సంక్రాంతికి థియేటర్లలో కింగ్ అక్కినేని నాగార్జున, ఆయన పెద్ద కుమారుడు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సోగాళ్లుగా సందడి చేశారు. 'బంగార్రాజు' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇప్పుడీ సినిమాను డిజిటల్ వీక్షకుల ముందుకు తీసుకు వస్తోంది 'జీ 5'. ఈ నెల 18న (Bangarraju OTT Release On February 18th, 2022) తమ ఓటీటీ వేదికలో విడుదల చేస్తోంది.


'సోగ్గాడే చిన్ని నాయనా'కు సీక్వెల్‌గా రూపోందిన‌ 'బంగార్రాజు' సినిమాకు కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌తో క‌లిసి జీ స్టూడియోస్ నిర్మించింది. అక్కినేని నాగార్జున నిర్మాత. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా, ఫిబ్రవరి 18 నుంచి 'జీ 5' ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. నాగార్జునకు జంటగా రమ్యకృష్ణ, నాగ చైతన్య జోడీగా కృతీ శెట్టి నటించిన ఈ సినిమాలో రావు రమేష్, సంపత్ రాజ్, గోవింద్ పద్మసూర్య, బ్రహ్మాజీ, 'వెన్నెల' కిషోర్, ఝాన్సీ తదితరులు ఇతర తారాగణం. మీనాక్షీ దీక్షిత్, దర్శనా బానిక్, వేదిక, దక్షా నాగర్కర్, ఫరియా అబ్దుల్లా ప్రత్యేక గీతాల్లో సందడి చేశారు.


'బంగార్రాజు'తో 'జీ 5' ఓటీటీలో నాగ చైతన్య మరోసారి సందడి చేయనున్నారు.  ఆయన హీరోగా నటించిన 'రారండోయ్ వేడుక చూద్దాం' 'జీ 5'లోనే విడుదల అయ్యింది. ఆ సినిమాకు కూడా కళ్యాణ్ కృష్ణ దర్శకుడు. ఇప్పుడీ 'బంగార్రాజు'కు కూడా ఆయనే దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మించిన 'లూజర్', 'లూజర్ 2' ఒరిజినల్ సిరీస్‌లు 'జీ 5'లో విడుదలైన సంగతి తెలిసిందే.