Sobhita Dhulipala Wedding Jewelry : పెళ్లి అంటే హుందాతనం. గౌరవం. ప్రేమకు చివరి మజిలి. ఆ సమయంలో మీరు ఎలా కనిపించాలన్నది పూర్తిగా మీ టేస్ట్​ని బట్టి ఉంటుంది. కాకుంటే మీరు ఎంత మోడ్రన్​గా ముస్తాబై.. డైమండ్స్ ధరించినా.. ట్రెడీషనల్​ జ్యూవెలరీకి ఉండే హుందాతనమే వేరు. ఇదే విషయాన్ని శోభిత ధూళిపాల ప్రూవ్ చేసింది. భారీ లెహంగాలకు చెక్ పెట్టి.. డైమండ్ నెక్లెస్, రింగ్స్​తో కాకుండా.. తెలుగింటి ఆడపిల్లలా చీర కట్టుకుని.. ఒంటి నిండా నగలు పెట్టుకుని.. అసలైన పెళ్లికూతురు కళ తెచ్చింది. మీరు కూడా మీ స్పెషల్ అకేషన్​లో శోభిత ధూళిపాళ స్టైల్​ని ఫాలో అయిపోవచ్చు.


నాగచైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లి.. డిసెంబర్ 4, 2024వ తేదీన అంగరంగవైభవంగా బ్రాహ్మణ ఆచారాలతో జరిగింది. తన జీవితంలో ఈ స్పెషల్ వేడుకకు.. శోభిత తల నుంచి కాలివరకు నిజమైన బంగారు నగలు పెట్టుకుని..  లక్ష్మీ దేవి కళ ఉట్టిపడేలా ముస్తాబైంది. సాధారణంగా సెలబ్రెటీల పెళ్లిళ్లు అంటే లెహంగాలు, మోడ్రన్ జ్యూవెలరీ ఇలా ఎన్నో హంగులు, ఆర్భాటాలు ఉంటాయి. కానీ శోభిత మాత్రం గోల్డెన్ శారీలో.. నిండుగా నగలు పెట్టుకుని అందంగా ముస్తాబైంది. ఇంతకీ ఆమె ఎలాంటి ఆభరణాలు తన లుక్​ కోసం ఉపయోగించిందో ఇప్పుడు చూసేద్దాం. 


శోభిత ధరించిన బంగారు కంజీవరం చీరను మనీష్ మల్హోత్రా రూపొందించాడు. పెళ్లి చీరకు అనుగుణంగా బంగారు ఆభరణాలు ధరించింది శోభిత. నుదిటిపై బాసికం పెట్టుకుంది. అలాగే నుదిటిని కవర్ చేసే హెడ్ చెయిన్, పాపిడి బిళ్లను పెట్టుకుంది. దాని లుక్​కి తగ్గట్లుగా భారీ బుట్టలు, చంప సవరాలు పెట్టుకుంది. అలాగే ముక్కకి పుడక పెట్టుకుంది. అలాగే కుందన్ చోకర్ ఆమె లుక్​ని మరింత ఎలివేట్ చేసింది. చోకర్​కి మ్యాచ్​ అయ్యే పొడుగాటి నెక్లెస్ పెట్టుకుంది. చెవి బుట్టలకు సరితూలే భారీ హారం కూడా వేసుకుని తన రూపాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుకుంది. 


Also Read : శోభిత ధూళిపాల స్కిన్​ కేర్ రోటీన్.. ఆ ఒక్కటి లేకుంటే ఎన్ని సర్జరీలు చేయించుకున్నా లాభం లేదంటోన్న బ్యూటీ


పెళ్లి లుక్​లో భాగంగా నడుముకు వడ్డాణం పెట్టుకుంది. దాదాపు వధువులందరూ దీనిని పెళ్లితంతులో ఏదొక సమయంలో వినియోగిస్తారు. అలాగే చేతులకు శోభిత వంకీలు పెట్టుకుంది. ఈ ఆభరణాలకు తగ్గట్లు గోల్డెన్ మేకప్ లుక్​ని ఎంచుకుంది శోభిత. చేతులకు సింపుల్ ఉంగరాలతో పాటు.. ఆమె ఎంగేజ్​మెంట్ డైమండ్ రింగ్​ని పెట్టుకుని తన లుక్​ని ఫైనల్ చేసుకుంది. అలాగే చేతులకు భారీ మెహందీ డిజైన్లు కాకుండా.. వేళ్లకు సగానికి పైగా గోరింటాకు పెట్టుకుని.. సింపుల్ డిజైన్స్​తో మెహందీ పెట్టుకుని.. అచ్చమైన పెళ్లికూతురు వైబ్​ ఇచ్చింది శోభిత. 



తలలో మల్లెపూలు పెట్టుకుని.. చేతులకు బంగారు గాజులు వేసుకుని.. కాళ్లకు బంగారు పట్టీలు కూడా పెట్టుకుంది శోభిత. దాదాపు పట్టీలు పెట్టుకోవడం అనేది ఈ తరం అమ్మాయిల్లో అంతగా కనిపించట్లేదు. కానీ కాళ్లకు నిండుగా బంగారు పట్టీలు పెట్టుకుని చాలా అట్రాక్టివ్​గా కనిపించింది శోభిత. మీరు కూడా స్పెషల్ ఈవెంట్స్ సమయంలో ఇలా నిండుగా రెడీ అయితే.. చూసేందుకు అచ్చమైన చందమామలా ఉంటారు. అందరికీ బంగారు నగలే ఉండాలని రూల్ లేదు. కానీ 1 గ్రామ్ గోల్డ్​తో అయినా ఇలాంటి నిండైన తెలుగు పెళ్లికూతురు వైబ్స్​ని తీసుకురావచ్చు. 



Also Read : ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు సింపుల్​గా ముస్తాబై, స్టన్నింగ్​గా కనిపించాలంటే కీర్తి సురేష్​ని ఫాలో అయిపోండిలా