టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూజాహెగ్డే 'దువ్వాడ జగన్నాథం' సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ.. హిట్టు మీద హిట్టు కొడుతూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. ప్రభాస్, సల్మాన్ ఖాన్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో కలిసి ఆడిపాడుతోంది. ఈ బ్యూటీ ఫ్యాన్ బేస్ ఓ రేంజ్ లో పెరిగింది. 


ప్రస్తుతం పూజాహెగ్డే నటించిన 'రాధేశ్యామ్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది పూజాహెగ్డే. చెన్నై, ముంబై అంటూ గ్యాప్ లేకుండా తిరుగుతుంది. ఈ సినిమాతో ఆమె మరో హిట్టు అందుకోవడం ఖాయమంటున్నారు. ఈ సినిమా సక్సెస్ అయితే గనుక పూజా రేంజ్ మరింత పెరిగిపోతుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. 


ఫ్యూచర్ లో ఏ హీరోలతో కలిసి నటించాలనుకుంటున్నారని..? పూజాహెగ్డేని ప్రశ్నించగా.. ఆమె కమల్ హాసన్, రణబీర్ కపూర్, ధనుష్ ల పేర్లు చెప్పింది. ఇప్పటికే ఈ బ్యూటీ తమిళంలో విజయ్ సరసన 'బీస్ట్' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో కోలీవుడ్ లో హిట్టు కొడితే ధనుష్ లాంటి హీరోలు అవకాశాలు ఇవ్వడం గ్యారెంటీ. ఇక హిందీలో సల్మాన్ తో ఓ సినిమా చేస్తోంది పూజా. ఫ్యూచర్ లో మరిన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్ లో నటించడం ఖాయం. ఈ లెక్కన చూస్తుంటే ఆమె కోరిక త్వరలోనే తీరేలా కనిపిస్తుంది.