Health News in Telugu: చాలామందికి ముక్కులో వేలు పెట్టుకుని క్లిన్ చేసుకొనే అలవాటు ఉంటుంది. కొందరు ముక్కులో డ్రైగా ఉండే పక్కులు తీసే అలవాటు ఉంటుంది. అయితే, ఆ పనిని అదేపనిగా చేస్తుంటే.. భవిష్యత్తులో రోగాలు వెంటాడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


గ్రిఫిత్ యూనివర్సిటికి చెందిన పరిశోధకులు ఎలుకల మీద నిర్వహించిన ఈ అధ్యయనంలో మెదడును దెబ్బతీసే అల్జీమర్స్ ముక్కులో పక్కులు తియ్యడానికి సంబంధం ఉందని చెబుతున్నారు. ఈ చర్య మెదడులో ప్రొటీన్లను అదనంగా నిర్మించడానికి కారణమవుతోందని తెలిపారు.


తరచుగా ముక్కులో వేలు పెట్టి తిప్పడం వల్ల ముక్కులో అంతర్గత కణజాలం దెబ్బతింటుందని, ఫలితంగా ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఒకటి మెదడును చేరడం సులభం అవుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ బ్యాక్టీరియా వల్ల మెదడులో అల్జీమర్ కలిగించే పరిస్థితులు ఏర్పడతాయి. నెమ్మదిగా అది మెదడు జ్ఞాపకశక్తిని ప్రభావితం చేసి మతిమరుపుకు కారణం అవుతుందట.


ఆస్ట్రేలియాలోని క్వీన్ లాండ్ లోని పరిశోధకుల బృందం క్లామిడియా న్యూమోనియా అనే బ్యాక్టీరియాపై పలు పరీక్షలు నిర్వహించారు. ఈ బ్యాక్టీరియా అనేక శ్వాస సంబంధ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని తేల్చారు. వృద్ధాప్యంలో మతిమరుపుకు గురవుతున్న వ్యక్తుల మెదడులో కూడా ఈ బ్యాక్టీరియా కనిపించిందట. 1999లో జరిపిన పరిశోధనలో 19 అల్జీమర్స్ మెదడు నమూనాలు పరిశీలించినపుడు 17 నమూనాల్లో ఇది కనిపించిందట.


కనుక అల్జీమర్స్‌కు ఈ బ్యాక్టీరియాతో సంబంధం ఉన్నట్టుగా పరిశోధకులు భావిస్తున్నారు. గ్రిఫిత్ యూనివిర్సిటి పరిశోధకులు క్లామిడియా న్యుమోనియా బ్యాక్టీరియా.. నాసికా కుహరం నుంచి మెదడుకు మధ్య విస్తరించి ఉన్నమార్గాన్ని కేంద్ర నాడీ వ్యవస్థ మీద దాడిచేసే మార్గంగా ఉపయోగిస్తోందని కనుగొన్నారు.


నోస్ ఎపీథీలియం అనే ముక్కులోపలి లైనింగ్ పలుచని కణజాలానికి నష్టం జరిగినపుడు ఈ నాడీ ఇన్ఫెక్షన్ మరింత తీవ్రంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న మరో అధ్యయనకారుడు క్లెమ్ జోన్స్  క్లామిడియా మాట్లాడుతూ.. న్యుమోనియా నేరుగా ముక్కు నుంచి మెదడులోకి చేరగలదని తేలిందన్నారు. పరీక్షల్లో మెదడులో అల్జీమర్స్ ను పోలిన మార్పులు కనిపించాయని చెప్పారు.


ఎలుకలపై జరిపిన పరిశోధనలోనే ఇది తేలింది. కానీ మనుషుల్లో ఇది మరింత భయంకరంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, దీనిపై మరింత లోతైన పరిశోధన సాగాల్సి ఉందన్నారు. ఇదే పరిశోధన మానవులలో చేసినపుడు అదే నాడీ మార్గం ద్వారా సంక్రమణ జరుగుతోందా.. లేదా అనేది నిర్ధారణ కావలసి ఉందని మరి కొంత మంది అభిప్రాయపడుతున్నారు. పెరిగిన అమిలాయిడ్ ప్రొటీన్ నిరోధక వ్యవస్థ ప్రతిస్పందన వల్ల కూడా ఈ సమస్య రావచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనా నాసికా ఎపిథీలియం సున్నితంగా ఉంటుంది. కనుక దానికి నష్టం కలిగించే పనులు చెయ్యకుండా ఉండడం అన్నింటి కంటే ముఖ్యమని ఈ పరిశోధన ఫలితాలు తెలుపుతున్నాయి.


Also read : Muscle Cramps : పనిచేస్తుంటే కండరాలు పట్టేశాయా? అయితే ఈ రిలీఫ్ టెక్నిక్స్ మీకోసమే..


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.