Daily Horoscope Today December 15th, 2023


మేష రాశి (Aries Horoscope Today) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)


ఈ రోజు మీకు ఆర్థిక లాభం చేకూరుతుంది. మీరు కొత్త ఉద్యోగం లేదా వ్యాపార అవకాశాన్ని పొందవచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కొత్తగా ప్రారంభించే పనిలో విజయం సాధిస్తారు. 


వృషభ రాశి (Taurus  Horoscope Today) (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)


ఈ రోజు మీరు మీ కుటుంబానికి సమయం కేటాయిస్తారు. వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. 


మిథున రాశి (Gemini Horoscope Today) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)


ఈ రోజు మీ పనిలో పురోగతి ఉంది. ముఖ్యమైన విషయాల్లో వ్యాహాత్మకంగా వ్యవహరిస్తారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టడం కన్నా ఉన్న వ్యాపారంపై దృష్టి సారించడం మంచిది. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి.


కర్కాటక రాశి (Cancer Horoscope Today)  (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)


ఈ రోజు మీరు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో సంతోషం వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థి బాగానే ఉంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. 


సింహ రాశి (Leo Horoscope Today)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)


ఈ రోజు మీరు కొత్త పనులు మరియు ప్రాజెక్ట్‌లను ప్రారంభించడానికి సమయం పట్టొచ్చు.  మీరు మీ లక్ష్యాల వైపు కదులుతూ ఉండాలి. ఉద్యోగులు పని విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారం బాగానే సాగుతుంది.


కన్యా రాశి  (Virgo Horoscope Today) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు) 


ఈ రోజు మీకు డబ్బు మరియు ఆరోగ్యం పరంగా ఆహ్లాదకరమైన సమయం. మీరు కొత్త ప్రాజెక్ట్ లేదా వ్యూహాత్మక పని కోసం అవకాశం పొందవచ్చు .కుటుంబానికి సమయం కేటాయిస్తారు.


తులా రాశి (Libra Horoscope Today) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)


ఈ రోజు ఈ రాశి వ్యాపారులు లాభాలు సాధిస్తారు. నూతన ప్రణాళికలు అమలు చేసేందుకు ఇదే మంచి సమయం. ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. 


వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) (విశాఖ 4 వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)


ఈ రోజు  ఈ రాశి ప్రేమికులకు కలిసొచ్చే సమయం. వివాహితులు బంధాన్ని బలపర్చుకునేందుకు సమయం ఇవ్వాలి. ఆరోగ్యాన్ని, ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. 


ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) 


ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. ఉద్యోగులు పై అధికారులతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తారు. వ్యాపారం పుంజుకుంటుంది. కొత్త పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు.


మకర రాశి (Capricorn Horoscope Today) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)


ఈ రోజు మీకు ఆర్థిక పరంగా కలిసొచ్చే సమయం. రోజంతా సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.  వృత్తి పరంగా ఆహ్లాదకరమైన సమయం . మీరు కొత్త ఉద్యోగం లేదా ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు.


కుంభ రాశి  (Aquarius Horoscope Today) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


ఈ రాశివారు ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగేయండి. నూతన పెట్టుపబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించాలి. వ్యాపారం బాగానే సాగుతుంది. కొత్త ప్రాజెక్టులలో అవకాశం పొందుతారు. 


మీన రాశి (Pisces Horoscope Today) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


ఈ రాశి ఉద్యోగులకు కలిసొచ్చే సమయం. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. అవసరానికి డబ్బు చేతికందుతుంది. నూతన ప్రణాళికలు అమలు ఇంకొన్నాళ్లు వాయిదా వేయడం మంచిది. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది.