కార్తీకదీపం ఫిబ్రవరి 9 బుధవారం ఎపిసోడ్
నా కొడుకు వందలమందికి గుండె ఆపరేషన్ చేశాడు..తన అపాయింట్ మెంట్ కోసం రోజుల తరబడి ఎదురుచూస్తారు...నువ్వెంత నీ బతుకెంత అని రుద్రాణిపై ఫైర్ అవుతుంది సౌందర్య. ఏంటి దీపా ఇది దీని కాళ్లపై పడతావా..మన కార్లు తెచ్చిపెడితే దీని ఇల్లు సరిపోదు దీని కాళ్లపై పడతావా అంటుంది. నాకు అప్పున్నారు తీర్చలేదు అన్న రుద్రాణితో.. ఆగర్భ శ్రీమంతుడు నాకొడుకు, కోట్ల రూపాయలు దానం ఇచ్చి ఇక్కడకు వచ్చాడు..వాడి ఒక్కరోజు సంపాదన నువ్వు ఏడాదైనా సంపాదించలేవంటుంది. నీ బాకీ ఎంత అంటే..మూడు లక్షల 20 వేలు అన్న రుద్రాణికి పది లక్షలు చెక్కురాసి ఇచ్చేస్తుంది. పది లక్షలా అంటే ఏం సరిపోలేదా ఇంకా..నా పెద్ద కొడుకు, పెద్ద కోడలు ఈ సారి హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇల్లు చూసి వెళ్లు నువ్వేంటో నీ బతుకేంటో తెలుస్తుందంటుంది సౌందర్య. ఇంతలో అక్కడకు వచ్చిన హిమ...సౌందర్యని చూసి నాన్నమ్మా అని పరిగెత్తుకు వస్తుంది. మనం హైదరాబాద్ వెళ్లిపోదాం అంటుంది. రుద్రాణి ఇంకా షాక్ లోనే అలా చూస్తూ నిలబడిపోతుంది. 


Also Read: వాయిస్ తగ్గించి మాట్లాడు ఆయుష్షు మిగులుతుంది.. సౌందర్య రీ ఎంట్రీ మామూలుగా లేదు .. కార్తీకదీపం మంగళవారం ఎపిసోడ్
కట్ చేస్తే తాడిగొండ గ్రామం అని బోర్డు కనిపించిన దగ్గర కారు ఆపి మోనిత, భారతి కిందకు దిగుతారు. తాడికొండ గ్రామంలో నా కార్తీక్ ఉన్నాడని తెలిసాక ఈ ఊరి బోర్డుకి థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా అంటుంది. కార్తీక్ కోసం నేను ఎంత ఎదురుచూస్తున్నానో నీకు తెలీదు. నీ సంగతి నాకెందుకు తెలీదని భారతి అంటే... నీకు నా మొండితనమే తెలుసు కానీ నా మనసులో ప్రేమ తెలియదు అంటుంది. ఈ ఊర్లోకి ఇంతకుముందు నేనొకసారి వచ్చాను...మా అత్తామామలు ఈ ఊర్లో ప్రకృతి వైద్యశాలకు వచ్చారు..వాళ్లని ఫాలో అవుతూ వచ్చానంటుంది మోనిత. ప్రకృతి వైద్యశాలకు వాళ్లని పంపించింది నేనే అంటుంది భారతి. మొత్తానికి తాడికొండలో నా కథ సుఖాంతం కాబోతోంది అన్నమాట అంటుంది మోనిత.


మరోవైపు హిమ కోసం సౌర్య ఏడుస్తుంటుంది. అమ్మావాళ్లు డబ్బులు ఇవ్వలేరు..వాళ్లు హిమని ఇవ్వరేమో అని ఏడుస్తుంది. ఇంతలో హిమ రావడం చూసి శౌర్య నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతుంది. రానేమో అనుకున్నా అన్న హిమతో మరి ఎలా వచ్చావ్ అంటే...వెనుకే ఉన్న సౌందర్యని చూపిస్తుంది. శౌర్య ఎలా ఉన్నావ్ అంటూ దగ్గరకు తీసుకుంటుంది. నానమ్మే డబ్బులు కట్టి తీసుకొచ్చిందని చెబుతుంది హిమ. శౌర్యకి ఏమైందని సౌందర్య అడగడంతో...హిమ చెప్పేందుకు ప్రయత్నించినా కార్తీక్, దీప అడ్డుపడతారు. దానికేం కాలేదు చిన్న సమస్య అంతే అబద్ధం చెబుతారు. కార్తీక్ వాళ్లు తాడికొండ వచ్చినప్పటి నుంచీ జరిగిన సంఘటనలన్నీ చెబుతాడు కార్తీక్. వీడి పేరు ఆనంద్ అని చెబుతుంది శౌర్య. సౌందర్యకి వెంటనే మోనిత గుర్తుకు వస్తుంది. బాబుని శౌర్యకి ఇచ్చేసి ఇల్లంతా తిరిగి చూస్తుంది సౌందర్య. ఇలాంటి ఇంట్లో ఉంటున్నారా అని బాధపడుతుంది సౌందర్య. అన్నీ వదులుకుని ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి, ఇన్నిన్ని కష్టాలు పడడం అవసరమా , మేమంతా ఉన్నాం కదా అంటుంది సౌందర్య. అడ్డుపడిన దీప ఆయన్నేం అనకండి అంటుంది. మెడలో పసుపు తాడు దాచుకునేందుకు ప్రయత్నించడం గమనించడం సౌందర్య ఏంటిదంతా అడుగుతుంది. 


Also Read: రిషికి అమ్మగా జగతి ఇంట్లో అడుగుపెట్టాలన్న మహేంద్ర.. మీ ఒంటరి తనాన్ని గౌరవిస్తానన్న రిషి.. గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్
మోనిత వెళ్లినట్టే వెళ్లి మళ్లీ కారు తప్పి గ్రామం బోర్డు దగ్గరకు తీసుకొస్తుంది. ఏంటి మోనిత దిగి బోర్డుకి నమస్కారం చేసుకుని వస్తావా అని అడుగుతుంది భారతి. నీకు వెటకారం అయిపోయిందా అన్న మోనిత..నా కార్తీక్ అంటూ వేదాంతం మాట్లాడుతుంది. కార్తీక్ దూరమయ్యాడు, నా బాబు దూరమయ్యాడు, నన్ను నేనే ఓదార్చుకుంటూ ధైర్యంగా అడుగేస్తున్నాను. కనీసం వాళ్లున్నా మనకు చిన్న ఆధారం అయినా దొరికేది...అందరూ దొరికినట్టే దొరికి తప్పించుకుంటున్నారు అంటుంది మోనిత.


పెద్దోడా మన ఇంటికి వెళ్లిపోదాం అన్న సౌందర్యతో ..నేను రాలేను అని రిప్లై ఇస్తాడు కార్తీక్. ఇక్కడకు వచ్చి ఏం సాధించావ్, నువ్వు బాధపడుతున్నావ్, దీపని బాధపెడుతున్నావ్, పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నావ్ ఏంటి దీపా నువ్వు మాట్లాడవేంటని ప్రశ్నిస్తుంది. కార్తీక్ ఏం చెప్పినా ఎదురుచెప్పను అంటావ్..నీ పతి ధర్మం బాగానే నెరవేరుస్తున్నావ్ మరి నా తల్లి మనసు మాటేంటని బాధపడుతుంది.  మీరు వచ్చేసినప్పటి నుంచీ ఎంత బాధపడ్డామో తెలుసా అని జరిగినదంతా చెబుతుంది. అమ్మా నాన్న ఏమయ్యారో అని ఒక్కసారైనా ఆలోచించావా .. నువ్వు ఏం తప్పు చేశావని , ఎందుకిలా తలదించుకుంటున్నావ్ నువ్వు గొప్ప డాక్టర్ వి..నీ గురించి నేను గర్వంగా చెప్పుకుంటాను అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అంత విన్నాక కూడా నేను రాలేను మమ్మీ అంటాడు కార్తీక్. ఎందుకు రాలేవు, నువ్వు ఏ పాపం చేయలేదు, ఏదో ఓ చిన్న పొరపాటు జరిగిందని సౌందర్య అంటే..దాని విలువ ఓ ప్రాణం, ఓ కుటుంబం అంటాడు. ఎన్నో ఆపరేషన్లు సక్సెస్ చేసిన నువ్వు ఓ గొప్ప డాక్టర్ వి అని సౌందర్య అంటే.. ఇప్పుడు డాక్టర్ ని కాదంటాడు. నిన్నగాక మొన్న కలసిన బాబుపై మీరు ప్రేమ పెంచుకున్నరే...ఎవరో ఏంటో తెలియకే మీకు అంత అభిమానం ఉంది.. మరి కొడుకుపై ఈ తల్లికి ఎంత ప్రేమ ఉంటుందో ఊహించలేవా అంటుంది సౌందర్య... ఎపిసోడ్ ముగిసింది...