Laughing: మానసిక, శారీరక ఆరోగ్యానికి నవ్వు ఒక ఉత్తమ ఔషధం. నవ్వినప్పుడు ఎండార్పిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది శారీరక, మానసిక స్థితిని ఆనందంగా మారుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆందోళనను పోగొడుతుంది. నవ్వినప్పుడు ప్రతిరోధకాల ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల రోగనిరోధక కణాల సంఖ్య కూడా పెరుగుతుంది. మొత్తం మీద రోగనిరోధక శక్తి అధికమవుతుంది. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం నవ్వు రక్తప్రసరణను మెరుగుపరచడమే కాదు, రక్తపోటును తగ్గిస్తుంది. ఆక్సిజన్ ను అవయవాలకు సక్రమంగా చేర్చి హృదయ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. నవ్వడం అనేది శరీరం చేసే ఒక చిన్న వ్యాయామం అని చెప్పుకోవాలి.


నవ్వు అనేది ఒక సహజమైన నొప్పి నివారణ మందు. శరీరంలో ఉన్న నొప్పులను తగ్గించడంలో ఇది ముందుంటుంది.అంతేకాదు సామాజిక సంబంధాలను కూడా మెరుగుపరుస్తుంది. నవ్వుతూ పలకరించే వ్యక్తిని ఎక్కువమంది తమ స్నేహితులుగా మార్చుకోవడానికి ఇష్టపడతారు. నవ్వు శారీరక, భావోద్వేగ, సామాజిక కోణాలను కలిగి ఉంది. కాబట్టి ప్రతిరోజు నవ్వుతూనే మీ రోజును ప్రారంభించండి.


ఆధునిక జీవితంలో ఒత్తిడి భాగమైపోయింది అనేక అధ్యయనాలు నవ్వు రక్తంలోని ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుందని చెబుతాయి కాబట్టి ఉదయం లేస్తూనే ఫిగర్ గా నవ్వెందుకు ప్రయత్నించండి ఇలా ప్రతిరోజు చేస్తే కొన్ని రోజుల్లోనే మీకు ఆరోగ్యపరంగా ఎన్నో మార్పులు కనిపిస్తాయి నవ్వు అనేది ఒక యోగ ఓ ఔషధం


చిరునవ్వులు చిందించడం వల్ల ఉపయోగం లేదు. మీరు ఎంత గట్టిగా నవ్వగలిగితే అంత గట్టిగా పడి పడి నవ్వండి. అదే మీకు మానసిక, శారీరక ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఒత్తిడిని తగ్గించే హార్మోన్లలను అధికంగా ఉత్పత్తి చేస్తుంది. గుండెకు ఆక్సిజన్ సరఫరా ఆరోగ్యంగా జరిగేలా చేస్తుంది. భావోద్వేగాలను విడుదల చేస్తుంది. దీనివల్ల ఒత్తిడి మాయమైపోతుంది. కండరాలు రిలాక్స్ అవుతాయి. బిగ్గరగా నవ్వడం అనేది గుండె కోసం మీరు చేసే ఒక వ్యాయామం. గంటపాటు మార్నింగ్ వాక్ చేస్తే ఎంత ఆరోగ్యం వస్తుందో రోజు బిగ్గరగా నవ్వడం వల్ల కూడా అంతే ఆరోగ్యం గుండెకు కలుగుతుంది. పరిశోధన ప్రకారం రోజుకు 10 నుండి 15 నిమిషాల పాటు బిగ్గరగా నవ్వడం వల్ల 40 క్యాలరీల వరకు బర్న్ అవుతాయి. అంటే గట్టిగా నవ్వితే బరువు కూడా తగ్గుతారు. 


నవ్వు మనల్ని ఇతరులతో కలుపుతుంది. ఇది ఒక అంటూ వ్యాధి. మనం నవ్వితే మన స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహోద్యోగులు కూడా నవ్వుతారు. కాబట్టి అందమైన అనుబంధాలను ఏర్పరచుకోవడానికి కూడా నవ్వు ఒక మంచి మార్గం. 



Also read: చీజ్ పౌడర్ ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు






























































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.