Tasty Chekka Appalu Recipe : బోనాల సమయంలో చాలా మంది పిండివంటలు చేసుకుంటారు. వాటిలో అప్పాలు కూడా ఒకటి. కొందరు మురుకులు తిన్నట్టే.. మరికొందరు చెక్కలను చాయ్​తో పాటు తీసుకుంటారు. ఇంట్లో సింపుల్​గా చేసుకోగలిగే ఈ చెక్కలను పిల్లలనుంచి పెద్దలవరకు అందరూ ఇష్టంగా తింటారు. క్రిస్పీగా, టేస్టీగా ఈ చెక్కలను ఎలా చేయాలో.. ఇవి చేయానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు


అల్లం - అర అంగుళం


వెల్లుల్లి - 8


పచ్చిమిర్చి - 2 


జీలకర్ర - 1 టీస్పూన్


ధనియాలు - 2 టీస్పూన్లు


బియ్యం పిండి - 2 కప్పులు


నీళ్లు - ఒకటిన్నర కప్పు


శనగపప్పు - 1 స్పూన్


పెసరపప్పు - 1 స్పూన్


కారం - 1 స్పూన్


ఉప్పు - రుచికి తగినంత


బటర్ - 1 టీస్పూన్


కరివేపాకు - 2 టేబుల్ స్పూన్లు


నూనె - వేయించుకోవడానికి సరిపడేంత


తయారీ విధానం


ముందుగా శనగపప్పు, పెసరపప్పును కడిగి.. రెండు వంట చేసే రెండు గంటల ముందు నానబెట్టుకోవాలి. మిక్సీ జార్​ తీసుకుని దానిలో అల్లం, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై నీళ్లు పెట్టుకోవాలి. దానిలో ముందుగా తయారు చేసుకున్న పేస్ట్, శనగపప్పు, పెసరపప్పు, కారం, రుచికి తగినంత ఉప్పు, బటర్ వేయాలి. నీటిలో పూర్తిగా కరిగిపోయి.. నీటిని మరగనివ్వాలి. దానిలో కరివేపాకు రెబ్బలను కట్ చేసి వేయాలి. 


నీరు మరుగుతున్న సమయంలో బియ్యం పిండిని చల్లుకోవాలి. నీరు మరిగిన తర్వాత బియ్యం పిండిని దానిలో వేసి కలపి.. స్టౌవ్ ఆపేయాలి. పిండిని పట్టుకుంటే ముద్దలా అవ్వాలి. అప్పుడే బియ్యం పిండి, నీరు కరెక్ట్​గా ఉన్నట్లు లెక్క. ఇప్పుడు పిండి కొద్దిగా కొద్దిగా తీసుకుంటూ.. నీళ్లు చల్లుతూ ముద్దగా చేసుకోవాలి. మిగిలిన పిండిపై కూడా మూత వేసే ఉంచాలి. పిండిపై ఎప్పుడూ మూత వేసే ఉంచాలి. లేదంటే పిండి డ్రై అయిపోతుంది. పిండిని కొంచెం కలుపుతున్నారంటే.. మిగిలిన దానిని మూత వేసి లేదా.. మెత్తటి క్లాత్ వేసి దానిని కప్పి ఉంచాలి. 


ఇప్పుడు మెత్తగా కలిపిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఒత్తుకోవాలి. కవర్​కి నూనె రాసి.. వాటిపై ఇవి ఉంచి.. గ్లాస్​తో లేదా గిన్నెతో ఒత్తుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని నూనెలో వేయించుకోవాలి. అందుకు స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టాలి. దానిలో డీప్​ ఫ్రైకి సరిపడా నూనె వేసుకుని కాగనివ్వాలి. నూనె వేడి అయ్యాక.. స్టౌవ్​ మంటను మీడియం చేసి.. దానిలో ముందుగా తయారు చేసుకున్న చెక్కలు వేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నప్పుడు వాటిని నూనె నుంచి తీసేయాలి. 



మిగిలిన పిండితో మొత్తం ఇదే విధంగా చెక్కలు చేసుకోవాలి. ఈ రెసిపీని ఫాలో అయితే చెక్కలు కమ్మగా.. నోట్లో పెడితే కరిగిపోయేలా వస్తాయి. అంతేకాకుండా క్రిస్పీగా వస్తాయి. ఇవి మూడు, నాలుగు వారాల వరకు నిల్వ ఉంటాయి. పైగా వర్షాకాలంలో ఇలాంటి స్నాక్స్ మంచి కాంబినేషన్​. పిల్లలకు స్నాక్స్​గా పెట్టడానికి కూడా హెల్ప్ అవుతాయి. ఈ బోనాలకు మీరు కూడా ఈ టేస్టీ చెక్క అప్పాలు తయారు చేసి.. హాయిగా లాగించేయండి. 


Also Read : తెలంగాణ స్పెషల్ రెసిపీ మలీద ఉండలు.. బతుకమ్మ, బోనాలకు ఇవి ఉండాల్సిందే