Horoscope Today Telugu 16th November (దిన ఫలాలు నవంబర్ 16, 2023)


మేష రాశి (Aries Horoscope in Telugu)


వృత్తిపరంగా చాలా బాగుంటుంది, ప్రమోషన్ కి అవకాశాలున్నాయి. మీ ఆర్థిక స్థితి గత పెట్టుబడులతో స్థిరత్వాన్ని సాధించవచ్చు. వ్యాయామంపై దృష్టిసారించాల్సిన సమయం ఇది. కుటుంబంలో మీ పెద్దల నుంచి మార్గదర్శకత్వం తీసుకోండి, ఇది సరైన నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహాయపడుతుంది. మీరు మీ ప్రేమ జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. మీరు ఆస్తిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ వారం అడుగు ముందుకుపడుతుంది. 


వృషభ రాశి  (Taurus Horoscope in Telugu)


ఆరోగ్యం బావుంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది.  మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల విజయం మీ సంతోషాన్ని పెంచుతుంది...కానీ కుటుంబ విషయాలు కొన్ని సవాలుగా మారుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.  కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి


మిథున రాశి (Gemini Horoscope in Telugu)


ఈ రాశివారు ఆర్థిక విషయాలలో పురోగతి సాధిస్తారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా మీ అవకాశాలను మెరుగుపర్చుకోవచ్చు. దురదృష్టవశాత్తూ మీ కుటుంబం ఈ వారం కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు..దీనికి సహనం చాలా అవసరం. ఆస్తి పరంగా కలిసొచ్చే అవకాశం ఉంది.


Also Read: పాములు, నాగులు, సర్పాలు - మీరు వేటిని పూజిస్తున్నారు!


కర్కాటక రాశి  (Cancer Horoscope in Telugu)


మీ వృత్తి జీవితం అద్భుతంగా ఉంటుంది. కొందరికి ప్రభుత్వ ఉద్యోగం లేదా బదిలీకి మంచి అవకాశాలు వస్తున్నాయి. మీ ఆరోగ్యం బావుంటుంది. మీ ఆర్థిక లాభాలు స్థిరంగా ఉంటాయి. ఖర్చుల పట్ల అప్రమత్తంగా ఉండండి. అపార్థాలు లేదా కఠినమైన పదాల కారణంగా వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. వ్యాపారంలో స్థిరాస్తి పెట్టుబడులు మంచి ఫలితాలనిస్తాయి


సింహ రాశి ( Leo Horoscope in Telugu)


మీ కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది.పెద్దల సహకారం ఉంటుంది. ఫైనాన్స్ విషయానికి వస్తే, బీమా లేదా ప్లాన్‌లలో పెట్టుబడి పెట్టడాన్ని పరిగణించండి. ఉద్యోగులకు సమయం అంత అనుకూలంగా లేదు. పార్ట్ టైమ్ ఉద్యోగాల గురించి అన్వేషిస్తారు. సానుకూలంగా ఆలోచించండి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.


Also Read: మనిషిలో విషసర్పం శేతత్వం పొందేందుకే నాగుల ఆరాధన, పుట్టలో పాలు పోసే టైమ్ ఇదే!


కన్యా రాశి (Virgo Horoscope in Telugu)


మీ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తోంది. ఆస్తులలో పెట్టుబడులు పెట్టేవారికి ఇది శుభసమయం.  వ్యాపారం బాగానే సాగుతుంది. సామాజిక కార్యకలాపాలలో పాల్గొంటారు. మాట్లాడేటప్పుడు మాట తూలకండి. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. 


తులా రాశి (Libra Horoscope in Telugu)


ఉద్యోగ అవకాశాలను అన్వేషించడానికి లేదా ఫ్రీలాన్స్ పని చేయడానికి ఇదే మంచి సమయం. ఇంటి బాధ్యతల విషయంలో తప్పించుకోవద్దు. కుటుంబానికి సమయం కేటాయించడం చాలా అవసరం. మీరు మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని ఆస్వాదిస్తారు. ఆర్థికపరంగా కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు.


వృశ్చిక రాశి (Scorpio Horoscope in Telugu)


ఈ రాశివారికి ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. మనీ మేనేజ్‌మెంట్‌తో మీరు పెద్ద ఆర్థిక సమస్యలను నివారించవచ్చు. కుటుంబంతో కలసి శుభకార్యానికి హాజరవుతారు. నమ్మకం - అవగాహన సంతోషకరమైన అనుబంధానికి కీలకం..మీ జీవిత భాగస్వామి విషయంలో మీ ఇష్టాన్ని బహిర్గతం చేసేందుకు ప్రయత్నించాలి. నూతన పెట్టుపడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. 


Also Read:  కార్తీకమాసంలో రోజూ తలకు స్నానం చేయాలా!


ధనుస్సు రాశి (Sagittarius Horoscope in Telugu)


ఈ రాశివారి వైవాహిక జీవితం బావుంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగం, వృత్తిపరంగాసవాలుగా ఉండవచ్చు. మీరు నిర్వహించాల్సిన పనుల విషయంలో కొన్ని అవరోధాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఇల్లు అమ్మేసే అవకాశం ఉంటుంది.


మకర రాశి (Capricorn Horoscope in Telugu)


ఆర్థిక రంగాలలో శుభవార్తలు ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంలో మీకు సహాయపడుతుంది. ప్రేమికుల మధ్య విశ్వాసం పెరుగుతుంది. దంపతుల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఆస్తి పెట్టుబడికి కొంత బడ్జెట్ అవసరం కావచ్చు, కానీ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణ ప్రణాళికలు ఆపేయడం మంచిది.  విద్యా నైపుణ్యాలపై దృష్టి పెట్టడానికి ఇదే మంచి అవకాశం. 


కుంభ రాశి (Aquarius Horoscope in Telugu)


వృత్తిపరమైన అవకాశాలు మీకు రావచ్చు . మీ కెరీర్‌కు చాలా బాగుంది. పిల్లల నుంచి గుడ్ న్యూస్ వింటారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. గ్రహాలు అంత అనుకూలంగా లేనందున ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరికీ అప్పులు ఇవ్వొద్దు.. తీసుకోవద్దు. సంబంధాలలో కొన్ని సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది.


Also Read: కార్తీక సోమవారం వ్రతవిధి 6 రకాలు, మీరు అనుసరించేది ఏది!


మీన రాశి (Pisces Horoscope in Telugu)


మీ కుటుంబ జీవితం అద్భుతంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు తగిన ఫలితాలు పొందుతారు. మీరు మీ ప్రియమైన వారితో మరపురాని సమయాన్ని గడుపుతారు. మీ కెరీర్‌లో ప్రమోషన్‌కు అవకాశాలు ఉన్నాయి...ఆ దిశగా చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తి ఒప్పందాలు బాగుంటాయి. అననుకూల గ్రహ సంయోగం కారణంగా ఈ వారం ప్రయాణాలకు మంచిది కాదు.