కరోనా, ఒమిక్రాన్‌తో బెంబేలెత్తిపోతోన్న ప్రజలకు భారత్ బయోటెక్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో రానున్న కొవాగ్జిన్ బూస్టర్ డోస్ (BBV152) ఒమిక్రాన్, డెల్టా వేరియంట్లపై సమర్థవంతంగా పనిచేస్తోందని ప్రకటించింది.










బూస్టర్ డోసుతో డెల్టాతో పాటు ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేలా యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయని సంస్థ పేర్కొంది. అమెరికాకు చెందిన ఎమోరి కేంద్రంలో బూస్టర్ డోసు తీసుకున్నవారి సెరాను ఒమిక్రాన్ లైవ్ వైరస్‌తో కలిపి పరిశోధనలు చేసినట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది.


ఈ పరిశోధనలో డెల్టా సోకినవారిలో 100 శాతం యాంటీబాడీలు, ఒమిక్రాన్ సోకిన వారిలో 90 శాతం యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని వెల్లడించింది. దీంతో ఒమిక్రాన్, డెల్టా వేరియంట్లు రెండింటిని కొవాగ్జిన్ బూస్టర్ డోసు అడ్డుకోగలదని తేలిందని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది.


కరోనా కేసులు..


దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైన సంకేతాలు కనిపిస్తున్నాయి. రోజువారి కేసులు లక్షకు పైగా నమోదవుతున్నాయి. కొత్తగా 1,94,720 కరోనా కేసులు నమోదయ్యాయి. 442 మంది వైరస్‌తో మృతి చెందారు. 60,405 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 3,46,30,536కు పెరిగింది.


మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,868కి పెరిగింది. ఇందులో 1805 మంది రికవరయ్యారు.





ఒమిక్రాన్ కేసుల సంఖ్యలో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో 1281 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. దిల్లీని దాటి రాజస్థాన్ రెండో స్థానానికి వచ్చింది. రాజస్థాన్‌లో 645 ఒమిక్రాన్ కేసులు ఉండగా దిల్లీలో 546 ఉన్నాయి. 

 

డిశ్ఛార్జి పాలసీ.. 




దేశంలో డిశ్ఛారి పాలసీని రివైజ్ చేసింది ఆరోగ్య శాఖ. పాజిటివ్ వచ్చి 7 రోజులు గడిచిన వారికి వరుసగా 3 రోజుల పాటు జ్వరం లేకపోతే టెస్ట్ లేకుండానే డిశ్ఛార్జ్ చేయవచ్చని ఈ పాలసీని రివైజ్ చేసింది.



Also Read: Covid 19 Lockdown: ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ.. లాక్‌డౌన్ విధిస్తారా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి