Falling in Love Signs : ప్రేమ ఎప్పుడు.. ఎవరి మీద పుడుతుందో తెలియదు. కానీ దానిలో పడితే అంత సులువుగా బయట పడడం జరగదు. ప్రేమ సక్సెస్ అవుతుందో.. ఫెయిల్ అవుతుందో చెప్పలేము కానీ.. ఈ రెండింటికీ మధ్యలో ఓ ఫేజ్ ఉంటుంది. ఆ సమయంలో ఓ వ్యక్తిని మీరు ఎంతగా ఇష్టపడగలరో అర్థమవుతుంది. అయితే మీరు ప్రేమలో ఉన్నారని తెలిపే కొన్ని సంకేతాలు ఉన్నాయి. మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా? లేదా అనే డైలామాలో ఉంటే.. ఈ సంకేతాలు మీలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఇవి మీ ప్రేమకు సంకేతాలే. 


వాళ్ల గురించే ఆలోచిస్తూ ఉంటారు..


ఓ వ్యక్తి గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారంటే అది పగ అయినా అయి ఉండాలి. ప్రేమ అయినా ఉండాలి. అయితే మీరు ప్రేమించిన వ్యక్తితో కలిసి ఉన్నట్లు.. వారితోనే ఉన్నట్లు ఊహించుకుంటుంటే అది మాత్రం కచ్చితంగా ప్రేమే. వారి గురించి పగటి కలలు కంటూ ఉంటారు. ఇది మీరు ప్రేమలో ఉన్నారని చెప్పే మొదటి సంకేతం. 


బటర్​ఫ్లైలు వస్తాయి


ప్రేమించినవారు మీకు దగ్గరగా వచ్చినా.. లేదా వారు మీతో మాట్లాడినా.. మీకు భయంగా లేదా ఎక్జైటింగ్​గా ఉంటుంది. ఇది మీరు ప్రేమలో ఉన్నారని తెలిపే మరో సంకేతం. వారు మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు తెగ టెన్షన్ పడిపోతూ.. లోపల ఆనందంగా ఫీల్ అయితే.. ఇంకాసేపు ఉంటే బాగుండు అనుకుంటూ ఉంటారు. 


తోడుగా ఉండాలనుకుంటారు.. 


ప్రేమించిన వారితో టైమ్ స్పెండ్ చేయాలని కోరుకుంటారు. వీలైనంత ఎక్కువసేపు వారితో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. వారి గురించి ఎక్కువ తెలుసుకోవాలనిపిస్తుంది. మీ సంతోషాలు, బాధలు వారితో పంచుకోవాలనే కోరిక మీలో ఎక్కువ ఉంటుంది. మీ ప్రతి మూమెంట్​లో వారు మీ తోడుగా ఉండాలని విష్ చేస్తారు. 


కమ్యూనికేషన్ 


మీరు ప్రేమించిన వ్యక్తికి మీకు సంబంధించిన ప్రతి విషయం చెప్పాలనుకుంటారు. ఏ టాపిక్ మాట్లాడడానికి అయినా మీరు కంఫర్ట్​బుల్​గా ఫీల్ అవుతారు. ఓపెన్, ఎక్స్​ప్రెసివ్​ మీ కమ్యూనికేషన్ ఉంటుంది. ఇది కూడా ప్రేమలో సంకేతమే. మీ భావాలు, ఆలోచనలు వారితో ఎక్కువగా పంచుకుంటున్నారంటే మీరు ప్రేమలో ఉన్నారనే అర్థం. 


ప్రొటెక్టివ్​గా ఫీల్ అవుతారు.. 


ఏ రిలేషన్​లో అయినా నమ్మకం అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. మీకు కంఫర్ట్​బుల్​గా, లేదా ఓ వ్యక్తితో అసౌకర్యంగా ఉంటే అది మీకు తెలిసిపోతుంది. అలాగే మీరు ఇతరుల కంటే ఆ ఒక్కరిదగ్గర ఉన్నప్పుడే మీరు సేఫ్​గా ఫీల్​ అవుతున్నారా? ఇది కూడా మీ ప్రేమలో లక్షణమే. ఎదుటి వ్యక్తిపై ఉండే నమ్మకం కూడా ప్రేమలో ఓ సంకేతమే. 



అసూయ వచ్చేస్తుంది..


మీరు ప్రేమించిన వ్యక్తితో ఎవరైనా మాట్లాడినా.. పోని వారు మీతో మాట్లాడకపోయినా మీకు అసూయ వచ్చేస్తుంది. వారు మీకు కాకుండా అందరికీ టైమ్ ఇస్తున్నప్పుడు మీలో ఈ అసూయ వస్తుంది. ఇది ప్రేమలో కామన్ విషయమే. ఈ సంకేతాలు మీరు ఏ వ్యక్తి వల్లనైనా ఫీల్ అవుతున్నారంటే.. దాని అర్థం ప్రేమనే అని గుర్తించి మీ లవ్ లైఫ్​ని ఎంజాయ్ చేయండి. 


Also Read : మచ్చలందు లవ్​బైట్​ వేరయా? దీనిని ఎలా తగ్గించుకోవచ్చంటే