Home Remedies That Actually Work : పెద్దవారు ఉంటే.. ఇంట్లోవారికి బాలేనప్పుడు కొన్ని ఇంటిచిట్కాలు సూచిస్తారు. చిన్నపాటి గాయాలు, జలుబు, బొబ్బలు వంటి వాటికి చికిత్స చేయడానికి హోమ్ రెమిడీలు వాడుతారు. అవి ప్రభావవంతంగా పనిచేస్తాయి కూడా. కొన్నిసందర్భాల్లో డాక్టర్లు కూడా వాటిని సిఫార్సు చేస్తారు. గాయమైనప్పుడు పసుపును అప్లై చేసేవారు. ఇప్పడంటే డెటాల్ వచ్చింది కానీ.. అప్పట్లో గాయలకు పసుపును అప్లై చేసేవారు. దానిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు.. గాయాన్ని తగ్గించడంలో బాగా హెల్ప్ చేసేది. అలాగే ఇంటి ఆవరణలో దొరికే తులసి, అల్లం, తేనెలతో వివిధ సమస్యలు తగ్గించడానికి ఉపయోగించేవారు. 


ఇప్పటికీ ఈ ఇంటి నివారణలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. ప్రతిసారి మందుల వినియోగానికే కాకుండా అప్పుడప్పుడు ఇంటి చిట్కాలను ఫాలో అయితే.. ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది. తలనొప్పి, జ్వరం వంటివి వస్తే ముందు మెడిసన్ వేసుకోకుండా సహజంగా దానిని తగ్గించే మార్గాలున్నాయా? అని ఆలోచించాలి. అయితే ఇప్పటికీ అనేక రకాల సమస్యలకు ప్రభావవంతంగా పనిచేసే కొన్ని సింపుల్ చిట్కాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 


పెట్రోలియం జెల్లీ


పెట్రోలియం జెల్లీ బాటిల్స్​ దాదాపు అందరి ఇళ్లలో ఉంటాయి. దీనిని పెదాలు పగలకుండా ఎక్కువగా వినియోగిస్తారు. అయితే దీనిని పాదాలు పగిలినప్పుడు కూడా ఉపయోగిస్తారు. కానీ నీటి పొక్కులను తగ్గించడంలో కూడా ఇది బాగా పనిచేస్తుందని మీకు తెలుసా? కొత్త చెప్పులు వేసుకున్నప్పుడు, వివిధ కారణాలతో బొబ్బలు వస్తాయి. వాటిని అలాగే వదిలేస్తే.. పుండుగా మారుతాయి. అప్పుడు మీరు ఈ పెట్రోలియం జెల్లీని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేస్తే ఉపశమనం పొందవచ్చు. 


కాలిన గాయాలకు


కలబందను హెయిర్​, స్కిన్​ కోసం చాలా విధాలుగా ఉపయోగిస్తారు. అయితే కాలిన గాయాలకు కూడా ఇది చాలా మంచిది ఔషదమని అధ్యయనాలు నిరూపించాయి. అయితే స్వచ్ఛమైన జెల్​ను అప్లై చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి. ప్యాక్డ్ జెల్​లో కెమికల్స్ ఉంటాయి కాబట్టి.. ఇంటి ఆవరణలో ఉండే మొక్కల గుజ్జును అప్లై చేయవచ్చు. 


అతిసారం సమస్యలకు


డయేరియాను కంట్రోల్ చేయడానికి పచ్చి అరటిపండ్లు తినేవారు. ఇది అతిసారం సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోంటుంది. దీనిలోని అధిక పొటాషియం డయేరియాతో బాధపడేవారికి మంచి ఆహారంగా చెప్తారు. దీనిని నేరుగా తీసుకున్నా.. ఇతర వంటకాలతో కలిపి తీసుకున్నా మంచిది. అంతేకాకుండా మెరుగైన జీర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి. 


అజీర్ణం కోసం.. 


భోజనం చేసిన తర్వాత అజీర్ణం సమస్యలు రాకుండా చాలామంది సోంపు గింజలు తింటారు. ఇప్పటికీ దీనిని రెగ్యూలర్​గా తీసుకునేవాళ్లు చాలామంది ఉన్నారు. మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తాయి. 


సైనసిటిస్ ఉంటే


సైనస్ సమస్య చాలామందిని ఇబ్బంది పెడుతుంది. అయితే దాని నుంచి ఉపశమనం పొందడానికి.. మీరు యూకలిప్టస్ నూనెను ఉపయోగించవచ్చు. నీటిలో యూకలిప్టస్ ఆయిల్​ వేసి.. మరిగించి.. స్టౌవ్ ఆపేసి.. ఆవిరి పడితే రిలాక్స్​ అవ్వొచ్చు.ఇది తీవ్రమైన సైనసిటిస్​ నుంచి వేగంగా కోలుకోవడంలో సహాయపడుతుందని పరిశోధనలు కూడా నిరూపించాయి. మైగ్రేన్ సమస్యతో ఇబ్బంది పడేవారికి కూడా ఇది మంచి ఉపశమనం ఇస్తుంది. 


పంటి నొప్పికి


దంతాలు, చిగుళ్ల నొప్పిని దూరం చేయడంలో లవంగాలు, లవంగం నూనె ఇప్పటికీ మంచి మెడిసన్​గా చెప్తారు. ఇది పంటినొప్పిని దూరం చేసి.. వెంటనే ఉపశమనం ఇస్తుంది. అందుకే దీనిని శతాబ్ధాలు పంటి సమస్యలను దూరం చేసుకోవడం కోసం ఉపయోగిస్తున్నారు. అయితే లవంగం నూనెను జాగ్రత్తగా ఉపయోగించాలి. లేదంటే చిగుళ్లు, దంతాల గుజ్జు దెబ్బతింటుంది. లవంగం నూనె తక్షణమే ఉపశమనాన్ని ఇస్తుంది. సమస్య తీవ్రంగా ఉంటే.. వైద్యుని కచ్చితంగా సంప్రదించాలి. 


అవిసెగింజలతో..


అవిసెగింజల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను సహజంగా దూరం చేస్తుంది. రోజూ 2 టేబుల్ స్పూన్ల అవిసెగింజల పొడిని తీసుకుంటే.. సమస్య తగ్గుతుందని ఓ అధ్యయనంలో కూడా తేలింది. ఈ పొడిని లేదా అవిసెగింజలను నీటితో తీసుకుంటే చాలా మంచిది. గర్భిణీలు వీటిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి. 


ఇవేకాకుండా మరిన్ని చిట్కాలు


డార్క్ సర్కిల్స్​ను పోగొట్టుకోవడం కోసం కీరాను ఉపయోగించవచ్చు. ఇవి కంటికి విశ్రాంతినిచ్చి.. డార్క్ సర్కిల్స్​ను దూరం చేస్తాయి. శరీర దుర్వాససను తగ్గించుకోవడంలో లావెండర్ ఆయిల్ బాగా పనిచేస్తుంది. నిద్ర సమస్యలతో ఇబ్బంది పడేవారు అశ్వగంధను ఉపయోగించవచ్చు. ఇది ఒత్తిడి, అలసటను దూరం చేస్తుంది. క్రాన్బెర్రీ జ్యూస్ యూరీనరి ట్రాక్ట్​ ఇన్ఫెక్షన్స్​ను దూరం చేస్తుంది. గాయాలను తగ్గించుకోవడం కోసం తేనెను కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది గాయాలను వేగంగా తగ్గిస్తుంది. పాలల్లో పసుపు కలిపి తాగితే జలుబు, దగ్గు దూరమవుతాయి. ఇలాంటి ఎన్నో పాత చిట్కాలు ఇప్పటికీ కూడా ఫాలో అవ్వొచ్చు. అయితే ఏది ఫాలో అవ్వాలన్నా.. వైద్యుడి సలహా తీసుకుని తర్వాతా పాటిస్తే మంచిది.


Also Read : యువతలో పెరుగుతున్న క్యాన్సర్​ కేసులు.. బ్రిటన్ యువరాణికి కూడా తప్పని వైనం


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.