Prema Entha Madhuram August 29th: స్కూల్లో వేదిక మీద అందరికీ బహుమతి అందించిన తర్వాత ఆర్య పిల్లలకు కొన్ని విలువైన మాటలు చెబుతాడు. చదువు గురించి కూడా గొప్పగా చెబుతాడు. గౌరవంగా ఉండాలి అని అందరు గర్వించే విధంగా గొప్పగా జీవించాలి అని చెబుతాడు. ఇక వేడుక ముగిసిన తర్వాత పిల్లలిద్దరూ అను దగ్గరికి వెళ్లి తమకు వచ్చిన ప్రైజ్, మెడల్ తల్లి మెడలో వేయటంతో అను వారిని పట్టుకుని మురిసిపోతుంది.


అప్పుడే వెనకాల నుంచి ఆర్య వస్తుండటంతో అక్షర ఆర్య ని చూసి చెయ్యి ఊపుతుంది. కానీ ఆర్య, అను ఒకరి ముఖం ఒకరు చేసుకోలేరు. ఆ తర్వాత అను పిల్లలను తీసుకొని వారి బ్యాగులు తేవడానికి అని వెళ్తుండగా అదే సమయంలో ఆర్య కూడా స్కూల్ అవసరాల గురించి అటువైపు వస్తూ ఉంటాడు. వెంటనే ఆర్యను చూసి అను కంగారుపడి ఒక దగ్గర నిలబడి ఆర్య వెళ్లాక ఊపిరి పీల్చుకుంటుంది.


మరోవైపు ఆర్య స్కూల్ కు ఏమేం కావాలో అన్ని డీటెయిల్స్ తెలుసుకోమని జిండే కి చెబుతాడు. అదే సమయంలో ఛాయా, ఎమ్మెల్యే, మాన్సీ అదే స్కూల్ కి వచ్చి స్కూల్ చుట్టూ ఉన్న ల్యాండ్ గురించి మాట్లాడుతారు. ఇక ప్రిన్సిపల్ స్కూల్ ఎక్స్టెన్షన్ గురించి ఆర్యనే చూసుకుంటాడు ఆయన కూడా ఇక్కడే ఉన్నాడు. అందుకే మిమ్మల్ని పిలిచాను అంటే మా కంటే ముందే ఆర్య ఇక్కడికి వచ్చాడా అని ఛాయాదేవి పొగరుగా అడుగుతుంది.


దానితో స్కూల్ కాంపిటీషన్ గురించి చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించామని చెబుతాడు. ఇక ఆర్య ను పిలవడానికి ఆ ప్రిన్సిపల్ బయటకు వెళ్లగా.. ఆర్య తమను ఇక్కడ చూస్తే చూస్తే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది.. స్కూల్ కి ఇచ్చిన మాట తప్పలేడు.. నా నుంచి ల్యాండ్ తీసుకోలేడు.. ఏం జరుగుతుందో చూద్దాం అని ఛాయాదేవి మాన్సీతో అంటుంది.


ఇక ఆ తర్వాత ఆర్యకు మీడియా వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేస్తూ ఉండగా అప్పుడే అభయ్ వచ్చి ఆపి అది నా క్లాస్ అంటూ.. మీరు ఇక్కడ ఇంటర్వ్యూ తీసుకోవడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు అంటూ పెద్ద పెద్ద ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. దాంతో ఆర్య ఒక పది నిమిషాలు అని చెప్పి ఇంటర్వ్యూ ఇస్తాడు. ఇక మీడియా వ్యక్తి అడిగిన ప్రశ్నలకు ఆర్య సమాధానాలు ఇస్తూ ఉండటంతో అభయ్ ఆ మాటలు వింటూ ఉంటాడు.


ఆ తర్వాత ఆర్య అభయ్ ను పిలిచి మాట్లాడుతూ ఉండగా అప్పుడే ప్రిన్సిపాల్ వచ్చి ఎమ్మెల్యే వచ్చాడు అని చెప్పటంతో ఆర్య అక్కడి నుంచి వెళ్తాడు. ఇక ఆర్య అక్కడికి వెళ్ళగానే వాళ్ళని చూసి ఆగిపోతాడు. అంతేకాకుండా ఛాయాదేవితో మాన్సీ చేతులు కలిపిందని తెలుసుకుంటాడు. ఇక ఆర్య అక్కడికి వెళ్లి కూర్చోగా ఎమ్మెల్యే స్కూల్ చుట్టూ పక్కనే ఉన్న స్థలం ఛాయాదేవిదని చెబుతాడు. ఇక ప్రిన్సిపాల్ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని ఛాయాదేవిని అడగటంతో..  అంటే మీరే మాట్లాడతాడా ఆర్య మాట్లాడలేడా అని ప్రశ్నిస్తుంది.


వెంటనే ఆర్య కూడా ఈ స్కూల్ కు కావలసిన పరిసరాల కోసం ల్యాండ్ అవసరం.. మీరు ఎంతకు అమ్మాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా అని ప్రశ్నిస్తాడు. దాంతో దొరికిందే ఛాన్స్ అని ఛాయాదేవి.. ల్యాండ్ అమ్మడానికి నేను రాలేదు అని అనటంతో అక్కడున్న ఎమ్మెల్యే ప్రిన్సిపాల్ కూడా షాక్ అవుతారు. వెంటనే జిండే కూడా మీరు ఇక్కడికి వచ్చాకే అర్థం అయింది అని కాస్త వెటకారం చేసి సమాధానం ఇస్తాడు.


దాంతో మాన్సీ ఎదురుపడి మాట్లాడటంతో వెంటనే ఆర్య తన వైపు చూడటంతో దెబ్బకు మాన్సీ భయపడి నోరు మూస్తుంది. ఛాయ మాత్రం ఆ ల్యాండ్ అమ్మను అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటుంది. దాంతో ఆర్య ఎంత కావాలో చెప్పు అని అనటంతో.. వెంటనే ఛాయా ఆ స్థలం అమ్మను అంటూ గట్టిగా చెప్పేస్తుంది. అంతేకాకుండా స్కూల్ ఉన్న ల్యాండ్ కూడా తనదని చెబుతుంది.


also read it : Ennenno Janmala Bandham August 28th: యష్, వేద అంతు చూడటానికి సిద్ధమైన అభి.. బయటపడిన వసంత్ నిజ స్వరూపం?


 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial