Gold Rate Today: ఉక్రెయిన్, రష్యా యుద్ధం వల్ల బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర రూ.700 మేర భారీగా ఎకబాకింది. 2022లో గరిష్ట ధరలను నమోదుచేసింది. పసిడి బాటలోనే పయనిస్తూ వెండి ధర భగభగ మండుతోంది. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర (Gold Rates Today In Hyderabad) రూ.760 మేర పెరగడంతో తాజాగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,400 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.52,800కి చేరింది. స్వచ్ఛమైన వెండి ధర రూ.900 మేర పెరగడంతో హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.73,400 కు చేరింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు ముందు కేజీ వెండి ధర దేశంలో రూ.68 వేలుగా ఉండేది.
ఏపీలో బంగారం ధర.. (Gold Rate In Andhra Pradesh)
ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు వరుసగా రెండోరోజు పెరిగాయి. విజయవాడలో రూ.700 మేర బంగారం ధర (Gold Rate in Vijayawada 6th March 2022) పెరగడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,800 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,400కి ఎగబాకింది. విజయవాడలో వెండిపై రూ.900 పెరగడంతో 1 కేజీ ధర రూ.73,400 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్‌లో బంగారం, వెండి ఇదే ధరలో ట్రేడింగ్ అవుతోంది. విశాఖపట్నం, తిరుపతిలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,800 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.48,400 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ప్రధాన నగరాల్లో బంగారం ధర..
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో దేశంలో బులియన్ మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర రూ.760 మేర పెరగడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,800 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,400 గా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,800 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,400 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,400 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,800 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,800 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,400 గా ఉంది.
ప్లాటినం ధర
బంగారంతో పాటు మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధరలు పలు నగరాలలో ఇలా ఉన్నాయి.
ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ.26,580 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
హైదరాబాద్‌లో రూ.44 పెరిగి 10 గ్రాముల ధర రూ.26,580కి ఎగబాకింది.
చెన్నైలో 10 గ్రాముల ధర రూ.26,580 కు చేరింది.
ముంబైలో రూ.44 పెరిగి 10 గ్రాముల ధర రూ.26,580 అయింది.
పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: Petrol Price Today: వాహనదారులకు ఊరట ! పలుచోట్ల స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు - లేటెస్ట్ రేట్లు ఇవీ
Also Read: Priyanka Narula: చింతకాయతో వరల్డ్ ఫేమస్, హైదరాబాద్ మహిళ వండర్‌ఫుల్ విక్కర్ స్టోరీ