏ ధర దగ్గర కొనవచ్చు?: రూ. 615-625
టార్గెట్‌ ప్రైస్‌: రూ. 1,200 | స్టాప్‌ లాస్‌: రూ. 550  | స్టాక్‌ ధర ఇంకా ఎంత పెరగొచ్చు?: 95%  | కాల వ్యవధి: 2-3 సంవత్సరాలు


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఇంట్రెస్టింగ్‌ స్టోరీ: జర్రున జారిన జూబిలెంట్‌ ఫార్మోవా, నష్టం నెత్తికెక్కితే రిజల్ట్‌ ఇలాగే ఉంటది