అత్యవసరవస్తువుల్లో ఇప్పుడు సెల్ ఫోన్ భాగమైపోయింది. ఎంతగా అది జనాల జీవితాల్లో కలిసిపోయిందంటే కళ్లు తెరవగానే చూసేది ఫోనునే, నిద్రపోయేముందు చివరగా చూసేది ఫోనునే. సరదా కబుర్లు దగ్గర నుంచి ఆఫీసు విషయాల వరకు అన్నీ పనులను ఫోన్లో చక్కబెట్టేసుకోవచ్చు. అందుకే ఫోన్ లేనిదే ఒక్కగంట కూడా గడవని పరిస్థితి ఎంతో మందిది. అందుకే ఫోన్ పై మీమ్స్ అధికంగా వస్తున్నాయి. అంతేకాదు తినే ప్లేటులో కూడా ఫోనుకి స్థానం ఇచ్చేసింది ఓ రెస్టారెంట్. ఎక్కడో తెలియదు కానీ ఓ ఫోటో మాత్రం ఫేస్ బుక్ తెగ తిరుగుతోంది. ప్లేటులో కూర, పచ్చడి, స్వీటు, చపాతీ పెట్టేందుకు ప్రత్యేక స్థానం ఉన్నట్టే సెల్ ఫోను కూడా చక్కటి భాగం ఒకటి. ఉంది అందులో ఫోన్ పెట్టుకుని చూస్తూ తినొచ్చు.