బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీలో మొదటివారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. నామినేషన్స్ లో మొత్తం ఐదుగురు వారియర్స్, ఇద్దరు ఛాలెంజర్స్ ఉన్నారు. వారియర్స్ టీమ్ నుంచి సరయు, ముమైత్ ఖాన్, అరియానా, నటరాజ్ మాస్టర్, హమీద ఎలిమినేషన్ కి నామినేట్ కాగా.. ఛాలెంజర్స్ టీమ్ నుంచి మిత్రాశర్మ, ఆర్జే చైతు నామినేట్ అయ్యారు. దీంతో ఈసారి మిత్రా శర్మ వెళ్లిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ముమైత్ ఖాన్ ఎలిమినేట్ కానుందని సమాచారం.
నిజానికి ఓట్ల పరంగా ముమైత్ ఖాన్, సరయు, మిత్రాశర్మ ముగ్గురూ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. వీరికి చాలా తక్కువ పెర్సెంటేజ్ లో ఓటింగ్ జరిగింది. అయితే అఫీషియల్ ఓటింగ్ లో మాత్రం ముమైత్ వెనకబడి ఉందని తెలుస్తోంది. అందుకే ఈ వారం ఆమె ఎలిమినేట్ అవ్వడం ఖాయమని సమాచారం. ఈరోజు సాయంత్రం నుంచి సండే ఫన్ డే షో మొదలుకానుంది. అయితే దీనికి సంబంధించిన షూటింగ్ ముందే జరిగిపోతుంది కాబట్టి ముమైత్ ఎలిమినేట్ అయిందనే విషయం బయటకొచ్చింది.
శనివారం హౌస్ మేట్స్ తో గేమ్ ఆడిస్తూ.. కొంతమందిని సేఫ్ చేసిన నాగార్జున.. సండే గేమ్స్ ఆడిస్తూ.. ముమైత్ ఖాన్ ని ఎలిమినేట్ చేసినట్లుగా చెబుతున్నారు. ఈ వారంలో ముమైత్ ఆట తీరు జనాలను పెద్దగా ఆకట్టుకోలేదు. తెలుగు రాకపోవడంతో కాస్త ఇబ్బంది పడుతోంది. ఎవరైనా తనపై కామెంట్స్ చేస్తుంటే తీసుకోలేకపోతుంది. నిన్నటి ఎపిసోడ్ లో హమీదతో శృతిమించిన ఫన్ చేసింది.
ఆమె శరీరాన్ని తడిమేస్తూ.. వింతగా ప్రవర్తించింది. టాస్క్ లలో బాగా ఎమోషనల్ అవుతుంది. ముమైత్ నుంచి ఆశించినంత పెర్ఫార్మన్స్ రాలేదు. అందుకే ఆమెకి పెద్దగా ఓట్లు పడలేదని తెలుస్తోంది. దీంతో మొదటి వారంలోనే ముమైత్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వక తప్పడం లేదు. ఫస్ట్ వీక్ లోనే వారియర్స్ టీమ్ నుంచి ఒకరు ఎలిమినేట్ అయితే ఇక హౌస్ మేట్స్ గేమ్ ని మరింత సీరియస్ గా తీసుకోవడం ఖాయం!