Vinayaka Chaturthi Naivedyam : వినాయక చవితి(Vinayaka Chavithi 2024) సమయంలో చేసుకోగలిగే టేస్టీ రెసిపీలలో కొబ్బరి లౌజ్​లు(Coconut Laddu), రవ్వ లడ్డూలు(Ravva Laddu) కచ్చితంగా ఉంటాయి. గణేషుడికి లడ్డూలంటే మహా ప్రీతి. కాబట్టి ఈ సమయంలో మీరు రకరకాల లడ్డూలు చేయొచ్చు. పైగా వాటిని సింపుల్​గా, టేస్టీగా చేసేయొచ్చు. మరి వాటిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి? వాటిని ఎలా తయారు చేయాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.


కొబ్బరి లౌజ్​ చేసేందుకు కావాల్సిన పదార్థాలు 


కొబ్బరి తురుము - ఒకటిన్నర కప్పులు


బెల్లం - ముప్పావు కప్పు


యాలకులు - అర టీస్పూన్


నెయ్యి - 1 టేబుల్ స్పూన్ 


నీళ్లు - పావు కప్పు


తయారీ విధానం


స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టి దానిలో బెల్లం తురుము వేయాలి. దానిలో నీళ్లు కూడా వేసి బెల్లాన్ని కరగనివ్వాలి. చిన్న మంట మీద ఉంచి.. బెల్లాన్ని కరగనివ్వాలి. అది కాస్త చిక్కగా మారిన తర్వాత స్టౌవ్ ఆపి వడకట్టాలి. ఇప్పుడు మరోసారి స్టౌవ్ వెలిగించి మందపాటి కడాయి పెట్టాలి. దానిలో నెయ్యి వేయాలి. కొబ్బరి తురుము వేసి.. దానిని రెండు నుంచి మూడు నిమిషాలు వేయించాలి. చిన్న మంట మీదనే ఇలా చేయాలి. లేదంటే కొబ్బరి మాడిపోతుంది. 


ఇలా ఫ్రై చేసుకున్న కొబ్బరిలో బెల్లం సిరప్ వేయాలి. బెల్లం, కొబ్బరి బాగా కలిసి.. దానిలోని నీరు ఆవిరై పోయి దగ్గరగా అయ్యేవరకు దానిని కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు స్టౌవ్ ఆపేసి దానిని చల్లారనివ్వాలి. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతులకు నెయ్యి రాసుకుని.. కొబ్బరిని తీసుకుంటూ చిన్న చిన్న లడ్డూలుగా ఒత్తుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ కొబ్బరి లౌజ్​లు రెడీ. వీటిని వినాయకుడికి నైవేద్యంగా పెట్టొచ్చు. మాములుగా చేసుకున్నా ఇవి వారం రోజులు మంచిగా నిల్వ ఉంటాయి. 



రవ్వ లడ్డూల కోసం కావాల్సిన పదార్థాలు


రవ్వ - 1 కప్పు


పంచదార - ముప్పావు కప్పు


కొబ్బరి - పావు కప్పు


నెయ్యి - పావు కప్పు


యాలకుల పొడి - 1 టీస్పూన్


ఎండు ద్రాక్ష - 10 


జీడిపప్పు - 10


తయారీ విధానం


 స్టౌవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో రవ్వ, కొబ్బరి వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంటను మీడియంలో ఉంచి ఆరు నుంచి ఏడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కాస్త గోల్డెన్ కలర్ ఛేంజ్ అవ్వగానే స్టౌవ్ ఆపేయాలి. లేదంటే మాడిపోతుంది. ఇలా ఉంటే క్రంచీగా, మంచి స్మెల్​తో లడ్డూలు బాగా వస్తాయి. దీనిని చల్లార నివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దానిలో పంచదార, యాలకుల వేసి పొడి చేయాలి. 


రవ్వ చల్లారిన తర్వాత పంచదార పొడి మిశ్రమాన్ని వేసి కలపాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి జీడిపప్పు, ఎండుద్రాక్షను నెయ్యితో వేయించుకోవాలి. వీటిని కూడా నెయ్యితో పాటు రవ్వ మిశ్రమంలో వేసేయాలి. నెయ్యి దానిలో కలిసిపోయిన తర్వాత కాస్త చల్లారనిచ్చి చేతితో బాగా కలపాలి. ఇప్పుడు దానిని చిన్న చిన్న లడ్డూలుగా ఒత్తుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ రవ్వ లడ్డూ కూడా రెడీ. లడ్డూలు విడిపోతున్నట్లు అనిపిస్తే.. నెయ్యి లేదా, పాలు వేసి లడ్డూలుగా ఒత్తుకోవచ్చు. మీరు అన్ని పర్​ఫెక్ట్​గా చేస్తే ఇవి నెల రోజులు కూడా నిల్వ ఉంటాయి. చవితికి ముందు రోజు వీటిని తయారు చేసుకుని కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. 


Also Read :  బొజ్జ గణపయ్యకు ఉండ్రాళ్ల పాయసం.. బెల్లంతో ఇలా చేసిపెడితే విగ్నేశ్వరుడికి మహా ఇష్టమట.. రెసిపీ ఇదే