Ennenno Janmala Bandham August 29th: వేద స్నానం చేసి రాగ వేద కోసం సాంబ్రాణి అన్ని సిద్ధం చేసి ఉంచుతాడు యష్. అప్పుడు వేద గతంలో జరిగిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని సంతోష పడుతూ ఉంటుంది వేద. ఆ తర్వాత యష్ వేద జుట్టుకి పొగ వేస్తూ ఉంటాడు. మరోవైపు ఖుషి తన జమ చేసిన డబ్బులు అన్ని లెక్కబెడుతూ ఉంటుంది. అప్పుడే వేద అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావ్ అని అడగటంతో డబ్బులు లెక్క పెడుతున్నాను అని అంటుంది ఖుషి.


మరీ ఇప్పుడేం అవసరం అనటంతో రాఖీ పండుగ కోసం అని.. తన అన్నయ్యకు రాఖీ కట్టడం కోసం రాఖీ కొనడానికి తీస్తున్నాను అని అంటుంది. నేను ఇవ్వకూడదా అనటంతో తన డబ్బుతో కొంటే ప్రౌడ్ గా ఉంటుందని అంటుంది. ఇక డబ్బు సరిపోకపోయేసరికి వేద నేను ఇస్తాను అంటుంది. మొదట వద్దని ఖుషి అనగా ఇక వేద చెప్పిన మాటలు విని డబ్బులు తీసుకోవడానికి ఓకే అంటుంది. ఆ తర్వాత ఇద్దరు బయటికి వెళ్లి రాఖీ కొంటుంటారు.


అదే సమయంలో అక్కడ అభి కారులో నుండి వేద ను చూస్తూ జరిగిన విషయాలు తలుచుకుంటాడు. ఇక వాళ్ళు రాఖి తీసుకుంటూ ఉండగా వేదకు ఫోన్ రావటంతో రోడ్డుపైకి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అభి కార్ వేగంగా తీసుకొస్తూ ఉండగా ఖుషి ఆ కారు రావడాన్ని చూసి వెంటనే పక్కకు లాగుతుంది. కారు వెళ్లిపోగా.. దాంతో వేద కంగారుపడుతూ ఉంటుంది. ఇక కారులో ఉన్న వాడిని తిడుతూ ఉంటుంది. ఇక వేద ఏదో అనుమానం పడినట్లు కనిపిస్తుంది.


యష్ వేద కోసం కంగారు పడుతూ ఉంటాడు. డాక్టర్ చెప్పిన మాటలు తలుచుకుంటూ ఉంటాడు. అక్కడే తన అత్తమామలు, తన తల్లి కూడా ఉంటారు. ఇక ఇంట్లో వాళ్ళు ఏం టెన్షన్ పడకు తను బయటికి వెళ్ళింది వస్తుంది అని చెబుతుంటారు. ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడుగుతుంటారు. ఇక మాలిని తన మనసులో.. తను ప్రెగ్నెంట్ కదా అందుకే టెన్షన్ పడుతున్నాడు అని అనుకుంటుంది.


అప్పుడే వేద రావటంతో వేదను కాసేపు చూసి.. ఎక్కడికి వెళ్ళావ్ అని అడగటంతో.. ఖుషి రాఖీ కొనుక్కోవాలి అంటే వెళ్ళాను అని అంటుంది. ఇక ఫోన్ ఎందుకు చేయలేదు అంటూ.. వెళ్ళేటప్పుడు ఎందుకు చెప్పలేదు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే వెంటనే మాలిని ఆపి యష్ పై అరిచి వేదను లోపలికి వెళ్ళమంటుంది. అప్పుడే వేద తండ్రి మీ పద్ధతి ఏం బాగోటం లేదు అని యష్ తో అంటాడు.


ఇక వేద బాధపడుతూ ఉంటుంది. యష్ దగ్గరకి వచ్చి సారీ చెప్పగా యష్ అవసరం లేదు అని అంటాడు. నిన్ను ఏదో అనాలని కాదు పరిస్థితి ఏంటో తెలుసు కదా.. ఇకనైనా జాగ్రత్తగా ఉండు అని అంటాడు. ఇక ఖుషి ఇదంతా తన వల్లే జరిగింది అని బాధపడుతుంది. ఆ తరువాత యష్ ఒంటరిగా ఉండగా అక్కడికి ఖుషి వచ్చి అమ్మ తప్పు లేదని తనే తీసుకెళ్లాను అని సారీ చెబుతుంది.


అంతేకాకుండా కారు ప్రమాదం గురించి చెప్పటమే కాకుండా ఆ ప్రమాదం చేసింది అభిమన్యు అని చెబుతుంది. దాంతో యష్ షాక్ అవుతాడు. అంటే ఇప్పుడు వాడు వేదను టార్గెట్ చేస్తున్నాడు అని అనుకుంటాడు యష్. వాడు కచ్చితంగా అభిమన్యునేనా అని పాపను అడుగుతాడు. దాంతో పాప ఖచ్చితంగా అతడే అని చెబుతుంది.


ఇక ఖుషిని లోపలికి పంపించి వెంటనే కారులో అభి దగ్గరికి వచ్చి కాలర్ పట్టుకుని ఫైర్ అవుతాడు. జైలుకించి వచ్చావో లేదో మళ్లీ స్టార్ట్ చేసావా అని అనటంతో అవి తనకు పెద్ద ఇష్యూస్ ఏమీ కాదు అని పొగరుగా అంటాడు. వేద ను కారుతో యాక్సిడెంట్ చేయడానికి ప్రయత్నించావని నా కూతురు చెప్పింది అనటంతో.. నేనా అని తెలియనట్టు ప్రవర్తిస్తూ మాట్లాడుతాడు.


దాంతో యష్ తనపై ఫైర్ అవుతూ.. మళ్లీ కానీ తన జోలికి తన కడుపులో ఉన్న బిడ్డ జోలికి వస్తే విడిచి పెట్టేది లేదు అని వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్తాడు.  ఇక అభి పొగరుగా నా శత్రువుల లీస్టులో పుట్టబోయే బిడ్డ కూడా ఉంది అని అనుకుంటాడు. తరువాయి భాగంలో ఖుషి తన అన్నయ్యకు రాఖీ కడుతుంది. ఇంకో రాఖీ తీసి నా బుజ్జి తమ్ముడికి అంటూ వేద కడుపుకి కడుతుంది.


 


also read it : Brahmamudi August 28th: సహనంతో ఇంట్లో ఉంటానంటూ రుద్రాణికి మాటిచ్చిన కావ్య.. ఫేక్ ప్రెగ్నెన్సీ కోసం తిప్పలు పడుతున్న స్వప్న?


 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial