Sleep In Weekend Help’s Live Longer:  బిజీ లైఫ్ లో జనాలు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. సరైన తిండి, నిద్రలేకుండా గడుపుతున్నారు. ఫలితంగా విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనై రకరకాల వ్యాధులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో బీజింగ్ పరిశోధకులు కీలక విషయాన్ని వెల్లడించారు. వీకెండ్ లో చక్కగా నిద్రపోవడం వల్ల గుండె జబ్బుల ముప్పు తగ్గడంతో పాటు ఆయుష్షు పెరుగుతుందని తెలిపారు. నాణ్యమైన నిద్ర ఫిట్ నెస్ ను పెంచడంతో పాటు బరువును అదుపు చేస్తున్నట్లు వివరించారు.  


వీకెండ్ లో చక్కటి నిద్రతో దీర్ఘాయుష్షు


సెప్టెంబరు 1న యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ కాంగ్రెస్ 2024లో సమర్పించబోయే కొత్త పరిశోధన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. వీకెండ్ లో నిద్రపోయే వ్యక్తులతో పోల్చితే, నిద్ర సరిగా పోని వ్యక్తులతో 20 శాతం గుండె జబ్బులు ముప్పు అధికంగా ఉన్నట్లు తేలింది. బీజింగ్‌లోని నేషనల్ సెంటర్ ఫర్ కార్డియోవాస్కులర్ డిసీజ్ శాస్త్రవేత్తల బృందం.. సుమారు 90 వేల మందికి పైగా యుకె వాసుల నుంచి సుమారు 14 ఏండ్ల పాటు తీసుకున్న డేటా ప్రకారం ఈ వివరాలు వెల్లడించింది.  “నిద్ర విషయంలో మేం చేసిన పరిశోధనలో కీలక విషయాలు తెలిశాయి. నిద్రలేమితో బాధపడుతున్న వారితో పోల్చితే, వీకెండ్ లో చక్కగా నిద్రపోయే వారిలో గుండె జబ్బుల ముప్పు గణనీయంగా తగ్గినట్లు తేలింది” అని  అధ్యయనంలో పాల్గొన్న జెయెన్ లియు వెల్లడించారు. చక్కటి నిద్ర గుండెకు మేలు చేయడంతో పాటు ఆయు ప్రమాణం పెరుగుతున్నట్లు వెల్లడించిందన్నారు. నాణ్యమైన నిద్ర చక్కటి ఫిట్ నెస్ అందిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు. 


వీకెండ్ లో ఎందుకు నిద్రపోవాలంటే?


సరిగా నిద్రపోకపోవడం వల్ల రోగనిరోధక శక్తి బలహీనం కావడంతో పాటు అకాల మరణం సంభవించే అవకాశం ఉంటుంది. తాజా అధ్యయనంలో సుమారు 22 శాతం మంది వ్యక్తులు 7 గంటల కంటే నిద్రపోవడం వల్ల చనిపోయినట్లు తేలింది. 6 గంటల కంటే తక్కువ నిద్రపోయే వాళ్లు త్వరగా చనిపోతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. చక్కగా నిద్రపోని వారిలో మానసిక వైకల్యం ఏర్పడుతున్నట్లు తేలింది. తగినంత నిద్రపోవడం వల్ల ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది.  


తగిన మోతాదులో నిద్రపోకపోతే.. ఇలా చేయండి!


మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే చక్కటి నిద్ర అవసరం. అయితే, రోజూ 7 నుంచి 9 గంటలు నిద్రపోకపోవడం కుదరకపోతే కచ్చితంగా రోజూ ఒకే సమయంలో నిద్రపోయేలా చూసుకోవాలంటున్నారు పరిశోధకులు. అంటే ప్రతి రోజు ఫలానా సమయం నుంచి ఫలానా సమయం వరకు నిద్రపోయేలా షెడ్యూల్ చేసుకోవాలి. వీకెండ్ లో ఎక్కువ గంటలు నిద్రపోయేలా ప్రయత్నించాలి. ఫలితంగా ఆయు ప్రమాణాన్ని పెంచుకునే అవకాశం ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.


Read Also: గంట నిద్ర తక్కువైతే నాలుగు రోజులు ఎఫెక్ట్ ఉంటుందట.. మీరెన్ని గంటలు పడుకుంటున్నారు?



Read Also: ఏ వయసు వారు ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసా? నిద్ర అవసరాన్ని తేల్చి చెప్పిన తాజా అధ్యయనం