Ratan Tata Childhood and Lovestory : రతన్ టాటా (Ratan Tata Died)ఇక లేరు. ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఆయన 2024, అక్టోబర్ 9న తుది శ్వాస విడిచారు. లక్షల కోట్లకు అధిపతి అయిన రతన్ టాటా.. తన చివరి దశలో ఒంటరిగానే వెళ్లిపోయారు. చనిపోయే ముందువరకు ఆయన యాక్టివ్గానే ఉన్నారు. కానీ వయసురీత్యా వచ్చే సమస్యలు అతనిని ఒంటరిగా వదల్లేదు. తమతోపాటే తీసుకుని వెళ్లిపోయాయి. కానీ పర్సనల్ లైఫ్‌లో చూసుకుంటే మాత్రం.. ఆయనకు పెళ్లికాలేదు.. కిడ్స్ లేరు. లవ్ స్టోరీ అందరికీ తెలియొచ్చు.. కానీ పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ మాత్రం అదికాదట.
రతన్ టాటా పలు ఇంటర్వ్యూల్లో తన ప్రేమ, పెళ్లి గురించిన ప్రశ్నలకు చక్కగా నవ్వుతూ సమాధానం ఇచ్చేవారు. ఆయన బ్యాచ్‌లర్‌గా మిగిలిపోవడానికి రీజన్స్ ఇవేనంటూ ఫన్నీగా బదులిచ్చేవారు. ముఖ్యంగా ఆయన లవ్ స్టోరి గురించి చాలామందికి ఇంట్రెస్ట్ ఉండేది. ఆరోజుల్లో లాస్ ఏంజెల్స్‌లో లవ్ స్టోరీ నడిపించారు రతన్ టాటా. ఎంతటి వారికైనా పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్.. లవ్ లైఫ్‌పై పడుతుందనేదానికి రతన్ టాటానే ఎగ్జాంపుల్.
రతన్ టాటా ఫస్ట్ లవ్.. (Ratan Tata First Love)
రతన్ టాటా ఆర్కిటెక్చర్లో గ్రాడ్యూయేషన్ అయ్యారు. అనంతరం లాస్ ఏంజెల్స్‌లో రెండు సంవత్సరాలు పని చేశారు. అక్కడ పనిచేయడం రతన్ టాటాకు చాలా నచ్చిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సొంత కారు ఉండేదట.. జాబ్ నచ్చేదట. ఆ సమయంలోనే రతన్ టాటా ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకునే టైమ్‌కి తన బామ్మ ఆరోగ్యం క్రిటికల్‌గా ఉందని ఇండియా తరిగివచ్చేశారు. ఆ అమ్మాయిని కూడా ఇండియాకి తీసుకెళ్లేందుకు చూశారు కానీ.. 1962లో జరిగిన ఇండో-చైనా యుద్ధం కారణంగా అమ్మాయి పేరెంట్స్ ఆమెను ఇండియాకు పంపేందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆయన ప్రేమ పెళ్లిదాక చేరుకోలేకపోయింది.
బామ్మవల్లే బ్రేకప్ అయింది కానీ బామ్మే ఎక్కువ..(Ratan Tata Childhood)
రతన్ టాటాకు నానమ్మ అంటే చాలా ప్రేమ, గౌరవం. ఎందుకంటే ఆయన చిన్నతనంలో తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. అప్పట్లో ఇది కామన్ కాదని.. తను, అతని తమ్ముడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని రతన్ తెలిపారు. ఆ సమయంలో తన నానమ్మ నేర్పిన విలువలే ఇప్పటికీ ముందుకు నడిపించాయని వెల్లడించారు. తల్లి రెండో పెళ్లి చేసుకోవడంతో స్కూల్లో ర్యాగింగ్ చేసేవారట. అలా అని తండ్రి ఆలోచనలను, ఆయన ఆలోచనలు ఎప్పుడూ భిన్నంగా ఉండేవట. కానీ ఆయన నానమ్మ మాత్రం లైఫ్‌లో ఎలా ఉండాలో.. ఎలా ఉండకూడదో వంటి విషయాలన్నీ నేర్పడంతో ఆయన ఆమెకు ఎక్కువ దగ్గరైపోయారు. అందుకే ఆమె ఆరోగ్య బాగోలేదని తెలిసి.. లాస్ ఎంజెల్స్‌ని తిరిగి వచ్చేశారు. ప్రేమ దూరమవుతుందని తెలిసినా.. నానమ్మ పక్కనే ఉన్నారు.
పెళ్లి చేసుకోవాలనుకున్నారు..
అయితే బ్రేకప్ తర్వాత అక్కడే ఆగిపోవాలనుకోలేదు రతన్ టాటా. చాలాసార్లు పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ.. కుదర్లేదని చెప్పేవారు. పనిలో బిజీగా ఉండడం వల్ల దానిపై ఫోకస్ చేసే సమయంలో దొరకలేదని చెప్పేవారు కానీ.. ఫ్యామిలీ లేకపోవడం వల్ల కొన్నిసార్లు ఒంటరిగా ఫీల్ అయ్యేవాడినని కూడా రతన్ టాటా తెలిపారు.
డేటింగ్ రూమర్స్..(Ratan Tata Dating Rumors)
పెళ్లి అయితే కాలేదు కానీ.. రతన్ టాటాపై పలు డేటింగ్ రూమర్స్ వచ్చేవి. ముఖ్యంగా సిమిగ్రేవాల్ అనే నటితో డేట్ చేశారనే వార్తలు అప్పట్లో వచ్చేవి. ఎందుకంటే సిమిగ్రేవాల్ రతన్ టాటాతో డేటింగ్ గురించి ఓపెన్‌గా చెప్పారు. కానీ రతన్ టాటా మాత్రం ఈ విషయంపై ఎప్పుడూ స్టేట్మెంట్ ఇవ్వలేదు.
ఆయనకు ఇష్టమైన పనులనే అలవాట్లుగా చేసుకున్నారు. కానీ ఎంత చేసినా చివరికి ఒంటరిగానే వెళ్లిపోయారు. ఆయన అనుకుని ఉంటే.. పెళ్లి ఏ వయసులోనైనా జరిగేది. కానీ రతన్ టాటాకు ఉన్న కొన్ని ఎథిక్స్ కూడా ఆయనను పెళ్లికి, ఫ్యామిలీ స్టార్ట్ చేయడానికి దూరం చేసి ఉండొచ్చు. ముఖ్యంగా చిన్నతనంలోనే పేరెంట్స్ డివోర్స్ అనే విషయం పిల్లలపై చెరగని ముద్ర వేస్తుంది. దాని ఎఫెక్ట్ కూడా రతన్ టాటాపై ఉండొచ్చు. కానీ ఏది ఏమైనా పర్సనల్ లైఫ్‌లో ఆయనకు ప్రేమ దక్కలేదు కానీ.. ప్రతి ఇండియన్ ఆయనని ప్రేమిస్తారు. ఆయనకి గౌరవిస్తారు. ఆయన సేవా దృక్పథంతో కొన్ని కోట్ల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు రతన్ టాటా.
Also Read : రతన్ టాటా కన్నుమూత, ముంబైలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన వ్యాపార దిగ్గజం