NIA Search: కర్నూలు(Kurnool) నగరంలో ఎన్ఐఏ సోదాలు(NIA Searches) నిర్వహించింది. విరసం కార్యవర్గసభ్యుడు పినాకపాణి(Pinakapani) ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. కేరళ(Kerala)కు సంబంధించిన కేసులో పినాకపాణికి ఎన్ఐఏ నోటీసులు ఇచ్చింది. ఎన్ఐఏ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నోటీసులు జారీచేశారు. తదుపరి విచారణ కోసం 3వ పట్టణ పోలీసు స్టేషన్ కు రావాలని ఎన్ఐఐ అధికారులు పినాకపాణిని కోరారు. కేరళకు తానెప్పుడూ వెళ్లలేదని అక్కడ తనకు పరిచయస్థులు కూడా ఎవ్వరూ లేరని పినాకపాణి అన్నారు. అలాంటిది కేరళలలో తనపై రాజద్రోహం కేసు నమోదు చేయడం, ఆ కేసులో A2గా నమోదు చెయ్యడం దారుణమని పినాకపాణి తెలిపారు. గతంలో కూడా ఎన్ఐఏ అధికారులు పినాకపాణి ఇంట్లో సోదాలు చేశారు. పినాకపాణి ఇంట్లో ఎన్ఐఏ అధికారులు పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 


పినాకపాణి ఫోన్ సీజ్


విరసం నేత పినాకపాణిని ఎన్ఐఏ పోలీసులు కర్నూలు 3వ పట్టణ పోలీస్ స్టేషన్(Police Station) లో విచారించారు. విచారణ అనంతరం ఆయన సెల్ ఫోన్ ను సీజ్ చేశారు. త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో పినాకపాణిని ఐదు గంటల పాటు విచారించారు. ఎప్పటిదో తెలియని కేసును బయటకు తీసుకొచ్చి తనను అక్రమంగా ముద్దాయిగా చేర్చారని పినాకపాణి ఆరోపించారు. దాదాపు 5 గంటల పాటు ఎన్ఐఏ అధికారులు విచారించినా కేసు వివరాలను వెల్లడించలేదని ఆయన అన్నారు. మావోయిస్టు రాజకీయాలతో సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో విచారణ జరిగిందన్నారు.  కేరళ రాష్ట్రం కొచ్చికి తాను ఎప్పుడు వెళ్లలేదని పినాకపాణి అన్నారు. అక్కడి వారితో తనకు పరిచయాలు లేవని, ఈ కేసులో ఉన్న ఇతర వ్యక్తులు తనకు తెలియదన్నారు. ఎన్ఐఏ అంటే నరేంద్రమోదీ, అమిత్ షాల సంస్థ అని వారు ఎలా చెబితే అలా ఆడుతుందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారు, ప్రజల హక్కులపై పోరాడే వారిపై నరేంద్రమోదీ, ఎన్ఐఏ తప్పుడు కేసులు నమోదు చేయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని విరసం నేత పినాకపాణి ఆరోపించారు. 


గతేడాది సోదాలు 


గతంలోనూ పినాకపాణిని ఎన్‌ఐఏ విచారించింది. గతేడాది పినాకపాణి ఇంట్లో ఎన్‌ఏఐ(NIA) అధికారులు సోదాలు నిర్వహించారు. కేరళకు చెందిన ఎన్‌ఐఏ డీఎస్పీ సాజీమున్, ఇతర సిబ్బంది సోదాలు చేశారు.  అప్పుడు పినాకపాణి ఇంట్లో ఉన్న కొన్ని పుస్తకాలు, పెన్‌డ్రైవ్, హార్డ్ డిస్క్‌లను ఎన్‌ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


Also Read: TDP Assembly : బడ్జెట్ సమావేశాలకు టీడీపీ హాజరు - చంద్రబాబు మినహా ఎమ్మెల్యేలు వెళ్లాలని నిర్ణయం !