ప్రేమకు కులం, మతమే కాదు వయసుతో కూడా పని లేదని నిరూపించింది ఓ జంట. వారిద్దరి పెళ్లి ఫోటోలు చూసి అప్పట్లో ప్రపంచమే ఆశ్చర్యపోయింది. హీరోలాంటి ఓ నవయువకుడు తన కన్నా 53 ఏడేళ్లు పెద్దదైమన ఓ ముసలామెను ప్రేమించాడు. ఆమె కూడా అతడిని ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసకున్నారు. ఇదంతా జరిగింది 2015లో అప్పట్లో వీరిద్దరి ఫోటోలు వైరల్ గా మారాయి. చాలా మంది వారి పెళ్లి సమయంలో ఎన్నో కామెంట్లు చేశారు. ఈ పెళ్లి మూణ్నాళ్ల ముచ్చటేనని ఒకరంటే, ఆమెకు ఆస్తి ఉండుంటుంది అది తీసుకున్నాక ఆమెను వదిలేస్తాడు అంటూ రకరకాల కామెంట్లు చేశారు. కానీ వారికి షాకిచ్చేలా ఈ జంట అన్యోన్యంగా బతకసాగారు. వారికి పెళ్లై ఆరేళ్లు అవుతున్నా వారిద్దరూ ప్రేమగా నివసిస్తున్నారు. కాకపోతే వారికున్న లోటు ఒకటే... పిల్లలు.
అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో జీవిస్తోంది ఈ జంట. పేర్లు గేరీ, అల్మెడా. ప్రస్తుతం గేరీకి 24, అల్మెడాకు 77. 2015లో వారి పెళ్లి సమయానికి గేరీకి 17 ఏళ్లు కాగా, అల్మెడాకు 71. వీరిద్దరికీ 53 ఏళ్ల వయసు తేడా. అల్మెడాకు మనవడి వయసు గేరీది. గేరీ మీడియాతో మాట్లాడుతూ ‘మా పెళ్లిజీవితం చాలా ఆనందంగా ఉంది. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బావుంటుంది. అందుకే మేము కలిసి ఉండగలుస్తున్నాం. ఆమె నా సోల్ మేట్’ అని చెప్పాడు.
ఈ జంట ఈ మధ్యనే ఒక కారు కొనుక్కున్నారు. వచ్చే ఏడాది సొంత ఇల్లు కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నారు. అప్పట్లో వీరిని విమర్శించిన చాలా మంది ఇప్పుడు ఈ జంటకు మద్దతుగా నిలుస్తున్నారు. అంతేకాదు వారి కుటుంబాలు కూడా ఇప్పుడు వీరి ప్రేమను, పెళ్లిని అంగీకరించాయి. అల్మెడాకు మునిమనవరాళ్లు కూడా ఉన్నారు.
[/insta]