అన్నాచెలెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమకు ప్రతీక ‘రాఖీ పండుగ’. ఈ పండుగ రోజున అక్కలు, చెల్లెలు తమ అన్నదమ్ములకు రాఖీని కట్టి వారి మీద ఉన్న ప్రేమను తెలుపుతారు. రాఖీ అనేది ఒక రక్షా బంధనం. అక్కా చెలెళ్లను తాము కాపాడతామనే భరోసాను ఇస్తారు అన్నదమ్ములు. కేవలం ఒకే తల్లి కడుపున పుట్టిన అన్నా చెల్లెళ్లే కాదు, వరుసకు అన్నయ్యే అయ్యే వారికి రాఖీని కడతారు. పూర్వం ద్రౌపది, శ్రీ కృష్ణుడికి రాఖీ కట్టినట్టు చెబుతారు. అంతేకాదు శ్రీమహాలక్ష్మీ... బలి చక్రవర్తికి రాఖీ కట్టినట్టు అంటారు. రాఖీ పండుగకు ఎంతో ప్రాశస్య్తం ఉంది. ఈ రోజున అక్కా చెల్లెళ్లు తమ అన్నలకు ప్రేమ పూర్వకమైన సందేశాలను పంపిస్తారు.
1. నువ్వు లేకపోతే...
నా చిన్నతనం అంత ప్రత్యేకంగా ఉండేది కాదేమో
థాంక్యూ అన్నయ్య
రాఖీ పండుగ శుభాకాంక్షలు
2. అక్కాచెల్లెళ్ల కంటే మంచి స్నేహితులు అన్నదమ్ములకు ఉండరు.
అక్కా చెల్లెళ్లు ఉన్న అన్మదమ్ములందరికీ రక్షా బంధన్ శుభాకాంక్షలు
3. మనసున మమతని నిలుపుకున్న ప్రతి సోదరికి...
ఆ సోదరిని సర్వంగా భావించే ప్రతి సోదరునికి
రక్షా బంధన్ శుభాకాంక్షలు
4. చిరునవ్వుకు చిరునామా
మంచి మమతకు మారురూపం
ఆప్యాయతకు నిలువెత్తు రూపం అన్నాచెల్లెళ్ల అనుబంధం
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు
5. అమ్మలోని మొదటి అక్షరాన్ని
నాన్నలోని చివరి అక్షరాన్ని కలిపి
దేవుడు సృష్టించిన ప్రేమరూపమే అన్న
రాఖీ పండుగ శుభాకాంక్షలు
6. పోట్లటలు, అలకలు
బుజ్జగింపులు, ఊరడింపులు
ఎన్నాళ్లయినా, ఎన్నేళ్లయినా
చెరిగిపోని బంధం
అన్నాచెల్లెళ్ల అనుబంధం
రాఖీపండుగ శుభాకాంక్షలు
7. అన్ని సమయాల్లో నాతో కొట్లాడుతూ
అంతకుమించి ప్రేమను పండే సోదరిని
రాఖీ పండుగ శుభాకాంక్షలు
8. నీ చేతుల్లో పెరిగాను
నీ వెనుకే తిరిగాను
ఈ రక్షాబంధన్ సాక్షిగా దీవిస్తే సంతోషిస్తా
అన్నయ్యా నన్ను దీవించు
కలకాలం నన్ను ఇలాగే ప్రేమించు
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు
9. ప్రతి ఏడాది గడిచే కొద్దీ
దృఢంగా మారుతున్న పెరిగే ప్రేమ మనది.
నీ నుంచి రక్షణా బంధాన్ని కోరుకుంటూ
నీ చెల్లెలు
రాఖీ శుభాకాంక్షలు
10. కష్టాలు ఎదురైనా
నష్టాలు ఎదురైనా
కలిసి ఉండేలా చేసే మంత్రమే రక్షా బంధనం
ప్రేమను పంచే దీపమే రక్షాబంధనం
కాలం మారినా
దేశం దాటినా
చెరిగిపోని అనుబంధమే రక్షా బంధనం
11. ఒంటరితనం వేధిస్తున్నా
కష్టనష్టాుల జీవితాన్ని అతలా కుతలం చేస్తున్నా
సోదరి అనే ఒక తోడును ఇచ్చే
ప్రేమ బంధమే రక్షాబంధనం
హ్యాపీ రక్షా బంధన్
12. సమస్య ఎంత జఠిలమైనా
సమయమే పగ బట్టినా
సోదరుడున్నాడు అని తెలిపే
ధైర్య బంధమే రక్షా బంధనం
హ్యాపీ రక్షా బంధన్
13. వెల కట్టలేని బంధాలను
వదులుకోలేని అనుబంధాలను
గుర్తు చేసే మధుర బంధమే రక్షా బంధనం
హ్యాపీ రక్షా బంధన్
ఈ ఏడాది రాఖీ పండుగ ఆగస్టు 30న లేదా 31న చేసుకోవాలన్న సందేహం ఉంది. శ్రావణమాసం శుక్ల పక్షంలో పౌర్ణమి తిధి మొదలయ్యాక రాఖీ పౌర్ణమి వచ్చినట్టు. ఆగస్టు 30న ఉదయం 10:58 నిమిషాలకు పౌర్ణమి మొదలవుతుంది. మరుసటి రోజు ఉదయం 7:05 గంటలకు పౌర్ణమి ముగుస్తుంది. గురువారమే రాఖీ పండుగలను చేసుకోవాలని చెబుతున్నారు తెలుగు రాష్ట్రాల్లోని పండితులు. గురువారం సాయంత్రం అయిదున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు భద్ర కాలం. ఆ కాలంలో మాత్రం రాఖీ కట్టకూడదు.
Also read: పిల్లలకు చదివింది గుర్తుండాలంటే వారి జ్ఞాపకశక్తిని పెంచే ఈ ఆహారాలు ఇవ్వండి
Also read: ఇంట్లో ఈ మొక్కలుంటే దోమలు పరార్, వీటిని పెంచుకోవడం చాలా సులువు