Kate Middleton Health : ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ క్యాన్సర్​తో బాధపడుతున్నారనే వార్తలకు చెక్ పెడుతూ ఆమె ఓ వీడియో రిలీజ్ చేసింది. వివిధ అంశాలపై సోషల్ మీడియాలో పెరుగుతున్న రూమర్స్​కు చెక్​ పెట్టారు. అఫీషయల్​గా ఓ వీడియోను రిలీజ్​ చేసి.. తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలిపారు. ఇటీవల తన పొత్తికడుపులోని ఓ సమస్యకు శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు తెలిపారు కేట్. ఈ చికిత్స నేపథ్యంలోనే తనకు క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారని తెలిపింది. దానికోసం తగిన చికిత్స తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు.


నిర్ధారణ త్వరగా అయితే..


క్యాన్సర్ రావడానికి ధన, వయసు తేడా ఏమి లేదని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. అందుకే అందరూ క్యాన్సర్ పట్ల మెరుగైన అవగాహనతో ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. ప్రారంభంలోనే రోగనిర్ధారణ చేస్తే.. వైద్యం చేయడం సులభమవుతుందని చెప్తున్నారు. పైగా ఈ మధ్య యువతల్లోనే క్యాన్సర్​ కేసులు పెరుగుతున్నాయని చెప్తున్నారు. కానీ ప్రారంభంలోనే క్యాన్సర్​ను నిర్ధారణను గుర్తిస్తే.. ప్రాణాలతో వారిని కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని బర్మింగ్​హామ్​ యూనివర్శిటికీ చెందిన ప్రొఫెసర్ ఆండ్రూ తెలిపారు. 45 ఏళ్లలోపు ఉన్నవారికి క్యాన్సర్​ సోకితే.. వారు కీమోథెరపీని బాగా తట్టుకోగలరని చెప్తున్నారు. అయితే దానిని ఆలస్యం చేసే కొద్ది సమస్య తీవ్రమవుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనో షాకింగ్ విషయాన్ని కూడా వెల్లడించారు.


45 ఏళ్లలోపు వారికే..


ఈ మధ్య కాలంలో 45 ఏళ్లలోపు ఉన్న వారు చాలామంది క్యాన్సర్​తో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. కానీ వారు క్యాన్సర్​ని త్వరగా గుర్తించకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని తెలిపారు. అయితే క్యాన్సర్​కు ట్రీట్​మెంట్ చేయడంలో మునపటికంటే మెరుగైన చికిత్సలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని.. కాబట్టి ఇలాంటి సమ్యసతో ఇబ్బంది పడేవారు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తారు. యువత తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని చెప్తున్నారు. మొదట్లో లక్షణాలు కనిపించినా.. పర్లేదులే అని వదిలేయకుండా.. ప్రారంభ దశలోనే వైద్య సహాయం తీసుకోవాలి అంటున్నారు. 


ప్రారంభదశలో గుర్తిస్తే మెరుగైన చికిత్స


క్యాన్సర్​ను ఎక్కువ కాలం చికిత్స చేయించకుండా వదిలేస్తే ప్రాణాతంకమవుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం బ్రిటన్ ప్రిన్సెన్స్ కేట్​కు క్యాన్సర్​ ప్రారంభదశలోనే ఉందని.. దాని మేరకు ఆమెకు మెరుగైన చికిత్స అందుతుందని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ప్రారంభదశలో క్యాన్సర్ గుర్తిస్తే.. చికిత్స విజయంవతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా శరీరం కూడా బాగా సహకరిస్తుందని తెలిపారు. 


యువతలో క్యాన్సర్​ రేటు పెరగడానికి కారణాలు ఇవే.. 


యువత, నడివయసులో క్యాన్సర్లు పెరగడానికి అనేక కారణాలు ఉంటున్నాయి. యువతలో పేగు, రొమ్ము క్యాన్సర్లు వారసత్వంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే యువత అలెర్ట్​గా ఉండాలి అంటున్నారు. జన్యుపరమైన మార్పులు తరతరాలకు బదిలీలు అవుతాయి కాబట్టి.. అలాంటి డౌట్ ఏమైనా ఉంటే వెంటనే వాటికి సంబంధించిన వైద్య సాయం తీసుకోవాలి అంటున్నారు. ఇవే కాకుండా పర్యావరణ కారకాలు కూడా క్యాన్సర్​ను పెంచుతున్నాయి. ఊబకాయం కూడా క్యాన్సర్​కు మరో కారణం అవుతుంది. అయితే వీటికి విరుద్ధంగా స్మోకింగ్ చేసేవారిలో క్యాన్సర్ తగ్గుదలని చూపిస్తుందని.. ఇదో మంచి సూచనగా చెప్తున్నారు. 


Also Read : పుచ్చకాయ, పాలు, తేనె నకిలీవో కాదో ఇలా తేల్చేయండి.. కూరగాయలనైతే అలా టెస్ట్ చేయండి