కోవిడ్-19 మళ్లీ కోరలు చాచే సమయం వచ్చేస్తోంది. కొన్ని నెలలు నిశబ్దంగా ఉన్న కరోనా.. ఇప్పుడు చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటికే కొత్త వేరియెంట్ ఒమిక్రాన్.. దేశమంతా పాకేసింది. దీనికి తోడు ప్రమాదకర డెల్టా వేరియెంట్ కేసులు కూడా నెమ్మదిగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన రోజులు వచ్చేశాయి. ఇకపై తప్పకుండా మాస్క్‌లు ధరిస్తూ.. జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే.. ఏ క్షణంలోనైనా ఒమిక్రాన్ మీపై దాడి చేయొచ్చు. ప్రస్తుతం వేగంగా పాకుతున్న ఒమిక్రాన్ వేరియెంట్‌ను చాలామంది తక్కువ అంచనా వేస్తున్నారు. అయితే, ఇది డెల్టాతో కలిసి వ్యాపిస్తే ప్రాణాలు పోతాయ్.
ఆరోగ్యంగా ఉండే వ్యక్తులకు ఒమిక్రాన్ సోకినా పెద్దగా లక్షణాలేవీ కనిపించవు. కానీ, వారి వల్ల ఇతరులకు వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంది. ఇదివరకే ఏదైనా అనారోగ్యం, ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే.. వారికి ఒమిక్రాన్ ప్రమాదకారిగా మారవచ్చు. కాబట్టి.. ఈ లక్షణాలు కనిపించగానే వెంటనే అప్రమత్తమై వైద్యుడిని సంప్రదించండి.
కొత్త ఒమిక్రాన్ సోకిన బాధితుల్లో మరికొన్ని కొత్త లక్షణాలు కూడా కనిపిస్తున్నాయట. సాధారణంగా కరోనా డెల్టా వేరియెంట్ సోకినట్లయితే.. జ్వరం, అలసట, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, వాంతులు, శ్వాస ఆడకపోవడం, అతిసారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో తలనొప్పి, పొడి దగ్గు ఎక్కువగా ఉంటుంది. మరికొందరు రుచి, వాసన కోల్పోతారు. వీటికి వ్యతిరేకమైన లక్షణాలు.. అంటే తక్కువ జ్వరం, నీరసం, ఆయాసం వంటివి వస్తున్నట్లయితే.. ఒమిక్రాన్‌గా అనుమానించాలి. గొంతు పట్టినట్లు.. గీసినట్లుగా ఉన్నా సరే ఒమిక్రాన్ లక్షణంగా భావించాలి. ఒమిక్రాన్ లక్షణాలు స్వల్పంగా ఉండటం వల్ల అది ఒమిక్రానా లేదా సాధారణ జ్వరమా అని గుర్తించలేక ప్రజలు గందరగోళానికి గురవ్వుతున్నారు. పరీక్షలు చేయించుకోకుండా ఒమిక్రాన్ వ్యాప్తికి కారణమవుతున్నారు. ఈ నేపథ్యంలో మరికొన్ని లక్షణాల ద్వారా కూడా ఒమిక్రాన్‌ను గుర్తించవచ్చు. అవేంటో చూడండి.
Also Read: దేశీయులు మహా రసికులు.. ఒక్కొక్కరూ 14 మందితో సెక్స్.. మనోళ్లు వెనుకబడ్డారే!
ఒమిక్రాన్ కొత్త లక్షణాలు ఇవే:
❂ అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) పేర్కొన్న వివరాల ప్రకారం.. మీ చేతి, కాళ్ల గోళ్లు పాలిపోయినా, బూడిద లేదా నీలం రంగులోకి మారినా ఒమిక్రాన్ కావచ్చేమోనని అనుమానించాలి.
❂ ఇక యూకేలో ఒమిక్రాన్ సోకిన బాధితుల కళ్లు ఎర్రగా మారుతున్నాయట. కొందరికి జుట్టు కూడా రాలిపోతుందట. కరోనా ముక్కు ద్వారానే కాకుండా కళ్ల నుంచి కూడా ప్రవేశించే అవకాశం ఉందని ఇదివరకే వైద్యులు హెచ్చరించారు. దీనివల్ల కొందరిలో వాపు, డిహైడ్రేషన్ లక్షణాలు కనిపించినట్లు చెబుతున్నారు. కళ్లుగా ఎర్రగా మారినా, నొప్పి కలిగినా వైద్యుడిని సంప్రదించాలి.
Note: ఇది ‘ఏబీపీ దేశం’ ఒరిజినల్ కంటెంట్. కాపీరైట్స్ కింద చర్యలు తీసుకోబడతాయి.
Also Read: యాసిడ్ దాడి చేసిన వ్యక్తినే ప్రేమించి పెళ్లాడిన యువతి, చివరికి ఊహించని ట్విస్ట్...
Also Read: వామ్మో.. కొప్పులో పాము, ఆమె జడను చూసి జడుసుకున్న జనం, వీడియో వైరల్
Also Read: ఇలా హగ్ చేసుకుంటే.. శృంగారానికి ‘సై’ అన్నట్లే.. ఒక్కో కౌగిలింతకు ఒక్కో అర్థం!
Also Read: ఓనరమ్మతో భర్త సయ్యాట.. డోర్ బెల్ కెమేరాకు చిక్కిన శ్రీవారి లీలలు! (వీడియో)
Also Read: బాయ్‌ఫ్రెండ్ ముద్దు పెట్టలేదని పోలీసులకు కాల్ చేసిన ప్రియురాలు, చివరికి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి