గుప్పెడంతమనసు ఫిబ్రవరి 9 బుధవారం ఎపిసోడ్


జగతిని ఇంట్లోంచి పంపించాలనుకున్న దేవయాని ప్లాన్ కి చెక్ పెడుతూ ముందుగానే పంపించేస్తాడు మహేంద్ర. జగతి వెళ్లిపోయిన ఆనందంలో ఉన్న దేవయాని ఇంట్లో అందరకీ స్వీట్స్ చేసిపెట్టు అని ధరణికి చెబుతుంది. పండుగయ్యాక స్వీట్స్ ఏంటి అంటావా.. జగతి వెళ్లిపోయిన ఈ రోజే నాకు అసలైన పండుగ..నాకు ఇష్టం లేనిది నా కళ్లముందు ఉండదు.. అది వస్తువైనా, మనిషి అయినా.. స్వీట్స్ టేస్టీగా ఉండాలి అని పొగరుగా చెప్పేసి వెళ్లిపోతుంది దేవయాని. 


జగతి ఇంట్లో డల్ గా కూర్చున్న మహేంద్రతో వసుధార మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అంటుంది. జగతిని ఇంటినుంచి నేనే ఎందుకు తీసుకొచ్చానని అడుగుతావా అంటాడు మహేంద్ర. అవును సార్ అంటుంది వసుధార. జగతి నీకు గురువు కావొచ్చు కానీ నాకు జీవితం అంటూ మొదలెట్టిన మహేంద్ర... రిషి మనసులో ఏమనుకున్నాడో ఏమో నా ఆనందం కోసం జగతిని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే టెంట్లు అవి తీసుకొచ్చి అవసరం తీరిపోగానే తిరిగి ఇచ్చేస్తారు..జగతిని కూడా రిషి అలాగే తీసుకొచ్చాడు. వెళ్లమని అనలేదు కానీ ఉండమని కూడా చెప్పలేదు కదా. జగతిని ఎప్పుడెప్పుడు అవమానిద్దామా అని దేవయాని వదిన ఎదురుచూస్తోంది.. జగతి ఆ ఇంటికి కోడలిగా, నాభార్యగా, రిషికి తల్లిగా రాలేదు.. అక్కడకు అతిథిగా వచ్చింది అమ్మగా కాదు.. అతిథులు ఎప్పటికైనా వెళ్లిపోవాల్సిందే.. జగతి సగర్వంగా తలెత్తుకుని ఆ ఇంట్లో అడుగుపెట్టాలి, మంగళహారతి ఇచ్చి సగర్వంగా ఆహ్వానించాలి..రిషి అమ్మగా గుర్తించాలి.. ఆ ఇంట్లో కూడా మేడం అని పిలిస్తే ఎంత బాధపడ్డానో తెలుసా అని చెప్పిన మహేంద్ర..నేను తప్పు చేశానా అని అడుగుతాడు. 


Also Read: కార్తీక్ కోసం తాడికొండ తిరిగొచ్చిన మోనిత.. సౌందర్య ఏం చేయబోతోంది .. కార్తీకదీపం బుధవారం ఎపిసోడ్


ఇంతలో జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చిన జగతితో.. నీ విషయంలో నేను ఏదైనా తప్పు చేశానా అని అడుగితే కాలమే తప్పు చేసింది. రిషి సార్ రమ్మన్నారు వచ్చాను, మా వారు వెనక్కు తీసుకొచ్చారు వచ్చేశాను అంటుంది. జగతి అసలు అని ఏదో చెప్పబోతుంటే..ఈ టాపిక్ ఇక్కడితో వదిలేద్దామా అని మహేంద్రని ఆపేస్తుంది. పాపం బాధలన్నీ మనసులోనే దాచుకుంటుందని మహేంద్ర, మేడం మనసులో ఎంత బాధఉన్నా ఏమాత్రం బయటపడరని వసుధార అనుకుంటారు.


కట్ చేస్తే రిషి ఇంట్లో తన రూమ్ లో తిరుగుతూ జగతి ఉన్నంత సేపూ తండ్రి ఎంత ఆనందంగా ఉన్నాడో తలుచుకుంటాడు. ఇంతలో అక్కడకు వచ్చిన గౌతమ్..ఐస్ క్రీం తెమ్మన్నావ్ కదా తీసుకొచ్చా పద..వెళ్లి వసుకి, జగతిమేడంకి ఇద్దాం అంటే వాళ్లు వెళ్లిపోయారని చెబుతాడు రిషి. అలా ఎలా వెళ్లిపోతారని గౌతమ్ క్వశ్చన్ చేస్తే..ఐస్ క్రీం తింటావో , ఫ్రిజ్ లో పడేస్తావో నీ ఇష్టం అంటాడు. వసు వెళ్లిపోవడం ఏంటని గౌతమ్ బాధపడతాడు. భోజనానికి రమ్మని పిలిచేందుకు వచ్చిన ధరణితో..మీరేదో డల్ గా ఉన్నారేంటి వదినా అని అడుగుతాడు... అనుకోకుండా ఓ సంతోషం ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది రిషి అనేసి బాధగా వెళ్లిపోతుంది ధరణి. ఏంటీ వదిన ఇలా అంటున్నారనే ఆలోచనలో పడతాడు రిషి


Also Read: Also Read: చంద్రుడిది-కలువది అందమైన బంధం.. కానీ అవెప్పుడూ కలుసుకోలేవు.. పిండేసిన గుప్పెడంతమనసు మంగళవారం ఎపిసోడ్


ఇంటి బయట నిల్చున్న వసుధార... జగతి అతిథిగా వచ్చింది అమ్మగా కాదన్న మహేంద్ర మాటలు గుర్తుచేసుకుంటుంది. కాఫీ తీసుకొచ్చి ఇచ్చిన జగతి..కొన్ని విషయాలు ఎక్కువగా ఆలోచించకపోవడం మంచిది అని చెప్పేసి వెళ్లిపోతుంది. రిషి సార్ ఒక్కమాట ఉండమని చెబితే మీ సొమ్మేం పోతుంది..ఈసారి కనిపిస్తే గట్టిగా నిలదీస్తా అంటుంది. కరెక్ట్ గా ఇంటి ముందు కారు ఆపి దిగుతాడు రిషి. ఏంటో ఇలా అనుకోగానే అలా వచ్చేసారు అనుకుంటుంది. కాఫీ తీసుకోండి అనగానే కాకి ఎంగిలా అంటాడు..నేనింకా తాగలేదు తీసుకోండి అంటుంది. కాస్త లేట్ గా వస్తే తాగేదానివి కదా తాగేయ్ త్యాగాలు వద్దంటాడు. ఇది కూడా త్యాగమా అన్న వసుధారతో..ఇప్పుడేంటి త్యాగాలు రకాల గురించి క్లాస్ వేస్తావా అంటాడు. ఎందుకలా ఆలోచిస్తారు.. మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అన్న వసుతో..నువ్వు అవసరం లేనివాటిగురించి ఎక్కువ ఆలోచిస్తావేమో అంటాడు. జగతి మేడం గురించి అడగాలి అనుకుంటే నా నోరు మూయించేశారు అనుకుంటుంది వసు. కాఫీ తాగేసి లోపలకు రా..కాలు నొప్పి తగ్గేవరకూ నడవడం తగ్గించు అని చెబుతాడు.


లోపలకు వెళ్లిన రిషిని చూసి రా కూర్చో అంటాడు మహేంద్ర. సరిగ్గా అప్పుడే వచ్చిన జగతి రిషిని చూసి షాక్ అవుతుంది. వాటర్ తీసుకొస్తారా అని అడుగుతాడు రిషి. తీసుకొచ్చిన వాటర్ డాడ్ కి ఇవ్వండి అని చెప్పి.. ట్యాబ్లెట్స్ వేసుకునే టైమ్ అయిందని చెప్పి తీసి ఇస్తాడు. ఇందుకోసం వచ్చావా అన్న మహేంద్రతో..మీరు ఇంటికి క్యాబ్ లో రావడం నచ్చదు అందుకే వచ్చాను అంటాడు. థ్యాంక్స్ రిషి అన్న మహేంద్రతో ఇది నా బాధ్యత మీరు థ్యాంక్స్ చెప్పొద్దంటాడు. ఈ మధ్య మిమ్మల్ని మీరు పట్టించుకోవడం లేదు..చెప్పకుండా బయటకు వస్తున్నారు అందుకే నేను పట్టించుకోవాల్సి వస్తోంది..కొడుకుగా ఇది నా బాధ్యత అన్న రిషితో.. నీ బాధ్యత నీకు ఉంటే నేను పట్టించుకోవాల్సిన వాళ్లు ఉన్నారు..నా బాధ్యతలు నాకుంటాయి కదా అని మహేంద్ర అంటాడు. కార్లో వెయిట్ చేస్తాను మీరు మిస్డ్ కాల్ ఇవ్వండి వస్తాను అనేసి వెళ్లిపోతున్న రిషితో ఎందుకంత కోపం అని మహేంద్ర లేచి నిలబడతాడు. కోపం అని నేను చెప్పానా..మీరు అనుకుంటున్నారంతే అనేసి బయటకు వెళ్లిపోతాడు. తప్పని పరిస్థితిలో మహేంద్ర వెళ్లిపోతాడు.


రూమ్ లో ఒంటరిగా కూర్చున్న గౌతమ్..వసు ఫొటో చూసి కవితలు చెప్పుకుంటాడు. నీ చిరునవ్వులు వరం..నీ పేరు తలుచుకుంటే ప్రేమ జ్వరం అంటూ వసుని తలుచుకుంటే కవిత్వం పొంగుతోంది అనుకుంటాడు. ఇంటికి చేరుకున్న మహేంద్రతో..మీ గదిలోకి రానా అని అడుగుతాడు రిషి. నాకు ఒంటరితనం అలవాటైందన్న మహేంద్రతో..మీరు కోరుకున్నవన్నీ మీకు ఇవ్వకపోవచ్చు కానీ ..మీ ఒంటరితనాన్ని గౌరవించగలను అనేసి రిషి వెళ్లిపోతాడు. ఇది నాకు బ్యాడ్ నైట్..మళ్లీ జగతి ఒంటరిదైపోయిందని బాధపడతాడు మహేంద్ర.


రేపటి( గురువారం) ఎపిసోడ్ లో
రోడ్డుపై గౌతమ్ ఓ ప్రేమ, ఓ పిచ్చి అని పాటపాడుకుంటాడు. క్లాస్ రూమ్ లో ప్లాబ్లెమ్ సాల్వ్ చేసేందుకు ప్రయత్నించినా రాకపోవడం కొట్టేస్తుంది. అది చూసిన రిషి నేను చెప్పినా రావడం లేదా నీ లోపమా, నా లోపమా అంటాడు. ఇద్దరి లోపం కాదుసార్ అని పక్కన కూర్చుంటాడు. మళ్లీ ఎక్స్ ప్లైన్ చేస్తాడు. వసుమాత్రం రిషిని చూస్తూ ఉండిపోతుంది. 


Also Read: వాయిస్ తగ్గించి మాట్లాడు ఆయుష్షు మిగులుతుంది.. సౌందర్య రీ ఎంట్రీ మామూలుగా లేదు .. కార్తీకదీపం మంగళవారం ఎపిసోడ్