జ్వరం, ఒళ్లు నొప్పులు అనిపిస్తే చాలు చటుక్కున ఓ పారాసెటమాల్ మాత్ర తీసి గుటుక్కున మింగేస్తారు. ఇలా రోజుకు మూడు పూటలా.. మూడు నాలుగురోజుల పాటూ మింగతారు. ఇది ప్రతి ఇంట్లో తరచూ జరిగే ప్రక్రియ ఇది. అయితే ఇలా పారాసెటమాల్ రోజూ అధికంగా వాడితే రక్తపోటు పెరగడంతో పాటూ, గుండె పోటు వచ్చే అవకాశాన్ని పెంచుతుందని తేల్చింది ఓ అధ్యయనం. గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉన్నవారు పారాసెటమాల్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. 


ఇలా జరిగింది పరిశోధన
ఎడిన్ బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు అధిక రక్తపోటు చరిత్ర కలిగిన 110 మందిపై అధ్యయనం నిర్వహించారు. వారికి ఒక గ్రాము పారాసెటమాల్‌ను రోజుకు నాలుగుసార్లు ఇచ్చారు. వీరిలో నాలుగు రోజుల్లోనే రక్తపోటు అధికంగా పెరగడాన్ని గుర్తించారు. వారిలో 20 శాతం మంది గుండెపోటు పెరిగినట్టు గుర్తించారు.  దీన్ని బట్టి పారాసెటమాల్ వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని తేల్చారు. 


బ్రిటన్ లో వీటి వాడకం చాలా అధికం. ప్రతి పదిమందిలో ఒకరు వీటిని వాడుతూనే ఉంటారు. అక్కడ ముగ్గురిలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. వీరు పారాసెటమాల్ వాడితే గుండె పోటు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఎడిన్ బర్గ్ విశ్వ విద్యాలయానికి చెందని ప్రొఫెసర్ మాట్లాడుతూ ‘ఇబుఫ్రొఫెన్ వండి మందులను ఉపయోగించడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. వాటిని మానేయమని రోగులకు చెప్పడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు పారాసెటమాల్ ను కూడా ఎక్కువగా వాడొద్దని చెప్పాల్సి వస్తోంది. ఈ విషయంపై ఇంకా లోతైన అధ్యయనాలు అవసరం’ అని అన్నారు. 


పారాసెటమాల్ ట్యాబ్లెట్లలో కొంతమేరకు సెర్టాయిడ్లు ఉంటాయి. వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా నష్టం జరుగుతుంది. ముఖ్యంగా లివర్, కిడ్నీ సమస్యలున్న వారు, బరువు తక్కువగా ఉన్నవారు, మద్యం అతిగా తాగే అలవాటున్న వారు వీటిని అధికంగా మింగకూడదు. 


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.


Also Read: మీరు వాడే సబ్బులో ఈ రసాయనాలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి, వీటితో చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం


Also read: రోజుకు పదినిమిషాలు వ్యాయామం చేస్తే చాలు, అకాల మరణాల రేటును తగ్గించుకోవచ్చు