2022 Kia Seltos Facelift: కియా సెల్టోస్ 2022 ఫేస్ లిఫ్ట్ కార్లు మనదేశంలో కొన్ని రోజుల్లో లాంచ్ కానున్నాయి. దీని గురించి వివరాలు కూడా మెల్లగా రివీల్ అవుతున్నాయి. ఈ కొత్త కియా సెల్టోస్‌లో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం (ఏడీఏఎస్) కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన స్పై షాట్లు కూడా ఆన్‌లైన్‌లో కనిపించాయి.


దీనికి సంబంధించిన టెస్ట్ మాడ్యూల్ కూడా రోడ్ల మీద  కనిపించింది. దీన్ని పూర్తిగా కప్పి ఉంచినా దీని డిజైన్ వివరాలు బయటకు తెలుస్తూనే ఉన్నాయి. అయితే కలర్ వేరియంట్, పూర్తి స్థాయి డిజైన్ గురించి మాత్రం ఇంకా తెలియరాలేదు.


ఈ కారు డిజైన్ చూడటానికి కియా స్పోర్టేజ్ తరహాలో ఉంది. అయితే భారత దేశానికి తగ్గట్లు కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. ఇందులో కొత్త తరహా ఎల్ఈడీ హెడ్ లైట్లు, రీడిజైన్ చేసిన అలోయ్ వీల్స్, రివైజ్ చేసిన వెనకవైపు లైట్లు ఉండనున్నాయి.


నిజానికి కియా ఇండియా ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్‌ను కూడా అందించనుందని తెలుస్తోంది. ప్రస్తుతం కియా తన మిడ్ రేంజ్ ట్రిమ్ కార్లలో సింగిల్ పేన్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ను అందిస్తుంది కాబట్టి సన్‌రూఫ్ కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ వేరియంట్లో ఉండే అవకాశం ఉంది.


కియా సెల్టోస్ డీజిల్ వేరియంట్లను కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లోని కొన్ని దేశాల్లో తొలగించనుందని తెలిసినా... మనదేశంలో మాత్రం అందించే అవకాశం ఉంది. ఎందుకంటే మనదేశంలో అమ్ముడుపోయే కార్లలో డీజిల్ వేరియంట్లే ఎక్కువ.  మనదేశంలో 2022 కియా సెల్టోస్ 1.4 లీటర్ జీడీఐ టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ నాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్,  1.5 లీటర్ సీఆర్‌డీఐ డీజిల్ ఇంజిన్ వేరియంట్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.


Also Read: Baleno Vs Swift: బలెనో వర్సెస్ స్విఫ్ట్ - బడ్జెట్ కార్లలో ఏది బెస్ట్!


Also Read: ఏకంగా మూడు కొత్త కార్లు లాంచ్ చేయనున్న జీప్ - అదిరిపోయే ఫీచర్లు - ధర కూడా తక్కువగానే!