అమ్మాయిలకి మరింత అందాన్ని ఇచ్చేది వాళ్ళ పెదవులే. ఎర్రటి పెదాల కోసం అమ్మాయిలు అనేక ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు రకరకాల షేడ్స్ ఉన్న లిప్ స్టిక్స్ అందుబాటులోకి వచ్చేశాయి. పెదవులు పగిలిపోయినా, మంచి రంగు కోసం వాటిని వేసుకుంటూ ఉంటారు. అయితే ఒకరు వాడిన లిప్ స్టిక్స్ ఇంకొకరు ఉపయోగించడం వల్ల అనారోగ్యాలు వ్యాపించే ప్రమాదం ఉంది. ఇదే కాకుండా లిప్ స్టిక్స్ లోని రసాయనాల వల్ల కూడా అనేక రోగాలు వస్తాయి. ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తలు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరస్ లక్షణాలు కలిగిన కాన్ బెర్రీ కలర్ లిప్ స్టిక్ తీసుకొచ్చారు. ఇది వాడటం వల్ల లిప్ స్టిక్స్ వల్ల వచ్చే వైరస్లు, బ్యాక్టీరియాని అడ్డుకుంటుంది.


లిప్ స్టిక్ ఇప్పుడు కొత్తగా వచ్చిందేమి కాదు దానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈజిప్టులోని ప్రజలు ఖనిజాలు, ఇతర పదార్థాలతో తయారు చేసిన పేస్ట్ ని మొహానికి మేకప్ గా రాసుకునే వాళ్ళు. ఎర్రటి రాళ్ళని పగలగొట్టి వాటిని లిప్ స్టిక్ గా రాసుకునే వాళ్ళు. తర్వాత పరిశోధకులు వాటిని వృత్తాకారంగా అభివృద్ధి చేసి సహజ పదార్థాలు జోడించి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వీటిని పెదవులకి రాసుకోవడం వల్ల అలర్జీలు సంభవిస్తాయి. వాటిలోని కెమికల్స్ పొట్టలోకి చేరి కడుపు సంబంధిత సమస్యలని తీసుకొస్తుంది. వీటి వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. అందుకే శాస్త్రవేత్తలు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.


కాన్ బెర్రీ రసంతో వైరస్‌లకి చెక్


ఉదాహరణకి ఎరుపు రంగు కోసం రెడ్ డ్రాగన్ ఫ్రూట్‌ని లిప్‌స్టిక్ లో ఉపయోగించే వాళ్ళు. అందులో యాంటీ మైక్రోబయల్ గుణాలు ఉన్నాయి. కాన్ బెర్రీ రసంలో వైరస్ లు, బ్యాక్టీరియాని అడ్డుకునే గుణం కలిగి ఉందని పరిశోధకులు గుర్తించారు. యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్న ముదురు ఎరుపు రంగులో లిప్ స్టిక్ ని స్పానిష్ బృందం రూపొందిస్తుంది. ఈ పరిశోధనా బృందం కాన్ బెర్రీ రసాన్ని లిప్ స్టిక్స్ క్రీమ్ బెస్ లో మిక్స్ చేసింది. ఇందులో షియా బటర్, విటమిన్ ఇ, ప్రొవిటమిన్ బి 5, బాబాసు, అవకాడో ఆయిల్ కలిపారు.


కాన్ బెర్రీ రసం జోడించడం వల్ల ఎన్వలప్డ్, నాన్ ఎన్వలప్డ్ వైరస్ రకాలు రెండు ఇన్ యాక్టివేట్ అయ్యాయి. ఇది యూజ్ చేసిన ఐదు గంటల వ్యవధిలోనే మైక్రోబ్యాక్టీరియాలు క్రియారహిత్యం అయ్యాయి. వీళ్ళు తయారు చేసిన లిప్ స్టిక్ ఫార్ములా వివిధ రకాల వ్యాధులని కలిగించే సూక్ష్మజీవుల నుంచి రక్షణ అందించగలదని పరశోధకులు వెల్లడించారు. స్పానిష్ కి చెందిన పరిశోధకులు దీన్ని రూపొందించారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: రాత్రిపూట పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదా? నిపుణులు ఏం చెబుతున్నారంటే