చైనా కృత్రిమ సూర్యుడి(artificial sun)ని సిద్ధం చేస్తోందనే సంగతి తెలిసిందే. ఇటీవలే దాన్ని విజయవంతంగా ప్రయోగించారు కూడా. సాధారణ సూర్యుడితో పోల్చితే చైనా ఆర్టిఫిషియల్ సన్ నుంచి విడుదలయ్యే వేడి సుమారు ఐదు రెట్లు. సాధారణంగా సూర్యుడి కోర్ నుంచి 15 మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. చైనా తయారు చేసిన ఈ కృత్రిమ సూర్యుడి నుంచి.. కేవలం 1056 సెకన్ల (17.6 నిమిషాలు) వ్యవధిలో 70 మిలియన్ (1.5 కోట్లు) డిగ్రీల ఉష్ణోగ్రత ఉత్పన్నమవుతోంది. ఈ విషయాన్ని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా ఫిజిక్స్ పరిశోధకుడు గాంగ్ జియాన్జు స్వయంగా వెల్లడించారు.
అయితే, సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. భూమి మీద నుంచి నింగిలోకి దూసుకెళ్తున్న ఆ అగ్నిగోళమే.. చైనా సృష్టించిన కృత్రిమ సూర్యుడు అంటూ ప్రచారం జరుగుతోంది. చీకట్లు చీల్చుకుంటూ.. రాత్రివేళ వెలుగులు నింపుతున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది. ప్రజలంతా ఆశ్చర్యంతో ఆ అరుదైన దృశ్యాన్ని వీడియోలు తీయడమే కాకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇదో అద్భతమని కొనియాడుతున్నారు. చైనా కృత్రిమ సూర్యుడిపై ప్రయోగం జరిపిన ఐదు రోజుల్లోనే ఈ వీడియో బయటకు వచ్చింది. దీంతో అంతా దాన్ని China artificial sun అంటూ ప్రచారం చేస్తున్నారు. మరి, అది నిజంగా చైనా ప్రయోగించిన కృత్రిమ సూర్యుడేనా? అసలు నిజాన్ని ఈ వీడియో చూసిన తర్వాత తెలుసుకోండి.
ఇదీ నిజం: వాస్తవానికి చైనా కృత్రిమ సూర్యుడిని నింగిలోకి ప్రవేశపెట్టడానికి తయారు చేయలేదు. అది ఉత్పత్తి చేసే ఉష్ణోగ్రత, శక్తిని బట్టి.. అంతా దాన్ని కృత్రిమ సూర్యుడని పిలుస్తున్నారు. ఇది కేవలం రియాక్టర్ మాత్రమే. దీన్ని నింగిలోకి ప్రవేశపెట్టేందుకు తయారు చేయలేదు. విద్యుత్ తదితర అవసరాల కోసం తయారు చేస్తున్న ఈ ఎక్స్‌పరిమెంటల్ అడ్వాన్స్‌డ్ సూపర్ కండక్టింగ్ టొకమాక్ (EAST) ఫ్యూజన్ ఎనర్జీ రియాక్టర్ (Experimental Advanced Superconducting Tokamak Fusion Reactor) ఇది. సూర్యుడు, నక్షత్రాల తరహాలోనే ఇది సంలీన ప్రక్రియ(Fusion) ద్వారా దీన్ని మండిస్తారు. ఇందుకు హైడ్రోజన్, డ్యూటీరియం వాయువులను ఇంధనంగా ఉపయోగిస్తారు. అలా దాని నుంచే ఉత్పత్తయ్యే శక్తిని విద్యుత్త్‌గా మార్చుతారు. అయితే, పై వీడియోలో కనిపిస్తున్నది.. చైనా కృత్రిమ సూర్యుడు కాదు. అది హైనాన్(Hainan)లోని వెన్చంగ్ స్పేస్ లాంచ్ సెంటర్(Wenchang Space Launch Center) నుంచి ప్రయోగించిన రాకెట్ వెలుగులు కావచ్చని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మరో వీడియోను ఇక్కడ చూడండి.
Also Read: 70 రోజులు.. స్నేహితుల శవాలను తిని ఆకలి తీర్చుకున్న రగ్బీ టీమ్
చైనా తయారు చేసిన అసలైన EAST రియాక్టర్ ఇదే:
Also Read: పెళ్లికాని ప్రసాద్‌లు ‘బ్యాచిలర్ ట్యాక్స్’ కట్టాలట.. అమ్మాయిలకు డబ్బే డబ్బు!
Also Read: ఓర్నీ.. చేప వీర్యంతో స్పెషల్ కర్రీ.. అంత కరువేంది బ్రో!
Also Read: కలకత్తా ‘బ్లాక్ హోల్’.. 123 మంది బ్రిటీషర్లను ఇలా కుక్కి కుక్కి చంపేశారు, కానీ..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి