Two Woman Dies With Cat Bite in Krishna district: కుక్క కాటుకు గురై మనుషులకు పిచ్చి పట్టడం గానీ, కొంత కాలానికి చనిపోవడం వింటుంటాం. కానీ పిల్లి కరవడంతో మహిళలు చనిపోవడం కలకలం రేపుతోంది. కృష్ణా జిల్లా మొవ్వ మండలం వేములమడలో ఈ విషాదం చోటుచేసుకుంది. అయితే పిల్లి కరిచిన తరువాత జాగ్రత్తలు తీసుకున్నా ఎందుకిలా జరిగిందని స్థానికంగానూ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
పిల్లి కాటుకు గురైన ఇద్దరు మహిళలకు రేబిస్ వ్యాధి సోకడంతో ఇద్దరూ మృత్యువాతపడిన ఘటన కృష్ణా జిల్లా మొవ్వ మండలం వేములమడలో చోటుచేసుకుంది.
కృష్ణా జిల్లాలోని మొవ్వ మండలం వేములమడ ఎస్సీ కాలనీలో రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్ సాలి భాగ్యారావు తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆయన భార్య కమల (64)కు దాదాపు రెండు నెలల కిందట పిల్లి కరిచింది. అదే కాలనీలో ఆర్ఎంపీ డాక్టర్ బాబూరావు ఫ్యామిలీ నివాసం ఉంటోంది.
కొన్ని రోజుల కిందట ఆర్ఎంపీ డాక్టర్ బాబూరావు భార్య నాగమణి సైతం పిల్లి కాటుకు గురయ్యారు. పిల్లి కరవడంతో కమల, నాగమణి వేర్వేరుగానే ఎలాంటి ఇన్‌ఫెక్షన్ అవ్వకుండా ఉండాలని టీటీ ఇంజెక్షన్ చేయించుకున్నారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుని మందులు వాడారు. గత వారం వరకు వారిద్దరూ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. కమల, నాగమణి నాలుగు రోజుల కిందట అస్వస్థతకు గురయ్యారు. ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లి మెరుగైన చికిత్స తీసుకున్నారు. అయినా ప్రయోజనం ప్రయోజనం లేకపోయింది.
అసలు విషయం ఇదే..
గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి కమల చనిపోయింది. తొలుత మొవ్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం చేయించుకున్న నాగమణి, ఆపై వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. ఆమె సైతం చికిత్స పొందుతూ శనివారం కన్నుమూసింది. రేబిస్ వ్యాధి సోకడంతో ఇద్దరు మహిళలు చనిపోయారని డాక్టర్ శొంఠి శివరామకృష్ణారావు చెప్పారు. పిల్లి కాటు గురైన మొదట్లోనే సకాలంలో మెరుగైన వైద్య సేవలు తీసుకోకపోవడంతో ప్రాణ నష్టం సంభవించిందన్నారు. వీరిని కరిచిన పిల్లిని ఓ కుక్క కురవగా, ఆ కుక్క కొన్ని రోజుల కిందట చనిపోయిందని స్థానికులు చెబుతున్నారు.
Also Read: Delhi High Court: ఆ కోడలికి అత్తవారింట్లో నివసించే హక్కు లేదు: ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు
Also Read: NIA Searches: విరసం నేత పినాకపాణిని ఐదు గంటలకు పైగా విచారించిన ఎన్ఐఏ, సెల్ ఫోన్ సీజ్