చాలా మంది బిర్యానీతో కూల్ కూల్ వాటర్ తాగుతారు లేదా చల్లని కూల్ డ్రింకులు తాగుతారు. స్పైసీ ఫుడ్ తింటున్నప్పుడు చల్లని కూల్ డ్రింక్స్, నీరు, ఐస్ క్రీయులు తింటే ఉపశమనంగా ఉంటుంది. నాలుకకు సంతృప్తిగానూ ఉంటుంది. అందుకే చాలా మంది భోజనం చేసిన వెంటనే చల్లని పానీయాలు తాగుతుంటారు. కానీ ఇలా చేయడం ప్రమాదకరం. కొన్ని రకాల ఆరోగ్యసమస్యలు దాడి చేసే అవకాశం ఉంది. 


బెల్లీ ఫ్యాట్
భోజనం చేశాక చల్లని నీరు తాగితే శరీరంలో కొవ్వు పదార్థాలు అధికంగా నిల్వ అవుతాయి. చల్లని నీళ్ల వల్ల పొట్టలోని కొవ్వులు వేడెక్కి, జీర్ణం కావడం కష్టమవుతుంది. పొట్టదగ్గరే కొవ్వులు పేరుకుపోయి బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతుంది. అంటే బొజ్జ  వచ్చేస్తుందన్నమాట. 


అజీర్తి
చల్లని నీరు జీర్ణక్రియకు అడ్డు పడుతుంది. చల్లటినీళ్లతో కలిపి ఆహారంలోని కొవ్వు గట్టిపడుతుంది,జీర్ణం కాదు. దానివల్ల అజీర్తి సమస్యలు మొదలవుతాయి. 


తలతిరుగుతుంది
మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గినప్పుడు తల తిరుగుతున్నట్టు అవుతుంది. చల్లని నీరు శరీరం జీవక్రియను చెడగొడుతుంది. దీని వల్ల శరీర ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పు కలుగుతుంది. అవయవాలకు ఆక్సిజన్ సరిగా అందనివ్వదు. 


మెదడు పనితీరుపై ప్రభావం
 చల్లని నీరు మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. క్రియలను స్తంభింపజేస్తుంది. మైకం వచ్చేలా చేస్తుంది. అందుకే చల్లని నీరు తాగాక చురుకుగా అనిపించదు. 


హార్ట్ బీట్‌లో తేడా
హృదయ స్పందనల్లో తేడా వచ్చేలా చేస్తుంది చల్లటినీరు. గుండె నరాల పనితీరును దెబ్బతీస్తుంది. స్థిరమైన హర్ట్ బీట్ లను మారిపోయేలా చేస్తుంది. 


దాహాన్ని పెంచేస్తుంది
చల్లటి నీరు తాగడం వల్ల దాహం తీరదు, సరికదా ఇంకా పెరిగిపోతుంది. గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీరు మాత్రమే దాహాన్ని తీరుస్తుంది. హెవీ వర్కవుట్స్ చేశాక చల్లని నీళ్లు తాగకూడదు, సాధారణ నీటినే తాగాలి. 


అంతేకాదు తిన్న ఆహారంలోని పోషకాలేవి శరీరానికి సక్రమంగా చేరకుండా చేస్తుంది కూల్ వాటర్. కాబట్టి చల్లని నీళ్లను అన్నం తిన్నాక తాగకూడదు.


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.


Also read: న్యూజనరేషన్ ప్లేట్, తినే కంచంలో ఫోనుకీ స్థానం


Also read: పిల్లల్ని కనేందుకు సరైన వయసు ఏది? ఏ వయసులో కంటే పిల్లల్లో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది?