ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో జీవోను వెనక్కి తీసుకుంది.  పంచాయితీ సర్పంచులు, సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ జారీ చేసిన జీవో నెం.2ను ఉపసంహరించుకుంటున్నట్లుగా ఏపీ హైకోర్టుకు తెలిపింది. ఈ జీవో అమలును గత జూలైలో హైకోర్టు సస్పెండ్ చేసింది.  రాజ్యాంగబద్దంగా పంచాయతీ సర్పంచర్‌లు, సెక్రటరీలకు వచ్చిన అధికారాలను ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా జీవో ద్వారా వీఆర్వోలకు బదిలీ చేసిందని ఆరోపిస్తూ గుంటూరు జిల్లా తురకపాలెం సర్పంచ్ కృష్ణమోహన్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలుచేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు జీవో నెం.2ను సస్పెండ్ చేస్తూ జూలైలో ఉత్తర్వులు ఇచ్చింది. 


Also Read: చెత్తపన్ను కట్టకపోతే ఇంటి ముందే చెత్త పోస్తారట... వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే హెచ్చరిక !


ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన ర్వాత  గ్రామాల్లో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ సచివాలయాల ద్వారానే గ్రామాల్లో పాలన సాగుతోంది. అయితే ఇప్పటివరకు సచివాలయాల పర్యవేక్షణ బాధ్యత పంచాయితీరాజ్ పరిధిలో వుండగా...  జీవో నెం.2 ద్వారా  రెవెన్యూ శాఖకు బదలాయించినట్లయింది.  వాలంటీర్లతో పాటు మిగతా సచివాలయ సిబ్బంది రెవెన్యూ వ్యవస్థలోకి బదలాయించడం ద్వారా సర్పంచ్ ల అధికారాలను ప్రభుత్వం తగ్గించేసినట్లయింది. 


Also Read: జగన్ మళ్లీ అధికారం చేపట్టకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా.... డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు


 రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 73 సవరణకు, ఏపీ పంచాయితీ రాజ్ చట్టానికి వ్యతిరేకంగా జీవో ఉందని ... పంచాయతీ సర్పంచ్‌ అధికారాలు వీఆర్‌వోలకు ఎలా ఇస్తారని అప్పటి విచారణలో హైకోర్టు ప్రశ్నించింది.  గ్రామపంచాయతీ కార్యాలయాలు, సర్పంచుల వ్యవస్థ ఉండగా.. సమాంతరంగా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించింది. సంక్షేమ పథకాలను పంచాయతీల ద్వారా ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్లకూడదని అడిగింది. రాష్ట్రానికి సీఎం ఎలా అధిపతో.. పంచాయతీలకు సర్పంచ్‌ కూడా అలాగేనని ధర్మాసనం విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది.


Also Read: అమరావతి కార్పొరేషన్ దేని కోసం ? అభివృధ్ది కోసమా ? రాజకీయం కోసమా ?


ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం అసలు జీవోను ఉపసంహరించుకుంటామని వెకేట్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే గతంలో  ప్రభుత్వం తరపునదాఖలు చేసిన కౌంటర్‌లో తప్పులు ఉన్నాయని సవరించుకునేలోపే కోర్టుకెళ్లారని మంత్రి చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం ప్రస్తావించింది. ఆ వ్యాఖ్యలకు భిన్నంగా వెకేట్ పిటిషన్ వేయడం ఏమిటని ప్రశ్నించింది.  ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని న్యాయవాది చెప్పడంతో తుదుపరి విచారణను జనవరి 20వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి