సముద్రం ఓ పెద్ద ప్రపంచం. భూమ్మీద ఉన్న జీవుల సంఖ్య కన్నా సముద్రంలో ఉండే జీవుల సంఖ్య మూడు రెట్లు అధికం. అందుకే సంద్రంపై నిత్యం పరిశోధనలు సాగుతూనే ఉంటాయి.ఎన్నో వింతైన సముద్ర జీవులు మెరైన్ శాస్త్రవేత్తల పరిశోధనలో బయటపడుతూనే ఉంటాయి. కానీ ఇప్పటివరకు దొరకనిది సాగరకన్య, అదేనంటి మత్స్యకన్య. నడుము వరకు రూపం మనిషిలా, ఆ కింద నుంచి చేపలా ఉండడమే దీని ప్రత్యేకత. దీన్ని ఒక కల్పిత పాత్రగానే భావిస్తారు చాలా మంది. అయితే ఇప్పుడు ఒక మమ్మీని చూస్తే మాత్రం అలాంటి జీవులు ఉండేవన్న అనుమానం కలుగుతుంది.
మత్య్సకన్య మమ్మీ ఇది...
1736 నుంచి 1741 మధ్యలో జపాన్లోని పసిఫిక్ సముద్ర ప్రాంతంలో ఒక సాగరకన్యలాంటి జీవి దొరికింది. అది మరణించడంతో ప్రజలు మమ్మీ రూపంలో భద్రపరిచారు. దాని వయసు ఇప్పుడు 300 ఏళ్లు. అది మొదట్లో ఒక కుటుంబం వద్ద ఉండేదని, వారు చనిపోయాక చేతులు మారుతూ వచ్చిందని చెబుతున్నారు. ప్రస్తుతం జపాన్లోని ఓ నగరంలో ఉన్న ఆలయంలో ఉంది. దాన్ని భద్రపరిచిన పెట్టెలో ఒక ఉత్తరం కూడా ఉంది. దాని ప్రకారం ఈ సాగరకన్య చేపలు పట్టే వలలో పడిందని రాసి ఉంది. ఆ మమ్మీని జపాన్ పరిశోధకులు స్వాధీనం చేసుకున్నారు.
మమ్మీ ఎలా ఉందంటే...
మత్స్యకన్య మమ్మీ చూసేందుకు చాలా భయంకరంగా ఉంది. పదునైన దంతాలు, ముఖం, రెండు చేతులు, నుదుటిపై పడుతున్న వెంట్రుకలతో ఉంది. ఎగువ భాగంలో మనిషిలా, దిగువ భాగంలో చేపలా ఉంది. దీన్ని పరిశోధించాక ఇది నిజంగానే సాగరకన్యా కాదా అనే విషయాన్ని తేలుస్తారు పరిశోధకులు.
జపాన్లో ఎన్నో కథలు
జపాన్ దేశంలో సాగరకన్యలపై ఎన్న కథలు వాడుకలో ఉన్నాయి. ఒకప్పుడు అవి సముద్రంలో విరివిగా దొరికేవాని వాటిని తింటే 800 ఏళ్లు బతుకుతారని చెప్పుకుంటారు. మత్య్సకన్య మమ్మీల పొలుసును చెవిలో పెట్టుకుంటే అవి రాబోయే అంటు వ్యాధులను కూడా అంచనా వేస్తాయని కూడా జపాన్ పురాణాల్లో ఉంది.
Also read: మీకు రోజూ బీరు తాగే అలవాటుందా? అయితే మీ మెదడు త్వరగా ముసలిదైపోతుంది
Also read: తిన్న వెంటనే చల్లని నీళ్లు తాగుతున్నారా? ఈ ఆరోగ్యసమస్యలు తప్పవు మరి