Okra aka Bendakaya Benefits for Diabetes : శరీరంలోకి ఓసారి షుగర్ ఎంట్రీ ఇచ్చిందంటే.. ఇక మనం ఫుడ్ విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ ప్రాణాలకు ఇబ్బంది కలుగుతుంది. అయితే మధుమేహమున్నవారు బెండకాయలు తీసుకోవచ్చా? వీటిని ఎలా తీసుకోవచ్చు.. దీనివల్ల లాభామా? నష్టాలు కూడా ఉంటాయా? నిపుణులు ఇచ్చే సూచనలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


బెండకాయల్లోని పోషకాలు ఇవే..


బెండకాయల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. విటమిన్స్ ఏ, సి కలిగి ఉంటాయి. ఇవి హెల్తీ స్కిన్​ని ప్రమోట్ చేస్తాయి. అంతేకాకుండా కంటి చూపును కూడా మెరుగుపరుస్తాయి. విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచి.. సీజనల్ వ్యాధులను దూరం చేస్తుంది. వీటిలో ఫోలేట్​ విటమిన్ బితో నిండి ఉంటుంది. ఇది సెల్యూలార్ పనితీరు మెరుగుపరిచి జీవక్రియకు మద్ధతు ఇస్తుంది.


మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలు కూడా దీనిలో ఉన్నాయి. ఇవి నరాల పనితీరుతో పాటు.. కండరాలకు బలాన్ని అందిస్తాయి. అంతేకాకుండా ఎముకల ఆరోగ్యానికి సహాయం చేస్తాయి. ఇవేకాకుండా వీటితో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. అవేంటో.. బెండకాయలను ఎలా తీసుకుంటే మంచిదో చూసేద్దాం. 


ఇలా తీసుకుంటే చాలా మంచిది..


బెండకాయలను ముక్కలుగా కట్ చేసి.. నీటిలో వేసి రాత్రంతా ఉండనివ్వాలి. ఉదయాన్నే బెండకాయలు వేరు చేసి ఆ నీటిని తాగితే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. వీటిని నేరుగా కూరల రూపంలో తీసుకున్నా మంచిదే కానీ.. ఇలా తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చట. ఇన్​ఫ్యూజ్ చేసిన నీటిని రెగ్యూలర్​గా తీసుకుంటే పలు ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు అంటున్నారు. 


మధుమేహానికై.. 


మధుమేహాన్ని.. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేసుకోవడానికి బెండకాయ నీటిని తీసుకోవచ్చు. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిస్తుందని.. దానికి సంబంధించిన సమ్మేళనాలు దీనిలో ఉన్నాయని పలు అధ్యయనాలు తెలిపాయి. భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్​ పెరుగుదులను ఇది నివారిస్తుంది. 



జీర్ణ సమస్యలకై.. 


బెండకాయల్లోని జిగురు పదార్థం జీర్ణవ్యవస్థకు ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. ఇది సహజ ఫైబర్​గా పనిచేస్తుంది. వీటిలోని విటమిన్ ఎ, సి వంటి వివిధ పోషకాలు ఉన్నాయి. ఇవి గట్ ఆరోగ్యానికి తోడ్పడే ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉన్నాయి. వీటివల్ల వివిధ రకాల జీర్ణ సమస్యలు కంట్రోల్ అవుతాయి. 


బరువు తగ్గేందుకు.. 


ఈ నీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువును తగ్గించుకునేవారికి మంచి ఎంపిక అవుతుంది. దీనిలోని ఫైబర్ వల్ల కడుపు నిండుగా ఉంటుంది. అతిగా తినడాన్ని నివారిస్తుంది. దీనివల్ల మీరు బయట ఫుడ్ తీసుకోరు. శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి. ఇవి బరువును తగ్గించుకోవడంలో హెల్ప్ చేస్తాయి. అయితే వీటిని తీసుకునే ముందు నిపుణుల సలహాలు తీసుకుంటే చాలా మంచిది. 


Also Read : ఈ ఒక్క మసాలా దినుసుతో మగవారికి ఎన్ని ప్రయోజనాలో.. లైంగిక సమస్యలను కూడా దూరం చేస్తుందట















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.