న్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో అస్వస్థతకు గురైన సమాచారం విని సినీ పరిశ్రమ షాకైంది. ఆయన తన నివాసంలోని జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా పునీత్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. పునీత్ వయస్సు 46 ఏళ్లు మాత్రమే. ఆయనకు గతంలో గుండె నొప్పి వచ్చిన సందర్భాలు కూడా లేవు. గతంలో మరో కన్నడ నటుడు చిరంజీవి సర్జా కూడా గుండె నొప్పితోనే చనిపోయాడు. 35 ఏళ్లలోనే అతడికి గుండె నొప్పి రావడం ఏమిటీ? అని చాలామంది ఆశ్చర్యపోయారు. మరి చిన్నవయస్సులోనే గుండె పోటు ఎందుకు వస్తుంది? అతిగా కసరత్తులు చేస్తే గుండె ఆగిపోయే ప్రమాదం ఉందా? పునీత్‌ విషయంలో ఏమైంది? జిమ్‌లో వ్యాయామం చేస్తూ ఎందుకు కుప్పకూలాడు?


వైద్య నిపుణుల సమాచారం ప్రకారం.. పునీత్‌కు వచ్చినది హార్ట్‌ఎటాక్ కాదని, కార్డియాక్ అరెస్ట్ అని తెలిపారు. గతంలో గుండె సంబంధిత సమస్యలేవీ లేకపోయినా.. కార్డియక్ అరెస్ట్ వల్ల చనిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. పునీత్ అతిగా వ్యాయమం చేయడం వల్ల శరీరం అదుపుతప్పి ఉంటుందని, గుండె లయ తప్పడంతో కుప్పకూలి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. గుండె నొప్పి రెండు రకాలుగా ఏర్పడుతుంది. ఇది వచ్చేందుకు గుండె జబ్బు ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి మనం చేసే పనుల వల్ల కూడా గుండె నొప్పికి గురికావచ్చు. ఏదైనా కారణం చేత గుండెకు రక్త ప్రవాహం నిలిచిపోతే.. గుండె పనిచేయడం నిలిచిపోతుంది.


హార్ట్ ఎటాక్‌కు కారణం ఇదే: మన గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో ఏదైనా అంతరాయం ఏర్పడితే కలిగే సమస్యే హార్ట్ ఎటాక్. దీన్ని కొన్ని లక్షణాల ద్వారా గుర్తుపట్టవచ్చు. గుండెలోని ధమనుల్లో బ్లడ్ క్లాట్స్ ఏర్పడినప్పుడు లేదా కొవ్వు పేర్కొన్నప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. దీనివల్ల గుండెకు రక్తం సరఫరా కాదు. ఫలితంగా వ్యక్తి చనిపోయే ప్రమాదం ఉంది. ఛాతి నొప్పి ఎక్కువ సేపు ఉన్నా.. శరీర భాగాలు అసౌకర్యంగా అనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్యంగా గుండె వైపు భాగాలు లేదా ఎడమ చేయి లాగుతున్నా.. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం, చల్లని చెమటలు పట్టినా అప్రమత్తం కావాలి. కొందరిలో తలనొప్పి, వికారం కూడా లక్షణాలు కూడా కనిపిస్తాయి.  


Also Read: పునీత్‌ రాజ్‌కుమార్‌.. మన టాలీవుడ్‌కు దగ్గర బంధువు ఎలా అయ్యారు?


కార్డియక్ అరెస్ట్ ఎందుకు?: గుండెలో ఏర్పడే ఎలక్ట్రానిక్ సమస్య వల్ల కార్డియక్ అరెస్ట్ అవుతుంది. అయితే, కార్డియక్ అరెస్ట్‌ను ముందుగా గుర్తించలేం. గుండెలో ఏర్పడే ఎలక్ట్రికల్ అలజడి వల్ల గుండె లయ తప్పుతుంది. దీంతో రక్త ప్రసరణకు అంతరాయం కలుగుతుంది. ఫలితంగా గుండెతోపాటు శరీరంలోని ఇతర భాగాలకు రక్త ప్రసరణ నిలిచిపోతుంది. దీనివల్ల బాధితుడు క్షణాల్లో కుప్పకూలతాడు. ఆ సమయంలో వెంటనే సీపీఆర్ ఇవ్వడం ద్వారా మళ్లీ ప్రాణం పోయవచ్చు. అయితే, పైన జరిగిన ఘటనలో అది సాధ్యం కాలేదు. వెంటనే అతడికి సీపీఆర్ చేసి ఉంటే బతికే అవకాశాలుండేవి. 


Also Read: ఇండియాలోని ఈ గ్రామంలో మహిళలు 5 రోజులు నగ్నంగా ఉంటారు.. వారిని చూసి నవ్వితే..


Also Read: భూటాన్‌లో ఇళ్లపై అశ్లీల చిత్రాలు ఎందుకుంటాయ్? ప్రజలు అంత హ్యాపీగా ఎలా జీవిస్తున్నారు?



Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..


Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి