పిజ్జా, బర్గర్, బ్రెడ్...ఇలా అనేక ఆహారాలకు చీజ్ టేస్టీ జత. దీన్ని జత చేస్తే ఆహారం చాలా రుచిగా మారుతుంది. పిల్లలకు ఎంతో ఇష్టమైనది కూడా. అనేక వంటకాలలో దీని వినియోగిస్తూ ఉంటారు. కేవలం చీజ్ రూపంలోనే దీన్ని ఫ్రిజ్‌లో దాచుకోవాల్సిన అవసరం లేదు. పొడి రూపంలో కూడా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. చీజ్ పౌడర్ ఇప్పుడు సరికొత్త ట్రెండ్.
చీజ్ పౌడర్ అనేది డీహైడ్రేటెడ్ చీజ్. అంటే చీజ్‌ను పూర్తిగా నీటి రహితంగా, తేమరహితంగా చేస్తారు. అంటే డిహైడ్రేటెడ్ చేస్తారు. అప్పుడు అది ఎండిపోయినట్టు తయారవుతుంది. దాన్ని పొడి రూపంలో మారుస్తారు. ఈ చీజ్ పొడిని వంటకాలలో రకరకాలుగా ఉపయోగించవచ్చు. ఇది దుకాణాల్లో కూడా ప్రస్తుతం దొరుకుతుంది. బేకింగ్ పౌడర్, మసాలా పొడి ఎలా దొరుకుతుందో చీజ్ పొడి కూడా అలాగే లభిస్తుంది.
ఇంట్లోనే ఈ పొడిని తయారు చేసుకోవచ్చు. చేయడం కూడా చాలా సులువు. ముందుగా చీజ్‌ను కొని పెట్టుకోవాలి. దాన్ని సన్నగా తురమాలి. ఓవెన్ ట్రేలో ఒక బేకింగ్ షీట్‌ను వేయాలి. తురిమిన ఈ చీజ్‌ను షీట్ పై ఆరబెట్టాలి. దీని ఆ ట్రే ఓవెన్లో పెట్టి 150 డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద ఉంచాలి. చీజ్‌లోని తేమ మొత్తం పోయేవరకు ఓవెన్లో ఉంచాలి. మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి. తర్వాత ఓవెన్ నుంచి ఆ ట్రేను బయటకు తీయాలి. చీజ్లో తేమ ఏమాత్రం లేదని నిర్ధారించుకున్నాక, మిక్సీలో వేసి పొడి రూపంలోకి మార్చుకోవాలి. దీన్ని గాలి చొరబడని ఒక డబ్బాలో వేసి అవసరమైనప్పుడు వాడుకుంటూ ఉండాలి.
చీస్ పౌడర్ తో చీజ్ పాప్ కార్న్ టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇంకా అనేక రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. చీజ్ పొడిని ఒకసారి తయారు చేసుకుంటే చాలు, ఎన్నో నెలల పాటు నిల్వ ఉంటుంది. దీని రుచి కూడా చీజ్‌కు ఉ మాత్రం తగ్గకుండా ఉంటుంది చీజ్. దీన్ని తినడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
చీజ్ లో కాసైన్ అనే ప్రొటీన్ ప్రధానంగా ఉంటుంది. ఇది ఎముకలకు ఎంతో బలాన్ని ఇస్తుంది. బరువు పెరగడానికి ఇది సహకరిస్తుంది. సన్నగా ఉన్నవారు తరచూ ఆహారంలో చీజ్ ను భాగం చేసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంది. అలాగే అధిక రక్తపోటు ఉన్నవారు చీజ్‌ను తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండే ఛాన్స్ ఎక్కువ. ఆస్టియోపొరోసిస్ వంటి వ్యాధులు ఉన్న వారు కూడా చీజ్‌ను తినాలి. క్యాన్సర్ ను నిరోధించే లక్షణాలు దీనిలో ఎక్కువ.
Also read: ఈ దుంప పేరేంటో తెలుసా? వనవాసంలో శ్రీరాముడు తిన్న ఆహారం ఇది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.