Stomach cancer Sings: కడుపులో గ్యాస్ సమస్య సాధారణమే అనుకుంటాం. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు లేదా ఏదైనా మసాలా ఆహారాలు తిన్నప్పుడు మన కడుపులో గ్యాస్ అనిపించడం సహజమే. ఇలాంటప్పుడు మనం సాధారణంగా యాంటాసిడ్ మాత్రలు లేదా సిరప్ తీసుకుంటూ ఉంటాం. కానీ కడుపులో ఉబ్బరం లేదా గ్యాస్ అనేది క్యాన్సర్ కు లక్షణం అని మీకు తెలిస్తే షాక్ తినడం ఖాయం. అవును, నిజం. కడుపులో ఇవ్వడం లేదా గ్యాస్ అనిపించడం అనేది క్యాన్సర్ లక్షణం అని ఆంకాలజిస్టులు చెబుతున్నారు. అయితే ప్రతిసారి క్యాన్సర్ కాకపోవచ్చు. కానీ, ఉదర క్యాన్సర్ కు ఒక లక్షణంగా మాత్రం కడుపులో గ్యాస్ ను చూడవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఉదర క్యాన్సర్ ను ఎలా గుర్తించవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఉదర క్యాన్సర్‌ను ఎలా గుర్తించాలి?
ఉదర క్యాన్సర్ ప్రారంభ దశలో, గుర్తించే లక్షణాలు ఏవీ ఉండకపోవచ్చు. క్యాన్సర్ అభివృద్ధి చెందుతున్నప్పుడు, కణితి పెరగడం ఉదరంలో అడ్డంకి ఏర్పడటం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. దీని వల్ల పొత్తి కడుపు నిండుగా, బిగుతుగా అనిపించడంతో పాటు ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.
కీమోథెరపీ రేడియేషన్ థెరపీతో సహా అనేక క్యాన్సర్ చికిత్సల సాధారణ దుష్ప్రభావం కడుపులో గ్యాస్, ఈ చికిత్సలు జీర్ణవ్యవస్థలో మంట, చికాకును కలిగిస్తాయి. ఇది కడుపులో గ్యాస్ ఇతర జీర్ణశయ వ్యవస్థను దెబ్బతీస్తుంది.
కడుపులో గ్యాస్ మాత్రమే ఉదర క్యాన్సర్‌కు ఖచ్చితమైన సంకేతం కానప్పటికీ, మరికొన్ని లక్షణాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. అనుకోకుండా బరువు తగ్గడం, కడుపు నొప్పి లేదా అసౌకర్యం, మింగడంలో ఇబ్బంది, వికారం వాంతులు ఉంటాయి. మీరు ఈ లక్షణాలతో పాటు కడుపులో గ్యాస్ తో బాధపడుతుంటే, మీ వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
ఒక వ్యక్తికి ఉదర క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచే అనేక అంశాలు ఉన్నాయి, ఉదర క్యాన్సర్ కుటుంబ చరిత్ర, ధూమపానం ప్రాసెస్ చేసిన ఆహారాలు, మాంసాహారం అధికంగా తీసుకోవడం కూడా ఒక లక్షణంగా చెప్పవచ్చు.
ఇతర క్యాన్సర్ల మాదిరిగానే, చికిత్స కోసం ముందస్తుగా గుర్తించడం చాలా ముఖ్యం. మీరు నిరంతరం కడుపులో గ్యాస్ లేదా ఏదైనా ఇతర సంబంధిత లక్షణాలను అనుభవిస్తే, మీ వైద్యునితో మాట్లాడటం చాలా ముఖ్యం. మీ లక్షణాల కారణాన్ని గుర్తించడానికి ఇమేజింగ్ స్కాన్‌లు లేదా బయాప్సీ వంటి తదుపరి పరీక్షలను వారు సిఫార్సు చేయవచ్చు.
అయితే క్యాన్సర్ అనేది ప్రస్తుత కాలంలో చాలామందిలో కనిపిస్తున్న వ్యాధిగా మారింది. క్యాన్సర్ వ్యాధికి ప్రస్తుతం ఆధునిక యుగంలో చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే క్యాన్సర్ సోకకుండా మన జీవనశైలిలో కూడా కొన్ని మార్పులు చేసుకుంటే మంచిది. తద్వారా మీరు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బుల నుంచి దూరంగా ఉండవచ్చు. ముఖ్యంగా ధూమపానం, మద్యపానం, డ్రగ్స్ వాడకం వంటి అలవాట్లకు దూరంగా ఉంటే మంచిది. అప్పుడే మీరు ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానాన్ని అలవర్చుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బుల నుంచి బయటపడవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.