Telangana Special Sweet for Bonalu : నోటికి రుచినే కాకుండా.. చేయడానికి సింపుల్​గా.. అమ్మవారికి నైవేద్యంగా పెట్టేవాటిలో మలిద ఉండలు కూడా ఒకటి. వీటిని తయారు చేయడం చాలా సింపుల్ కానీ.. వీటికి అంత ప్రాచుర్యం లేదు. తెలంగాణలో బతుకమ్మ, బోనాలకు దీనిని కచ్చితంగా చేసుకుంటారు. ఇదొక ట్రెడీషనల్ డిష్​గా అక్కడివారు చెప్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు


గోధుమ పిండి - రెండు కప్పులు


బెల్లం - ముప్పావు కప్పు


నీళ్లు - పిండికి సరిపడా


నెయ్యి - 3 చెంచాలు


జీడిపప్పు - 20 


బాదం - 10
కొబ్బరి - పావు కప్పు


సాల్ట్ - చిటికెడు


తయారీ విధానం


మలీద ఉండలను చపాతీలతో చేసుకుంటారు. అవును మీరు చదువుతున్నది నిజమే. వీటిని చపాతీలతో చేసుకుంటారు. అందుకే ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దానిలో కాస్త సాల్ట్ వేసి కలుపుకోవాలి. చెంచా నూనె వేస్తే.. చపాతీలు సాఫ్ట్​గా వస్తాయి. ఇప్పుడు వాటిలో కొద్ది కొద్దిగా నీరు పోస్తూ.. పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని మెత్తగా, సాఫ్ట్​గా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటిని చపాతీలుగా ఒత్తుకోవాలి. చపాతీలు అతుక్కోకుండా.. కాస్త పిండి చల్లుకుని.. ఒకదానిపై ఒకటి పేర్చుకోవాలి. ఇప్పుడు మొత్తం పిండిని చపాతీలుగా ఒత్తుకోవాలి. 


Also Read : లంచ్ బాక్స్ స్పెషల్ వెజిటేబుల్ బిర్యానీ.. కుక్కర్​లో టేస్టీగా, ఈజీగా ఇలా చేసేయండి


ఇప్పుడు స్టౌవ్ వెలిగించి.. దానిపై పాన్ పెట్టండి. అది వేడి అయ్యాక.. కాస్త నూనె వేసి.. చపాతీలు రెండువైపులా కాల్చుకోవాలి. చపాతీలు సిద్ధమైన తర్వాత.. వాటిని కాస్త చల్లారినివ్వాలి. ఇప్పుడు వాటిని చిన్న చిన్న ముక్కలుగా చింపుకోవాలి. ఇప్పుడు రోలు తీసుకుని దానిలో వీటిని వేసుకోవాలి. వీటితో పాటు బెల్లంని వేసుకుని.. దంచుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుని.. కూడా దంచుకోవాలి. దానిలో నెయ్యి వేసుకోవాలి. బెల్లంలోని తేమ, నెయ్యి తేమ.. ఉండలుగా చేసుకునేందుకు సరిపోతుంది. 



ఇప్పుడు దీనిని ఓ బౌల్​లోకి తీసుకుని.. దానిలో కొబ్బరి పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటిని ఉండలుగా ఒత్తుకోవాలి. అంతే మలిద ఉండలు రెడీ. ఇవి మీకు మంచి రుచిని అందిస్తాయి. అంతేకాకుండా వీటిని అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. ముఖ్యంగా బతుకమ్మ రోజు.. మొదటి నైవేద్యంగా మలిద ఉండలనే పెడతారు. అమ్మవారికి ఇవి బాగా ఇష్టమని చెప్తారు. అందుకే వీటిని బోనాలకు కూడా చాలామంది చేసుకుంటారు. మరి మీరు కూడా ఈ బోనాలకు వీటిని తయారు చేసుకోండి. లేదంటే చపాతీలు మిగిలిపోయినప్పుడు.. తినడానికి కర్రీ లేదు అనుకున్నప్పుడు చక్కగా ఈ టేస్టీ రెసిపీని తయారు చేసుకోవచ్చు. స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు కూడా ఈ రెసిపీని ఈజీగా చేసుకోవచ్చు. 


Also Read : మురుకులు, చాయ్ కాంబినేషన్ ఇష్టమా? అయితే ఇలా సింపుల్​గా బోనాలకు చేసేయండి