Salt Benefits in Telugu : ఉప్పు అతిగా తింటే ఆరోగ్యానికి ముప్పు అనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా అధిక రక్తపోటు, డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయి. కానీ, ఉప్పు ఎక్కువ తినడం వల్ల ప్రయోజనాలు కూడా ఉంటాయట. అది మరెవ్వరికో కాదు.. లోబీపీ రోగులకు.
లోబీపీ అనేది ఒక అసాధారణ సమస్య. కానీ దాన్ని మనం సీరియస్‌గా తీసుకోవడం లేదు. హై బీపీ లాగానే ఇది ప్రమాదాన్ని పెంచుతుంది. మీ బీపీ తక్కువగా ఉంటే, మీరు అనేక సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. మీకు కళ్లు తిరగవచ్చు, మూర్ఛపోవచ్చు, వికారం అనిపించవచ్చు. కంటి చూపు అస్పష్టంగా మారవచ్చు. చిరాకుగా మారవచ్చు, పనిపై దృష్టి పెట్టలేరు. అలసిపోయినట్లు అనిపిస్తుంది. లో బీపీ కారణంగా మీరు ఎదుర్కొనే అనేక సమస్యలు ఉన్నాయి. కానీ, ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ మనం లోబీపీని సీరియస్‌గా తీసుకోవడం లేదు. రక్తహీనత, గుండె సంబంధిత వ్యాధుల కారణంగా లోబీపీ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మనందరికీ తెలిసినట్లుగా, బీపీ 120/80 ఉండాలి. నిజానికి మన బీపీ 130/90 కంటే తక్కువగా ఉండాలి. పెరుగుతున్న వయస్సుతో పాటు బీపీ కూడా పెరుగుతుంది.
బీపీ పడిపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు:
ఒక వ్యక్తి అతిసారం లేదా అకస్మాత్తుగా షాక్‌కు గురైతే అతడి బీపీ త్వరగా తగ్గుతుంది. కొద్దిరోజుల్లో ఇది మళ్లీ సాధారణం అవుతుంది, శరీరంలో రక్త హీనత వల్ల కూడా బీపీ తగ్గితే, మీరు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.
లో బీపీ 90/60 గా రీడింగ్ వచ్చినట్లయితే మిమ్మల్ని లోబీపీ రోగిగా పరిగణించవచ్చు. అప్పుడు మీరు ఖచ్చితంగా డాక్టర్ వద్దకు వెళ్లవలసి ఉంటుంది. బీపీ సాధారణం కంటే తక్కువగా ఉంటే, మీ ముఖ్యమైన అవయవాలు ప్రభావితమవుతాయి. శరీరంలో ఆక్సిజన్ సరఫరా ప్రభావితం కావచ్చు.
లో బీపీ రకాలు:
లో బీపీని అనేక వర్గాలుగా విభజించారు. మొదటి రకం ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ ఇందులో ఒక వ్యక్తి అకస్మాత్తుగా మంచం లేదా కుర్చీ నుంచి లేచినప్పుడు, అతని బీపీ తగ్గుతుంది. దీని వెనుక కారణాలు డీ హైడ్రేషన్, సుదీర్ఘమైన బెడ్ రెస్ట్, గర్భం, కొన్ని ప్రత్యేక వైద్య పరిస్థితులు కారణం కావచ్చు. ఈ రకమైన బీపీ వయస్సు పెరుగుతున్న కొద్దీ సాధారణం అని చెప్పవచ్చు.
పోస్ట్‌ప్రాండియల్ హైపోటెన్షన్ :
ఇందులో ఆహారం తిన్న ఒకటి లేదా రెండు గంటల తర్వాత బీపీ తగ్గుతుంది . ఇది తరచుగా వృద్ధులలో కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా అధిక బీపీ రోగులు , పార్కిన్సన్స్ వంటి వ్యాధులతో బాధపడేవారిలో కనిపిస్తుంది.
ఉప్పు తింటే లోబీపీ సమస్య నయమవుతుంది:
ఉప్పు విషయానికొస్తే, మీరు ఉప్పును సాధారణ పరిమాణంలో తీసుకోవాలి. ప్రతి ఒక్కరు తన రుచి, అవసరాన్ని బట్టి ఉప్పు తీసుకోవాలి. సాధారణ స్థితిలో మన శరీరానికి ఉప్పు , తగినంత మొత్తంలో అయోడిన్ అవసరం. బీపీ ఎక్కువగా ఉన్నవారు కాస్త ఉప్పు ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడు లోబీపీ సమస్య నుంచి బయటపడవచ్చు. లోబీపీ అనిపించినప్పుడు ఓఆర్ఎస్ ద్రావణ తీసుకోవడం ద్వారా కూడా ఉప్పును భర్తీ చేసుకోవచ్చు. అలాగే బీపీ డౌన్ కాకుండా కాపాడుకోవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.