Positive and Negative Effects of Skipping Dinner : నేను నైట్ డిన్నర్ చేయను. ఈ మాటను చాలామంది దగ్గర వినే ఉంటారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు దీనిని ఎంచుకుంటారు. దీనివల్ల కొన్ని లాభాలు ఎలా ఉన్నాయో.. అలాగే కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నాయంటున్నారు నిపుణులు. మీరు కూడా రాత్రుళ్లు డిన్నర్ మానేయాలనుకున్నా.. లేక ఇప్పటికే మానేసినా లేట్ అయ్యిందేమి లేదు. ఇప్పటికైనా ఈ విషయాలు తెలుసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెప్తున్నారు.
లాభాలివే
బరువు తగ్గడం : రాత్రుళ్లు డిన్నర్ మానేయడం వల్ల కచ్చితంగా బరువులో మార్పులు ఉంటాయి. బరువు తగ్గుతారు. కేలరీలు తీసుకోవడం తగ్గుతుంది కాబట్టి.. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్ అనే చెప్పొచ్చు.
మధుమేహం : ఫాస్టింగ్ చేయడం లేదా భోజనం చేయడం మానేయడం ద్వారా శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. టైప్ 2 డయాబెటిస్‌ని మ్యానేజ్ చేయడానికి లేదా దూరం చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది.
ఆటోఫాగి : దెబ్బతిన్న కణాలు, ప్రోటీన్లను రీసైకిల్ చేసే ప్రక్రియను ఆటోఫాగి అంటారు. డిన్నర్ మానేస్తే దీనిని శరీరం అలవాటు చేసుకుంటుంది.
నష్టాలివే..
పోషకాహార లోపం : డిన్నర్ మానేయడం వల్ల పోషకాహారలోపం ఏర్పడుతుంది. ముఖ్యంగా మీరు రోజులో సమతుల్య ఆహారం తీసుకోకపోతే.. శరీరానికి పోషకాలు అందవు. ఇది ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
బ్లడ్ షుగర్ : రాత్రుళ్లు డిన్నర్ చేయడం మానేస్తే రక్తంలో బ్లడ్ షుగర్ తగ్గుతుంది. దీనివల్ల కళ్లు తిరగడం, ఫటిగో, ఇరిటేషన్ ఎక్కువ అవుతుంది.
మెటబాలీజం : రాత్రి భోజనం మానేస్తే మెటబాలీజం తగ్గుతుంది. జీవక్రియ తగ్గితే బరువు తగ్గడం చాలా కష్టమవుతుంది. మొదట్లో బరువు తగ్గినట్లు అనిపించినా.. తర్వాతి రోజుల్లో ఊహించని రీతిలో బరువు పెరిగే అవకాశముంది.
నిద్రలో మార్పులు : రాత్రుళ్లు భోజనం మానేయడం వల్ల నిద్ర తక్కువ అవుతుంది. నిద్ర నాణ్యత కూడా తగ్గుతుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి.
కండర బలం : వయసు పెరిగే కొద్ది కండర బలం తగ్గుతుంది. అయితే రాత్రుళ్లు డిన్నర్ మానేయడం వల్ల కూడా ఇది తగ్గే అవకాశముంది. దీనివల్ల బరువు తగ్గిన ఫీల్ వస్తుంది కానీ.. ఫ్యూచర్లో కండరాల సమస్యలు ఎక్కువ అవుతాయి. ఇవేకాకుండా గ్యాస్ సమస్యు, యాసిడ్ రిఫ్లక్స్, మలబద్ధకం వంటి సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. దీనివల్ల ముఖంలో మెరుపు తగ్గుతుంది. అంతేకాకుండా జుట్టు రాలుతుంది.
ఎవరూ అవాయిడ్ చేయాలంటే..
పిల్లలు, టీనేజర్స్ దీనికి దూరంగా ఉండాలి. లేదంటే వారి ఎదుగుదలలో ఇబ్బందులు ఉంటాయి. గ్రోత్ సరిగ్గా ఉండకపోవచ్చు. అలాగే ప్రెగ్నెన్సీతో ఉన్నవారు, పిల్లలకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేవారు కూడా డిన్నర్‌ని స్కిప్ చేయకపోవడమే మంచిది. డయాబెటిస్ ఉన్నవారు షుగర్ లెవెల్స్‌ని మ్యానేజ్ చేయడానికి రెగ్యులర్ మీల్స్ చేయొచ్చు.
బరువు తగ్గేందుకు ఇలా ట్రై చేయండి..
బ్యాలెన్స్డ్ డిన్నర్ : తినడం మానేయడం కంటే తీసుకునే ఆహారంపై ఫోకస్ చేయండి. బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటే ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గుతూ హెల్తీగా ఉంటారు. శరీరానికి కావాల్సిన ప్రొటీన్ అందిస్తూ.. హెల్తీ ఫ్యాట్స్ తీసుకుంటూ.. కార్బ్స్ అందిస్తే మంచిది.
పోర్షన్ కంట్రోల్ : రెగ్యులర్‌గా తీసుకునే ఆహారం కంటే కంట్రోల్‌గా, శరీరానికి ఎన్ని కేలరీలు అవసరమో అంతే ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల బరువు తగ్గడం ఈజీ అవుతుంది.
హెల్తీ స్నాక్స్ : మీ డైట్లో హెల్తీ స్నాక్స్‌ని తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఎక్కువ తినడం కంట్రోల్ అవుతుంది. బరువు తగ్గడానికి ఇది హెల్ప్ చేస్తుంది.
ఒకవేళ మీరు ఇతర కారణాలతో డిన్నర్ మానేయాలనుకుంటే కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా బరువు తగ్గుతారు.