పీరియడ్స్... స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యాన్ని సూచించే సంకేతం. ఇవి ఆలస్యమైనా, అధికస్రావమైన ఏదో సమస్య ఉన్నట్టు అర్థం. కొంతమందిలో ఎప్పుడూ పీరియడ్స్ ఆలస్యమవుతుంటాయి. ఆలస్యమైతే ప్రెగ్నెన్సీ వచ్చిందేమో అని అనుమానించేవాళ్లు ఉంటారు. నిజానికి ప్రెగ్నెన్సీ లేకపోయినా పీరియడ్స్ ఆలస్యమవుతున్న స్త్రీలు అధికంగానే ఉన్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒత్తిడి, హార్మోన్లలో అసమతుల్యత, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) వంటివి కారణాలు కావచ్చు. ఇలా పీరియడ్స్ సమయానికి రాకపోవడం కొన్ని నెలల పాటూ కొనసాగితే వైద్యులను కలిసి మందులు మింగడం చేస్తుంటారు. పీరియడ్స్ సమయానికి వచ్చేలా చేయడానికి ఆయుర్వేదంలో సింపుల్ చిట్కాలు ఉన్నాయి. వాటి ద్వారా ఎలాంటి మందులు మింగాల్సిన అవసరం లేకుండానే పీరియడ్స్ టైమ్ కి వచ్చేలా చేసుకోవచ్చని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.
ఇలా చేయాలి
ఆయుర్వేదంలో పీరియడ్స్ కాలగతి తప్పడాన్ని అనర్తవ అంటారు.ఆరోగ్యకరమైన ఆహారం తిరిగి రుతుచక్రాన్ని క్రమబద్ధీకరిస్తుందని చెబుతుంది ఆయుర్వేదం. శుద్ధి చేసిన చక్కెరలు, అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలని చెబుతోంది ఆయుర్వేదం. వెల్లుల్లి, అల్లం, జీలకర్ర, ధనియాలు, వాము, నల్లనువ్వులు, మెంతులు, నల్ల మిరియాలు, పసుపు వంటి ఆహారాలు తప్పనిసరిగా ఆహారంలో తీసుకోవాలి. పీరియడ్స్ తేదీకి వారం రోజుల ముందు నుంచి కొన్ని రకాల ఆహారాలను తినడం ప్రారంభించాలి.
1. నల్లనువ్వులను బెల్లంతో కలిపి లడ్డూలా చేసుకుని తినాలి. ఇది హార్మోన్ల అసమతుల్యతను పరిష్కరిస్తుంది.
2. ఒక గ్లాసు నీటిలో రెండు టీస్పూన్ల సోపు గింజలను కలిపి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం లేచి ఆ నీటిని తాగేయాలి.
3. పైనాపిల్స్ లేదా బొప్పాయిలను తరచుగా తినాలి.
4. హెర్బల్ నూనెలను, ధర్వంతరం తైలాన్ని తలకు పట్టించాలి. ఇవి ఒత్తిడిని పారద్రోలతాయి. ఒత్తిడి వల్లే మీ పీరియడ్స్ ఆలస్యమవుతుంటే ఆ సమస్య తీరిపోతుంది.
5. ఆస్పరాగస్ పొడిని పాలల్లో కలిపి తాగుతూ ఉండాలి. ఇది స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థకు శక్తివంతమైన టానిక్ లా పనిచేస్తుంది. దీన్ని పాలు, తేనె, పంచదారతో కలిపి తీసుకోవచ్చు.
6. కలబంద కూడా పీరియడ్స్ ను నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఒక ఆకును కత్తిరించి, దానిలోంచి జెల్ ను తీసి ఒక టీస్పేను తేనెతో కలిపి తినాలి. ఈ మిశ్రమాన్ని ఖాళీ పొట్టతో తీసుకుంటే మరింత ప్రయోజనంగా ఉంటుంది.
Also read: ఐస్‌క్రీము తలనొప్పి గురించి తెలుసా? ఎంతో మందికి ఉన్న సమస్యా ఇది